జియో గిఫ్ట్ కార్డ్ కొంటే ఫోన్‌తో పాటు 6 నెలలు అన్నీ ఉచితం

రిలయన్స్ జియో నూతన సంవ్సతర సెలబ్రేషన్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆ సంస్థ తన ఖాతాదారుకలు జియో గిఫ్ట్‌కార్డ్‌ను అనౌన్స్ చేసింది.

|

రిలయన్స్ జియో నూతన సంవ్సతర సెలబ్రేషన్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆ సంస్థ తన ఖాతాదారుకలు జియో గిఫ్ట్‌కార్డ్‌ను అనౌన్స్ చేసింది. ఈ గిఫ్ట్ కార్డులో‌ జియో ఫోన్‌తో పాటు 6 నెలల ఉచిత డేటా సర్వీసెస్ అలానే వాయిస్ కాల్స్ అందుబాటులో ఉంటాయి. ఈ గిఫ్ట్ కార్డ్ ఖరీదు రూ.1095. ఇందులో రూ.501 జియో ఫోన్‌కు పోతుంది. మిగిలిన మొత్తంతో 99 రూపాయులు ఖరీదు చేసే 6 వోచర్లు లభిస్తాయి.

సిమ్ స్వాప్ : 6 మిస్డ్ కాల్స్ తో 1.86 కోట్లు నొక్కేశారుసిమ్ స్వాప్ : 6 మిస్డ్ కాల్స్ తో 1.86 కోట్లు నొక్కేశారు

జియోఫోన్ హంగామా ఆఫర్ క్రింద...

జియోఫోన్ హంగామా ఆఫర్ క్రింద...

జియోఫోన్ హంగామా ఆఫర్ క్రింద ఈ కొత్త స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు జియో తెలిపింది. అంటే, ఈ గిఫ్ట్ కార్డ్ ఆఫర్‌ను పొందాలనుకునే యూజర్లు తమ పాత జియో‌ఫోన్‌లను కొత్త వాటితో ఎక్స్‌ఛేంజ్ చేసుకోవల్సి ఉంటుంది. యాజర్లు ఈ గిఫ్ట్ కార్డును కొనుగోలు చేసిన తరువాత సమీపంలోని రిలయన్స్ డిజిటల్ లేదా జియో స్టోర్‌కు వెళ్లి, ఆ గిఫ్ట్ కార్డును చూపించి తమ పాత ఫోన్‌ను కొత్త ఫోన్‌తో ఎక్స్‌ఛేంజ్ చేసుకోవల్సి ఉంటుంది. ఎక్స్‌ఛేంజ్ చేసే జియోఫోన్ పూర్తిస్థాయిలో వర్కింగ్ కండీషన్‌లో ఉండాలి. ఫోన్‌తో పాటు ఛార్జర్‌ను కూడా ఇవ్వవల్సి ఉంటుంది.

జియోఫోన్ స్పెసిఫికేషన్స్...

జియోఫోన్ స్పెసిఫికేషన్స్...

2.4 అంగుళాల డిస్‌ప్లే, KAI ఓఎస్, 1.2గిగాహెట్జ్ డ్యుయల్-కోర్ SPRD 9820A/QC8905 ప్రాసెసర్, 512MB ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, వీజీఏ కెమెరా, 4G VoLTE సపోర్ట్, ఇంటర్నెట్ షేరింగ్ హాట్ స్పాట్ సదుపాయం, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 2000mAh బ్యాటరీ, మ్యూజిక్/వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో యాప్.

జియో ఫోన్ ప్రత్యేకమైన ఎమర్జెన్సీ ఫీచర్‌తో వస్తోంది..

జియో ఫోన్ ప్రత్యేకమైన ఎమర్జెన్సీ ఫీచర్‌తో వస్తోంది..

జియో ఫోన్ ప్రత్యేకమైన ఎమర్జెన్సీ ఫీచర్‌తో వస్తోంది. ఫోన్ కీప్యాడ్‌లోని 5 బటన్ పై లాంగ్‌ప్రెస్ ఇవ్వటం ద్వారా ఎమర్జెన్సీ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. ముందుగానే సెట్ చేసుకుని ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఈ ఎమర్జెన్సీ మెసేజ్ లోకేషన్‌తో సహా షేర్ చేయబడుతుంది.

జియో యాప్స్‌...

జియో యాప్స్‌...

జియో‌ఫోన్‌లో జియో యాప్స్‌ సూట్‌తో పాటు జియోఫోన్ బ్రౌజర్, ఫేస్‌బుక్, నరేంద్ర మోదీ మన్ కీ బాత్‌బ్రాడ్ కాస్ట్ యాప్‌లను పొందుపరిచారు. వాయిస్ కమాండ్‌లను జియో ఫోన్ సపోర్ట్ చేస్తుంది. తెలుగుతో సహా 22 ప్రాంతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. NFC సపోర్ట్‌తో వస్తోన్న ఈ ఫోన్ ద్వారా UPI అలానే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు చెల్లింపులను సపోర్ట్ చేస్తుంది.

Best Mobiles in India

English summary
Here's how to get Reliance Jio Phone along with free voice and internet data for 6 months.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X