Reliance Jio ప్రివ్యూ ఆఫర్‌కు, వెల్‌కమ్ ఆఫర్‌కు మధ్య తేడాలేంటి..?

|

Reliance Jio అఫీషియల్‌గా లాంచ్ కాక ముందు యూజర్లకు 'Preview Offer' రూపంలో అందుబాటులో ఉంది. జియో అధికారిక లాంచ్ తరువాత ప్రివ్యూ ఆఫర్ కాస్తా 'Welcome Offer'లా మారిపోయింది.

రిలయన్స్ జియో ప్రివ్యూ ఆఫర్‌కు, వెల్‌కమ్ ఆఫర్‌కు మధ్య తేడాలేంటి..?

Read More : షాకింగ్: రూ.4కే ఎయిర్‌టెల్ 1జీబి 4జీ డేటా?

జియోకు సంబంధించిన అన్ని సర్వీసులను యూజర్లకు ఉచితంగా అందించటమే ఈ రెండు ఆఫర్లు ప్రధాన ఉద్దేశ్యంగా మనం చెప్పుకోవాలి. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న రిలయన్స్ జియో ప్రివ్యూ, వెల్‌కమ్ ఆఫర్ల మధ్య తేడాలను ఇప్పుడు తెలుసుకుందాం..

#1

#1

జియో అందిస్తోన్న ప్రివ్యూ అలానే వెల్‌కమ్ ఆఫర్లకు సంబంధించ ధృక్పదం ఒక్కటే.  రిలయన్స్ జియో అందించే అన్ని సర్వీసులను ఉచితంగా మనకు చేరువ చేయటమే ఈ ఆఫర్ల ప్రధాన సంకల్పం.  ప్రివ్యూ ఆఫర్ అందుబాటులో ఉన్న సమయంలో వాయిస్ కాల్స్ నాణ్యత నాసిరకంగా ఉందని పలువురి అభిప్రాయం.

#2

#2

సెప్టంబర్ 5 తరువాత జియో ప్రివ్యూ ఆఫర్ కాస్తా వెల్‌కమ్ ఆఫర్‌లా మారిపోయిన సంగతి మనందరికి తెలిసిందే. వెల్‌కమ్ ఆఫర్‌లో పరిమితికి మించి డేటా వాడకూడదు. అంటే రోజుకు 4జీబి వరకు మాత్రమే డేటా వాడుకోవల్సి ఉంటుంది. అదికూడా 128కేబీపీఎస్ స్పీడ్ లిమిట్‌తో.

#3

#3

రిలయన్స్ జియో అఫీషియల్‌గా లాంచ్ కాక ముందు యూజర్లకు ఆఫర్ చేసిన ప్రివ్యూ ఆఫర్ పూర్తిగా అన్‌లిమిటెడ్. జియోకు సంబంధించిన అన్ని సర్వీసులను ఈ ఆఫర్‌లో అపరిమితంగా వాడుకునే అవాకాశాన్ని కల్పించారు.

#4

#4

ప్రివ్యూ ఆఫర్‌‌ను వినియోగించుకుంటున్నవారు ఆటోమెటిక్‌గా సెప్టంబర్ 5 తరువాత వెల్‌కమ్ ఆఫర్‌లోకి మైగ్రేట్ అయిపోతారు. అంటే డిసెంబర్ 31, 2016 వరకు అన్ని రకాల జియో సేవలను ఉచితంగా ఆస్వాదించవచ్చన్నమాట.

#5

#5

జియో యాప్స్ పూర్తిగా ఉచితం

రిలయన్స్ జియో నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుంటోన్న ప్రతి ఒక్క యూజర్ జియో అందిస్తోన్న యాప్ సూట్‌ను ఉచితంగా ఆస్వాదించవచ్చు.

#6

#6

ప్రివ్యూ ఆఫర్ సెలెక్టడ్ యూజర్స్‌కు మాత్రమే

పేరుకు తగ్గట్టుగానే జియో ప్రివ్యూ ఆఫర్ సెలక్టెడ్ కస్టమర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంచటం జరిగింది. వెల్‌కమ్ ఆఫర్‌ విషయానికి వచ్చేసరికి, 4జీ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగించే ప్రతిఒక్కరికి ఇది వర్తిస్తుంది.

 

#7

#7

సెప్టంబర్ 5 నుంచి అందుబాటులోకి వచ్చిన రిలయన్స్ జియో Welcome Offer 2016, డిసెంబర్ 31తో ముగుస్తుంది.

 

 

#8

#8

వెల్‌కమ్ ఆఫర్‌ పూర్తి అయిన తరువాత యూజర్లు తాము ఎంపిక చేసుకునే టారిఫ్ ప్లాన్‌ను బట్టి డబ్బులను చెల్లించాల్సి ఉంటుంది. రిలయన్స్ జియో తన టారిఫ్ ప్లాన్‌లను రూ.19 నుంచి రూ.4,999 రేంజ్ వరకు అందుబాటులో ఉంచింది.

#9

#9

రిలయన్స్ జియో 4జీ సర్వీసులు VoLTE సపోర్ట్‌తో వచ్చే ఫోన్‌లను మాత్రమే సపోర్ట్ చేస్తాయి. ఫీచర్ ఫోన్‌లను జియో సేవలు సపోర్ట్ చేయవు.

#10

#10

రిలయన్స్ జియో సిమ్ పొందటం ఎలా..?

మీ దగ్గరలోని రిలయన్స్ డిజిటల్ ఎక్స్‌ప్రెస్ స్టోర్ లేదా రిలయన్స్ డిజిటల్ ఎక్స్‌ప్రెస్ మినీ స్టోర్‌కు వెళ్లి ఫోటో ఐడెంటిటీతో, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను సబ్మిట్ చేసినట్లయితే సిమ్ జారీ చేయబడుతుంది.

Best Mobiles in India

English summary
Here’s the Difference between Reliance Jio Preview and Welcome Offer. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X