Hidden cameras కోసం హోటల్ రూములలో వీటిని చెక్ చేయండి...

|

ప్రపంచం మొత్తం అభివృద్ధి పరంగా వేగంగా పరుగులు తీస్తోంది. ఇందుకోసం అందరు తమను తాము మరిచిపోయి వేగంగా ఒక చోటు నుంచి మరొక చోటికి పరిగెడుతున్నారు. బిజినెస్ ట్రిప్,ఫ్యామిలీ ట్రిప్,పార్టీ ట్రిప్ వంటి ప్రయాణాలలో భాగంగా చాలా మంది కొన్ని బడ్జెట్ హోటళ్లలో దిగుతూ ఉంటారు.

దాచిన కెమెరాలు

ఇటువంటి హోటల్ యాజమాన్యం తమ రూములలో అనేక చోట్ల కెమెరాలను దాచి పెడుతూ ఉంటారు. అక్కడ మీరు పొరపాటున ఏదైనా తప్పుడు కార్యక్రమాలు చేసినచో వారు దానిని రికార్డ్ చేసి మీకు వ్యతిరేకంగా ఉపయోగిస్తూ ఉంటారు.

 

 

 

మహారాష్ట్ర

ఇటువంటి సంఘటన మహారాష్ట్రలోని మహబలేశ్వర్‌ ప్రాంతంలో గల ఒక బడ్జెట్ హోటల్ లో చోటుచేసుకున్నది. వివరాలలోకి వెళితే ఈ హోటల్ లో దిగిన ఒక వ్యక్తి గదిలో దాచిన కెమెరాలు ఉన్నట్లు అనుమానించి మహారాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తనిఖీ చేయగా ఎల్‌ఈడీ దీపం వద్ద సెట్ చేసిన కెమెరా వారికి దొరికింది.

 

 

Redmi నోట్ 9 ప్రో,నోట్ 9 ప్రో మాక్స్ కొత్త స్మార్ట్‌ఫోన్‌ల ధరలు ఇవే !!!Redmi నోట్ 9 ప్రో,నోట్ 9 ప్రో మాక్స్ కొత్త స్మార్ట్‌ఫోన్‌ల ధరలు ఇవే !!!

ట్విట్టర్

గదిలో బస చేసిన అతిథులను ఈ కెమెరా రహస్యంగా చిత్రీకరిస్తోంది అనే విషయాన్ని ఒక అతను ముంబై పోలీసులకు ట్విట్టర్లో నివేదించాడు. అంతేకాకుండా దాచిన కెమెరాను కనుగొన్న తరువాత హోటల్ సిబ్బంది తనను బెదిరించాడని కూడా పేర్కొన్నాడు. ఎల్‌ఈడీ లైట్ యొక్క సెట్‌లో కెమెరాను ఉంచారా లేదా అని పోలీసులు ధృవీకరించేటప్పటికీ ట్విట్టర్ పోస్ట్ వైరల్ అయ్యింది.

 

 

Realme Band సేల్స్ : మళ్ళీ దొరకని ఆఫర్స్ త్వరపడండి...Realme Band సేల్స్ : మళ్ళీ దొరకని ఆఫర్స్ త్వరపడండి...

హోటళ్లు

భారతదేశం అంతటా గల కొన్ని బడ్జెట్ హోటళ్లు ఇటువంటి సమస్యలను ఎదురుకొంటున్నారు. కావున మీరు ఒక హోటల్‌లో ఉంటున్నట్లయితే అందులోకి ప్రవేశించిన వెంటనే రహస్య కెమెరాలు మరియు ఆడియో రికార్డింగ్ వంటి పరికరాల కోసం తనిఖీ చేయడం ఎల్లప్పుడూ మంచిది. హోటల్ గదుల్లో బస చేసేటప్పుడు మీరు ఎల్లప్పుడూ తనిఖీ చేయవలసిన 10 సాధారణ విషయాలు మరియు ప్రదేశాల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

Airtel Wi-Fi broadband తక్కువ ధరలో అందిస్తున్న ప్లాన్‌లుAirtel Wi-Fi broadband తక్కువ ధరలో అందిస్తున్న ప్లాన్‌లు

దాచిన కెమెరాల కోసం మొదటగా వెతకవలసిన ప్రదేశాలు

దాచిన కెమెరాల కోసం మొదటగా వెతకవలసిన ప్రదేశాలు

*** దాచిన కెమెరాల కోసం మొదటగా వెతకవలసిన ప్రదేశాలు స్పీకర్లు, అలారం గడియారాలు మరియు టీవీల స్పీకర్ మెష్ వంటివి. వీటి యొక్క లోపల సులభంగా కెమెరాలు ఉంచబడతాయి. మీ ఫ్లాష్‌లైట్‌తో వాటిని జాగ్రత్తగా తనిఖీ చేయండి. కెమెరాలు ఉన్నాయా లెవా అని ఖచ్చితంగా తెలియకపోతే కనుక వాటిని టిష్యూ పేపర్‌తో కవర్ చేయడం చాలా మంచిది.

*** తరువాత గదిలో ఉన్న ప్రతి వస్తువును ఒక సారి జాగ్రత్తగా గమనించండి. ఇందులో మరీ ముఖ్యంగా లైట్లు, రీడింగ్ లాంప్, ఫోటో ఫ్రేములు మరియు ఏదైనా ఇతర అలంకరణ వస్తువులను జాగ్రత్తగా గమనించండి. మీకు ఖచ్చితంగా తెలియకపోతే కనుక వాటిని తీసివేయండి లేదా దేనితో అయిన కవర్ చేయండి.

 

 

BSNL STV 247 Plan:30రోజులలో 90GB డేటాతో టెల్కోలకు సవాల్!!!BSNL STV 247 Plan:30రోజులలో 90GB డేటాతో టెల్కోలకు సవాల్!!!

 

ఫోటో ఫ్రేమ్‌

*** హోటల్ గది లోపల గల టీవీ మరియు సెట్-టాప్-బాక్స్‌ను జాగ్రత్తగా ఒకటికి పది సార్లు తనిఖీ చేయండి. ముఖ్యంగా పవర్ బటన్ మరియు లైట్ గల ప్రాంతాలను తనిఖీ చేయడం మరచిపోకండి.

*** గది లోపల అలంకరణ కోసం ఉంచిన పువ్వులు మరియు ఇతర అలంకరణ వస్తువులలో ఫోటో ఫ్రేమ్‌లను తనిఖీ చేయండి.

*** గోడ గడియారాలలో కెమెరాలను ఉంచడానికి అధికంగా ఆస్కారం ఉంది. కావున దీనిని జాగ్రత్తగా తనిఖీ చేయండి.

 

ఫ్లాష్‌లైట్‌

*** ఫ్లాష్‌లైట్‌తో వెంటిలేషన్ మరియు AC డెక్టులను సరిగ్గా తనిఖీ చేయండి.

*** కెమెరాలను ఎక్కువగా పవర్ ప్లగ్స్ లేదా సాకెట్లలో ఉంచారు. కావున వాటిని జాగ్రత్తగా తనిఖీ చేయండి లేదా వాటిని మీకు దూరంగా ఉంచండి.

*** పిన్ హోల్ కెమెరాల కోసం బాత్రూంలోని హుక్స్ లేదా టవల్ మరియు హెయిర్ డ్రైయర్ హోల్డర్లను తనిఖీ చేయండి.

 

హిడెన్ కెమెరా

*** హిడెన్ కెమెరాలకు అనువైన ప్రదేశాలు ఫైర్ అలారం మరియు స్మోక్ డిటెక్టర్‌లు కాబట్టి వాటిని ఎల్లప్పుడూ తనిఖీ చేయండి.

*** హిడెన్ కెమెరాల కోసం తలుపులు, అల్మారాలు, డ్రాయర్లు మరియు కర్టెన్ రాడ్ల యొక్క క్నోబ్స్ మరియు హ్యాండిల్స్ లను తనిఖీ చేయండి.

 

Best Mobiles in India

English summary
Hidden Cameras : All Travelers Should do When Checking into a Hotel Room

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X