లాడ్జీకి వెళ్ళేవారు ముందు ఈ న్యూస్ చూడండి
తమిళనాడు లో ఓ లాడ్జి లో కలకలం రేగింది. లాడ్జిలో సీక్రెట్ కెమెరా బయటపడటంతో పోలీసులకు సమాచారం అందించారు. తనిఖీలు నిర్వహించగా కెమెరా బయటపడింది .
తమిళనాడు లో ఓ లాడ్జి లో కలకలం రేగింది. లాడ్జిలో సీక్రెట్ కెమెరా బయటపడటంతో పోలీసులకు సమాచారం అందించారు. తనిఖీలు నిర్వహించగా కెమెరా బయటపడింది . దీంతో లాడ్జి మేనేజ్మెంట్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు .ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

రహస్య కెమెరాలు
చెన్నై ముత్తు స్ట్రీట్ లోని ఒక లాడ్జి లో రహస్య కెమెరాలు ఉన్నాయంటూ అక్కడ బస చేసిన ఒక అతిధి పోలీసులకు ఫిర్యాదు చేసారు.వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అక్కడ తనికీలు నిర్వహించారు.

వరండాలో ఏర్పాటు కెమెరాలను
పెరయమేట్ ఇన్స్పెక్టర్ శివరాజన్ వరండాలో ఏర్పాటు కెమెరాలను తనికీ చేసారు. ఫుటేజ్ను తనిఖీ చేసినప్పుడు కెమెరా యాంగిల్స్ బెడ్ రూమ్ ను క్యాప్చర్ చేసే విధంగా ఉన్నాయి

లాడ్జి మేనేజ్మెంట్ ను పోలీసులు నిలదీస్తే
లాడ్జి మేనేజ్మెంట్ ను పోలీసులు నిలదీస్తే ఇది కేవలం భద్రతా ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసినట్టు వారు తెలిపారు.పోలీసులు ఆ కెమెరాలను తొలిగించమని చెప్పడంతో లాడ్జి నిర్వాహకులు ఆ కెమెరాలను తొలిగించారు.

కొన్ని రోజుల క్రితం తమిళనాడు లో ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది....
లేడిస్ హాస్టల్ లో రహస్యంగా కెమెరాలు పెట్టి అమ్మాయిల వీడియోలను రికార్డు చేస్తున్న హాస్టల్ ఓనర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన చెన్నై లో జరిగింది. ఆదంబాక్కం తిల్లై నగర్‌లో 49 ఏళ్ల సంజీవి అనే వ్యక్తి తన నివాసం లోని రెండో అంతస్తులో లేడీస్ హాస్టల్ ను నిర్వహిస్తున్నాడు.ఇందులో 10 మంది అమ్మాయిలు ఉంటున్నారు.

హాస్టల్‌లో మరమ్మత్తుల చేశాడు....
కొద్దిరోజుల క్రితం సంజీవ్ హాస్టల్‌లో మరమ్మత్తుల చేశాడు. అతడి తీరుపై హాస్టల్‌లో ఉంటున్న ఓ యువతికి తాను ఉంటున్న రూం లో రహస్య కెమెరాలు ఉన్నట్టు అనుమానం వచ్చింది. దీంతో ఆ కెమెరాలను ఎలా కనిపెట్టాలని గూగుల్ సెర్చ్ చేస్తే సాఫ్ట్‌వేర్ దొరికింది.

సీక్రెట్ కెమెరాల కోసం వెతికింది...
సాఫ్ట్‌వేర్‌ను తన ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని సీక్రెట్ కెమెరాల కోసం వెతికింది. బెడ్‌రూమ్, బాత్ రూమ్‌లు, బట్టలు తగిలించుకునే హ్యాంగర్లతో పాటూ కొన్ని చోట్ల రహస్య కెమెరాలు ఉన్నట్లు గుర్తించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హాస్టల్ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

వైఫై ఆన్ చేసి బ్లూటూత్ కెమెరాల్లో రికార్డైన అమ్మాయిల వీడియోలను...
తన నివాసం నుండే వైఫై ఆన్ చేసి బ్లూటూత్ కెమెరాల్లో రికార్డైన అమ్మాయిల వీడియోలను తన ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని చూస్తున్నట్లు విచారణలో సంజీవి తెలిపాడు. అతని ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో చాలా మంది అమ్మాయిల వీడియోలు ఉన్నాయని తెలిపారు.


Click it and Unblock the Notifications








