యాపిల్ కొత్త ఆపరేటింగ్ సిస్టం ‘ఐఓఎస్ 7’లోని ప్రత్యేక ఫీచర్లు!

Posted By:

విండోస్..ఆండ్రాయిడ్.. బ్లాక్ బెర్రీలకు చెందిన కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టంలకు చెక్ పెడుతూ కుపర్టినో టెక్ దిగ్గజం యాపిల్ ఐఓఎస్-7 ఆపరేటింగ్ సిస్టంతో ముందుకొచ్చింది. ముందుగా ఈ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టంను యాపిల్ ఈ ఏడాది జూలైలో శాన్‌ఫ్రానిస్కోలో నిర్వహించిన ‘యాపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్ - 2013'లో ఆవిష్కరించింది. నాలుగు రోజులు పాటు సాగిన ఈ కార్యక్రమంలో యాపిల్ తన ఆధునిక వర్షన్ సాంకేతిక ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ ప్రతిష్టాత్మక సదస్సులో భాగంగా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తమ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ‘ఐఓఎస్-7'ను పరిచయం చేసారు.

తాజాగా, ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టంతో స్పందించే ఐఫోన్5ఎస్, ఐఫోన్5సీ ఫోన్‌లను యాపిల్ ఆవిష్కరించింది. యాపిల్ కొత్త మొబైల్ ప్లాట్‌ఫామ్ ‘ఐఓఎస్-7' అంతర్జాతీయ మార్కెట్లో సెప్టంబర్ 18 నుంచి లభ్యమవుతోంది. ఐఓఎస్-7 ప్రత్యేకతలు: సరికొత్త ఇంటర్‌ఫేస్, సరికొత్త లాక్ స్ర్కీన్ వ్యవస్థ, సరికొత్త వెదర్ అప్లికేషన్, నోటిఫికేషన్ సెంటర్ ఆన్ లాక్ స్ర్కీన్, ఫేస్‌టైమ్ ఆడియో కాల్స్, నోటిఫికేషన్ సింకింగ్, మెసేజ్ బ్లాకింగ్, యాక్టివేషన్ లాక్, ఐట్యూన్స్ రేడియో, సఫారీ, సిరీ, ఎయిర్ డ్రాప్, మల్టీపుల్

పేజ్ సపోర్ట్ ఫోల్డర్స్. నేటి ప్రత్యేక శీర్షికలో ఐఓఎస్7 ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌లోని ప్రత్యేక ఫీచర్లను మీతో షేర్ చేసుకుంటున్నాం.

1.) షేక్ టూ అండూ(Shake to undo):

షేక్ టూ అండూ, ఉదాహరణకు.. ఐఓఎస్7 ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే ఐఫోన్ లేదా ఐప్యాడ్‌లో మెయిల్‌ను అనుకోకుండా డిలీట్ చేసేసారు. మరేం కంగారుపడాల్సిన అవసరంలేదు. మీ చేతిలోని డివైజ్‌ను ఒక్కసారి షేక్ చేసినట్లయితే డిలీట్ అయిన మెయిల్ తిరిగి స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతుంది.

2.) వందల కొద్ది అప్లికేషన్‌లను ఒకే ఫోల్డర్‌లో స్టోర్ చేసుకోవచ్చు (Unlimited apps in folders):

మునుపటి వర్షన్ ఐఫోన్ లేదా ఐప్యాడ్‌లలో ఒక ఫోల్డర్‌లో కేవలం 16 అప్లికేషన్‌లను మాత్రమే స్టోర్ చేసుకునే అవకాశం ఉండేది. ఐఓఎస్7 ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే ఐఫోన్ లేదా ఐప్యాడ్‌లో కేవలం ఒక సింగిల్ ఫోల్డర్‌లో వందల కొద్ది  అప్లికేషన్‌లను స్టోర్ చేసుకోవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ కొత్త ఆపరేటింగ్ సిస్టం ‘ఐఓఎస్ 7’లోని ప్రత్యేక ఫీచర్లు!

షేక్ టూ అండూ(Shake to undo):

షేక్ టూ అండూ, ఉదాహరణకు.. ఐఓఎస్7 ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే ఐఫోన్ లేదా ఐప్యాడ్‌లో మెయిల్‌ను అనుకోకుండా డిలీట్ చేసేసారు. మరేం కంగారుపడాల్సిన అవసరంలేదు. మీ చేతిలోని డివైజ్‌ను ఒక్కసారి షేక్ చేసినట్లయితే డిలీట్ అయిన మెయిల్ తిరిగి స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతుంది.

యాపిల్ కొత్త ఆపరేటింగ్ సిస్టం ‘ఐఓఎస్ 7’లోని ప్రత్యేక ఫీచర్లు!

వందల కొద్ది అప్లికేషన్‌లను ఒకే ఫోల్డర్‌లో స్టోర్ చేసుకోవచ్చు (Unlimited apps in folders):

మునుపటి వర్షన్ ఐఫోన్ లేదా ఐప్యాడ్‌లలో ఒక ఫోల్డర్‌లో కేవలం 16 అప్లికేషన్‌లను మాత్రమే స్టోర్ చేసుకునే అవకాశం ఉండేది. ఐఓఎస్7 ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే ఐఫోన్ లేదా ఐప్యాడ్‌లో కేవలం ఒక సింగిల్ ఫోల్డర్‌లో వందల కొద్ది  అప్లికేషన్‌లను స్టోర్ చేసుకోవచ్చు.

యాపిల్ కొత్త ఆపరేటింగ్ సిస్టం ‘ఐఓఎస్ 7’లోని ప్రత్యేక ఫీచర్లు!

సిగ్నల్:

మీ యాపిల్ ఐఫోన్‌ను ఐఓఎస్7కు అప్‌గ్రేడ్ చేసినట్లయితే ఓసారి మీ డివైజ్ నెట్‌వర్క్‌కు సంబంధించి సిగ్నల్ స్థాయిని చూపించి నోటిఫికేషన్ బార్‌ను పరిశీలించిండి. యాపిల్ పాత సిగ్నల్ బార్స్‌కు స్వస్తి పలికి వాటి స్ధానంలో డాట్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది.

యాపిల్ కొత్త ఆపరేటింగ్ సిస్టం ‘ఐఓఎస్ 7’లోని ప్రత్యేక ఫీచర్లు!

డేటా వర్గీకరణ:

సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌లలో.. ఫోటోలు, వీడియోలు , కాంటాక్టులు ఇంకా డాక్యుమెంట్ల రూపంలో పెద్ద మొత్తంలో డేటా ఉంటుంది. వేరొక డివైజ్ నుంచి మీరు సేకరించిన డేటాను వర్గీకరించటంలో పలు ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌లు విఫలమవుతాయి. ఐవోఎస్7, వేరిక డివైజ్ నుంచి సేకరించిన డేటాను సరైన స్థానాలకు చేరుస్తుంది. అంటే ఫోటోలు ఆల్బమ్‌లోకి, డాక్యుమెంట్లు ఐవర్క్‌లోకి పంపబడతాయి.

యాపిల్ కొత్త ఆపరేటింగ్ సిస్టం ‘ఐఓఎస్ 7’లోని ప్రత్యేక ఫీచర్లు!

మెరుగుపరచబడిన సిరీ అప్లికేషన్:

యాపిల్ డిజిటల్ వాయిస్ అసిస్టెంట్ అప్లికేషన్ అయిన ‘సిరీ'ని ఐవోఎస్7కు గాను ప్రత్యేకంగా అభివృద్ధి చేయటం జరిగింది. ఐఓఎస్7లో నిక్షిప్తం చేసిన అప్‌గ్రేడెడ్ సిరీ అప్లికేషన్ ద్వారా మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజన్ బింగ్, వికీపిడియా ఇంకా మొక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.

యాపిల్ కొత్త ఆపరేటింగ్ సిస్టం ‘ఐఓఎస్ 7’లోని ప్రత్యేక ఫీచర్లు!

ఫైండ్ మై ఫోన్ (Find My iPhone):

ఐఓఎస్7లో పొందుపరిచిన ఫైండ్ మై ఐఫోన్ అనే ప్రత్యేక ఫీచర్ డివైజ్ సెక్యూరిటీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. ఐఓఎస్7 ఆధారితంగా స్పందించే మీ ఐఫోన్ లేదా ఐప్యాడ్ దొంగతనానికి గురైనట్లయితే ఫైండ్ మై ఐఫోన్ ఫీచర్ వేరొక వ్యక్తి మీ ఫోన్‌ను ఓపెన్ చేసేందుకు ఏ మాత్రం సహకరించదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

3.) సిగ్నల్:

మీ యాపిల్ ఐఫోన్‌ను ఐఓఎస్7కు అప్‌గ్రేడ్ చేసినట్లయితే ఓసారి మీ డివైజ్ నెట్‌వర్క్‌కు సంబంధించి సిగ్నల్ స్థాయిని చూపించి నోటిఫికేషన్ బార్‌ను పరిశీలించిండి. యాపిల్ పాత సిగ్నల్ బార్స్‌కు స్వస్తి పలికి వాటి స్ధానంలో డాట్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది.

4.) డేటా వర్గీకరణ:

సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌లలో.. ఫోటోలు, వీడియోలు , కాంటాక్టులు ఇంకా డాక్యుమెంట్ల రూపంలో పెద్ద మొత్తంలో డేటా ఉంటుంది. వేరొక డివైజ్ నుంచి మీరు సేకరించిన డేటాను వర్గీకరించటంలో పలు ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌లు విఫలమవుతాయి. ఐవోఎస్7, వేరిక డివైజ్ నుంచి సేకరించిన డేటాను సరైన స్థానాలకు చేరుస్తుంది. అంటే ఫోటోలు ఆల్బమ్‌లోకి, డాక్యుమెంట్లు ఐవర్క్‌లోకి పంపబడతాయి.

5.) మెరుగుపరచబడిన సిరీ అప్లికేషన్:

యాపిల్ డిజిటల్ వాయిస్ అసిస్టెంట్ అప్లికేషన్ అయిన ‘సిరీ'ని ఐవోఎస్7కు గాను ప్రత్యేకంగా అభివృద్ధి చేయటం జరిగింది. ఐఓఎస్7లో నిక్షిప్తం చేసిన అప్‌గ్రేడెడ్ సిరీ అప్లికేషన్ ద్వారా మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజన్ బింగ్, వికీపిడియా ఇంకా మొక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.

6.) ఫైండ్ మై ఫోన్ (Find My iPhone):

ఐఓఎస్7లో పొందుపరిచిన ఫైండ్ మై ఐఫోన్ అనే ప్రత్యేక ఫీచర్ డివైజ్ సెక్యూరిటీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. ఐఓఎస్7 ఆధారితంగా స్పందించే మీ ఐఫోన్ లేదా ఐప్యాడ్ దొంగతనానికి గురైనట్లయితే ఫైండ్ మై ఐఫోన్ ఫీచర్ వేరొక వ్యక్తి మీ  ఫోన్2ను ఓపెన్ చేసేందుకు ఏ మాత్రం సహకరించదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot