18 నెలల తరువాత J&K లో తిరిగి ప్రాంభమయిన హై-స్పీడ్ 4G ఇంటర్నెట్ సేవలు..
ఇండియాలోని జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో గత సంవత్సరం 2019 ఆగస్టు నెలలో నిలిపివేయబడిన హై-స్పీడ్ 4G ఇంటర్నెట్ సేవలు దాదాపు 18 నెలల తరువాత ఇప్పుడు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. జమ్మూ కాశ్మీర్ యొక్క మొత్తం కేంద్ర పాలిత ప్రాంతంలో 4G సేవలు అందుబాటులోకి వచ్చినట్లు ఆ ప్రాంత పరిపాలన ప్రతినిధి రోహిత్ కన్సల్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. "4G మొబైల్ ఇంటర్నెట్ సేవలు మొత్తం J&K లో పునరుద్ధరించబడుతున్నాయి" అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

జమ్మూ కాశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలు
జమ్మూ కాశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలను 2019 ఆగస్టు 2 న పూర్తిగా నిలిపివేశారు. దీనితో పాటుగా భద్రతా విషయాల కారణం చూపుతూ కేంద్ర ప్రభుత్వం పూర్వపు రాష్ట్ర ప్రత్యేక హోదాను కూడా రద్దు చేసింది. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ వంటి రెండు కేంద్ర భూభాగాలుగా విభజించబడింది.

హై-స్పీడ్ 4G ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరణ
జమ్మూ కాశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలను రద్దు చేసిన ఆరు నెలల తరువాత 2020 జనవరిలో 2G వేగంతో మాత్రమే ఇంటర్నెట్ పునరుద్ధరించబడింది. గత ఏడాది ఆగస్టు 16 న పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం 4G ఇంటర్నెట్ సేవలను జమ్మూలోని ఉధంపూర్ మరియు కాశ్మీర్‌లోని గండర్‌బాల్ తో సహా 20 జిల్లాలలో "ట్రయల్ ప్రాతిపదికన" పునరుద్ధరించారు. UTలోని మిగతా జిల్లాలు 4G సేవలపై నిషేధాన్ని ఇప్పటికి కూడా ఎదుర్కొంటున్నాయి.
4G Mubarak! For the first time since Aug 2019 all of J&K will have 4G mobile data. Better late than never.
— Omar Abdullah (@OmarAbdullah) February 5, 2021
ఒమర్ అబ్దుల్లా ట్వీట్
జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్ ద్వారా ఈ అభివృద్ధిపై స్పందించారు "4G ముబారక్! ఆగస్టు 2019 తర్వాత తొలిసారిగా J&Kలో 4G మొబైల్ డేటా అందుబాటులోకి రావడం ఆనందంగా ఉంది" అని తెలిపారు.

4G ప్రీపెయిడ్ ప్లాన్‌లు
జమ్మూ కాశ్మీర్‌లో 4G సేవలు అందుబాటులోకి రావడంతో టెలికాం ఆపరేటర్లు అందిస్తున్న గొప్ప ప్రయోజనాలను పొందవచ్చు. టెలికాం ఆపరేటర్లుఅన్ని తమ వినియోగదారులకు రోజువారీ ఫెయిర్-యూజ్-పాలసీ (FUP) డేటా కింద చాలా రకాల ప్లాన్‌లను అందిస్తున్నారు. ప్రీపెయిడ్ ప్లాన్‌లలో తక్కువగా ‘1GB డైలీ డేటా‘ ను అందిస్తున్నాయి. అయితే దీని కంటే ఎక్కువ రోజువారీ డేటా కావాలి అనుకునే వారికి చాలానే ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications