ఇక ఇంటర్నెట్ లేకపోయినా ‘Hike messenger’ వాడుకోవచ్చు

Posted By:

ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా తమ మెసెంజర్ యాప్‌ను ఉపయోగించుకునే విధంగా సరికొత్త ఫీచర్‌ను Hike మెసెంజర్ గురువారం అందుబాటులోకి తీసుకువచ్చింది. Hike Direct పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ సదుపాయాన్ని ఇంటర్నెట్ కనెక్షన్‌లేని మొబైల్ ఫోన్ యూజర్లు సైతం ఉపయోగించుకోవచ్చని హైక్ చెబుతోంది.

Read More : వాట్సాప్‌లో మరో విడాకుల పర్వం

కంపెనీ విడుదల చేసిన ఓ స్టెట్‌మెంట్ ప్రకారం Hike Direct ఫీచర్, 100 మీటర్ల రేడియస్ రేంజ్‌లోని మొబైల్ డివైస్‌లను ఏ విధమైన ఇంటర్నెట్ సహాయం లేకుండా కనెక్ట్ చేస్తుంది. ఒక్కసారి కనెక్ట్ అయిన తరువాత యూజర్లు చాట్ చేసుకోవటంతో పాటు ఫైళ్లను కూడా షేర్ చేసుకోవచ్చు. హైక్ డైరక్ట్ ద్వారా 100 ఎంబి నిడివి గల పెద్ద సైజు ఫైళ్లను సైతం 10 సెకండ్లలో పంపుకోవచ్చిన కంపెనీ చెబుతోంది. మరిన్ని వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇంటర్నెట్ లేకపోయినా ‘Hike messenger’ వాడుకోవచ్చు

తమకు దాదాపుగా 7 కోట్ల మంది యూజర్లు ఉన్నారని.. వై-ఫై, మొబైల్ డేటా అందుబాటులో లేని స్మార్ట్‌ఫోన్ యూజర్లు Hike Direct ద్వారా ఫోటోల, స్టిక్కర్లు, ఫైళ్లు ఇంకా మేసెజ్‌లను ఇతర హైక్ మెసెంజర్ వాడకం దారులకు పంపుకోవచ్చని హైక్ మెసెంజర్ సీఈఓ భారతి మిట్టల్ వెల్లడించారు.

ఇంటర్నెట్ లేకపోయినా ‘Hike messenger’ వాడుకోవచ్చు

లేటెస్ట్ వర్షన్ Hike మెసెంజర్ (వర్షన్ 4.0.6)ను అప్ గ్రేడ్ చేసుకోవటం ద్వారా Hike Directను పొందవచ్చని సంస్థ చెబుతోంది.

ఇంటర్నెట్ లేకపోయినా ‘Hike messenger’ వాడుకోవచ్చు

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి హైక్ లేటెస్ట్ వర్షన్ మెసెంజర్ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఐఓఎస్ ఇంకా విండోస్ ఆధారిత ఫోన్‌లకు త్వరలనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

ఇంటర్నెట్ లేకపోయినా ‘Hike messenger’ వాడుకోవచ్చు

Hike ఇటీవల తమ యూజర్ల కోసం ఉచిత గ్రూప్ కాలింగ్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది.

ఇంటర్నెట్ లేకపోయినా ‘Hike messenger’ వాడుకోవచ్చు

ఈ ఉచిత గ్రూప్ కాలింగ్‌లో భాగంగా ఒకే కాల్‌లో వంది మందితో కనెక్ట్ అవ్వొచ్చు. ప్రస్తుతానికి ఈ సదుపాయం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటలో ఉంది.

ఇంటర్నెట్ లేకపోయినా ‘Hike messenger’ వాడుకోవచ్చు

ఈ ఏడాది చివరి నాటికి ఐఓఎస్, విండోస్ ఫోన్ లకు కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీనుకురానున్నట్లు హైకె మెసెంజర్ యాజమాన్యం వెల్లడించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Hike messenger adds feature to operate without internet. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot