టాక్ టైమ్ ఖతమ్... ప్రీపెయిడ్ యూజర్లే టార్గెట్?

By Super
|
Hike on mobile recharge coupons


న్యూఢిల్లీ: 90శాతం పైగా ఉన్న ప్రీపెయిడ్ యూజర్లకు ఇక పై మొబైల్ వినియోగం మరింత భారం కానుంది. మొబైల్ రీచార్జ్ కూపన్ల ప్రాసెసింగ్ ఫీజును 50 శాతానికి పెంచే ప్రతిపాదన పై టెలికం రెగ్యులేటరీ ఆధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆమోదముద్ర వేసింది. దింతో రూ.20, అంతకు మించిన టాపప్ వోచర్ల ప్రాసెసింగ్ ఫీజు పై పరిమితి గరిష్టంగా రూ.3కు పెరుగుతుంది. ప్రస్తుతానికి ఇది రూ.2గా ఉంది. రూ.20కంటే తక్కువ విలువ కలిగిన రీచార్జ్ కూపన్‌ల పై ప్రాసెసింగ్ ఫీజు రూ.2గానే ఉంటుంది.

సుమారు రెండున్నర సంవత్సరాల తరువాత ట్రాయ్ ఈ మేరకు సవరణలు చేసింది. రీచార్జ్ కూపన్ ఎంఆర్‌పీలోనే ప్రాసెసింగ్ ఫీజు కూడా కలిసి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు పెరగడంతో ఆ మేర టాక్ టైం తగ్గుతుంది కాబట్టి వినియోగదారులే నష్టపోతారు.

తాజా మార్పుల దృష్ట్యా ప్రతి సంస్థ రూ.10 విలువైన రీచార్జ్ కూపన్‌లను వినియోగదారుల సౌకర్యార్థం అందుబాటులోకి తేవాలని ట్రాయ్ ఈ సందర్భంగా ఆదేశించింది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X