అక్టోబర్‌లో 16 శాతం ఉద్యోగాలు మటాష్: నౌకరీ

Posted By: Staff

అక్టోబర్‌లో 16 శాతం ఉద్యోగాలు మటాష్: నౌకరీ

న్యూఢిల్లీ: నౌకరీ జాబ్ పొర్టల్ నిన్న విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం ప్రస్తుత మార్కెట్లో యూరప్ మాంద్యం వల్ల అక్టోబర్ నెలలో ఉద్యోగాల కల్పనపై తీవ్ర ప్రభావం చూపిందని తెలిపింది. దేశ వ్యాప్తంగా అన్ని రంగాల్లో ఉద్యోగ నియామకాలు, ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని తెలిపింది. దీనికి అంతటికి కారణం ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకొస్తున్న ఆర్దిక మ్యాందమేనని రిపోర్ట్‌లో వెల్లడించింది.

గతేడాది ఇదే నెల నియామ కాలతో పోల్చుకుంటే ఈ ఏడాది అక్టో బర్‌లో ఆన్‌లైన్‌ ద్వారా ఉద్యోగాల భర్తీ 16 శాతం తగ్గిపోయిందని తమ సూచీలో వెల్లడయ్యిందని తెలిపింది. ముఖ్యంగా ఐటి రంగంలో నియామ కాలు పెద్ద ఎత్తున 26 శాతం తగ్గి పోయాయని వెల్లడించింది. ఫార్మా, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, బ్యాంకింగ్‌ రంగాల్లో 13 నుంచి 19 శాతం తగ్గుదల నమోదు చేసుకుందని పేర్కొంది. ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్‌, చెన్నై, పూనే ప్రాంతాల్లో 15 శాతం నుంచి 18 శాతం తగ్గుదల చోటు చేసుకొవడం జరిగింది.

ఇటీవల జరిగిన ‘యాడ్‌ఏషియా-2011’లో పాల్గొన్న పెప్సీకో చైర్‌పర్సన్ ఇంద్రా నూయి ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రపంచ దేశాలు ప్రస్తుతం మూడు సంక్షోభాల మధ్య చిక్కుకున్నాయని అన్నారు. మొదటిది కార్పొరేట్లలో నాయకత్వ సంక్షోభం కాగా రెండోది పాలనాపరమైనదని.. మూడోది జవాబుదారీతనమని ఆమె చెప్పారు. కార్పొరేట్లలో సరైన నాయకత్వ ధోరణి, గవర్నెన్స్ లోపించడమే అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యాయని అన్నారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting