సామ్‌సంగ్ చరిత్ర (ఉప్పుచేపలతో మొదలై...)

|

‘సామ్‌సంగ్' ప్రపంచ వ్యాప్తంగా ఈ పేరు తెలియని టెక్నాలజీ అభిమాని అంటూ ఉండడు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ బహుళ జాతీయ వ్యాపార దిగ్గజం కంప్యూటింగ్ ఉత్పత్తుల తయారీలోనే కాకుండా ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు తయారీలోనూ తన ఆధిపత్యాన్ని కొనాసాగిస్తోంది.

ఎండుచేపల ఎగుమతితో ప్రారంభమైన సామ్‌సంగ్ వ్యాపార చరిత్ర ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నేడు టెక్నాలజీ విభాగంలో ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. తమ వ్యాపారాన్ని వివిధ రంగాలకు విస్తరింప చేసిన సామ్‌సంగ్ అనేక దేశాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని వేలాది ఉద్యోగులకు జీవనోపాధి కల్పిస్తోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా 1938 నుంచి అంచెలంచెలుగా ప్రారంభమైన సామ్‌సంగ్ ఎదుగుదలను ఫోటో శీర్సిక రూపంలో మీముందుంచుతున్నాం....

సామ్‌సంగ్ చరిత్ర (ఉప్పుచేపలతో మొదలై...)

సామ్‌సంగ్ చరిత్ర (ఉప్పుచేపలతో మొదలై...)

సామ్‌సంగ్ ఆవిర్భావం:

సామ్‌సంగ్‌ను బయుంగ్ - చుల్ లీ అనే వ్యక్తి 1938లో ప్రారంభించారు. తొలినాళ్లలో ఈ సంస్థ కొరియా నుంచి చైనాకు ఎండుచేపలు, కూరగాయలు ఇంకా పిండి పదార్థాలను ఓడల సాయంతో ఎగుమతి చేసేది.

సామ్‌సంగ్ చరిత్ర (ఉప్పుచేపలతో మొదలై...)

సామ్‌సంగ్ చరిత్ర (ఉప్పుచేపలతో మొదలై...)

1951 నుంచి 1965 వరకు:

తమ వ్యాపార విస్తరణలో భాగంగా మరో అడుగువేసిన సామ్‌సంగ్ చెయిల్ పరిశ్రమలను ప్రారంభించి దేశీయంగా వివిధ ఉత్పత్తులను ప్రజలకు అందించింది. 1963లో జుల్‌డాంగ్ బ్యాంగ్‌లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీని కొనుగోలు చేసిన సామ్‌సంగ్ 1989లో ఆ కంపెనీ పేరును సామ్‌సంగ్ లైఫ్‌ఇన్స్యూరెన్స్‌గా మార్చింది. 1965లో పేపర్ పరిశ్రమలోకి సామ్‌సంగ్ అడుగుపెట్టంది.

సామ్‌సంగ్ చరిత్ర (ఉప్పుచేపలతో మొదలై...)

సామ్‌సంగ్ చరిత్ర (ఉప్పుచేపలతో మొదలై...)

సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ పుట్టక:

1968, డిసెంబర్ 30.. చైర్మన్ బయుంగ్ - చుల్ లీ నేతృత్వంలోని సామ్‌సంగ్ బృందం సామసంగ్ ఎలక్ట్రానిక్స్ స్థాపించాలన్న కీలక నిర్ణయాన్ని తీసుకుంది. 1969, జనవరి 13వ తేదిన సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్‌ను ప్రారంభించారు. 1970, నవంబర్ నెలలో 12అంగుళాల బ్లాక్‌ అండ్ వైట్ టీవీని సామ్‌సంగ్ ఉత్పత్తి చేయగలిగింది. రెండు నెలల వ్యవధిలోనే తమ ఉత్పత్తిని మరింత పెంచుకుని పనామాకు ఎగుమతి చేయగలిగింది.

సామ్‌సంగ్ చరిత్ర (ఉప్పుచేపలతో మొదలై...)

సామ్‌సంగ్ చరిత్ర (ఉప్పుచేపలతో మొదలై...)

అదే సంవత్సరం...

వ్యాపారాభివృద్థిలో భాగంగా సామ్‌సంగ్ అదేసంవత్సరం (1970) పెట్రో కెమికల్స్ సంస్థను స్థాపించి వాషింగ్ మెషీన్స్, రిఫ్రీజరేటర్స్ ఇంకా మైక్రోవేవో ఓవెన్స్ వంటి ఎలక్ట్రానిక్ గృహోపకరణాలను పరిచయం చేసింది.

సామ్‌సంగ్ చరిత్ర (ఉప్పుచేపలతో మొదలై...)

సామ్‌సంగ్ చరిత్ర (ఉప్పుచేపలతో మొదలై...)

సామ్‌సంగ్ ప్రపంచానికి విస్తరించింది:

1980లో సెమీ కండెక్టర్‌ల తయారీ పై దృష్టిసారించిన సామ్‌సంగ్ తన పరిధిని మరింత విస్తరించుకుంది. ఈ సంవత్సరంలోనే కలర్ టీవీలతో పాటు పర్సనల్ కంప్యూటర్‌లు, వీ.సీ.ఆర్‌లు, టేప్ రికార్డర్లను తయారు చేసి అమెరికాకు ఎగుమతులు మొదలుపెట్టింది.

సామ్‌సంగ్ చరిత్ర (ఉప్పుచేపలతో మొదలై...)

సామ్‌సంగ్ చరిత్ర (ఉప్పుచేపలతో మొదలై...)

మెమరీ కార్డులు ఇంకా హార్డ్‌డిస్క్‌ల తయారీ:

వ్యాపారన్ని మరింత బలోపేతం చేసుకునే క్రమంలో సామ్‌సంగ్ 1990 మధ్య మెమెురీ కార్డులతో పాటు హార్డ్‌డిస్క్‌లను తయారు చేయడం ప్రారంభింది.

సామ్‌సంగ్ చరిత్ర (ఉప్పుచేపలతో మొదలై...)

సామ్‌సంగ్ చరిత్ర (ఉప్పుచేపలతో మొదలై...)

1995లో మొదటి సెల్‌ఫోన్ తయారీ.. ప్రతికూల పరిస్థితులు తప్పలేదు:

1995లో సామ్‌సంగ్ తయారీ చేసిన తొలి మొబైల్ ఫోన్ అనుకున్న స్థాయలో ఫలితాలను రాబట్టలేకపోయింది. ఆ సమయంలో కంపెనీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కుస్-హీ లీ పనికిరాని వేలాది ఫోన్‌లను ధ్వంసం చేయించారు.

సామ్‌సంగ్ చరిత్ర (ఉప్పుచేపలతో మొదలై...)

సామ్‌సంగ్ చరిత్ర (ఉప్పుచేపలతో మొదలై...)

పడిలేచిన కెరటం:

మొబైల్ ఫోన్‌ల తయారీని సీరియస్‌గా తీసుకన్న సామ్ సంగ్ 1999లో ఇంటర్నెట్‌కు అనువైన ఫోన్‌లను తయారు చేసింది.

సామ్‌సంగ్ చరిత్ర (ఉప్పుచేపలతో మొదలై...)

సామ్‌సంగ్ చరిత్ర (ఉప్పుచేపలతో మొదలై...)

మొదటి డిజిటల్ టీవీ తయారు, 1999లో ఉత్పత్తి:

ఓ వైపు మొబైల్ ఫోన్ మరోవైపు టెలివిజన్‌ల తయారీ పై దృష్టిపెట్టిన సామ్‌సంగ్ 1998లో తన మొదటి డిజిటల్ టీవీని తయారు చేసింది. 1999లో వీటి ఉత్పత్తి ప్రారభమైంది.

సామ్‌సంగ్ చరిత్ర (ఉప్పుచేపలతో మొదలై...)

సామ్‌సంగ్ చరిత్ర (ఉప్పుచేపలతో మొదలై...)

2000వ సంవత్సరం హైడెఫినిషన్ టీవీని సామ్‌సంగ్ అందుబాటులోకి తెచ్చింది.

సామ్‌సంగ్ చరిత్ర (ఉప్పుచేపలతో మొదలై...)

సామ్‌సంగ్ చరిత్ర (ఉప్పుచేపలతో మొదలై...)

2010 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఎగ్జిబిషన్‌లో సామ్‌సంగ్ మొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. పేరు ‘గెలాక్సీ ఎస్'.

సామ్‌సంగ్ చరిత్ర (ఉప్పుచేపలతో మొదలై...)

సామ్‌సంగ్ చరిత్ర (ఉప్పుచేపలతో మొదలై...)

2010లోనే 7 అంగుళాల గెలాక్సీ సిరీస్ ట్యాబ్లెట్‌ను సామ్‌సంగ్ విడుదల చేసింది.

సామ్‌సంగ్ చరిత్ర (ఉప్పుచేపలతో మొదలై...)

సామ్‌సంగ్ చరిత్ర (ఉప్పుచేపలతో మొదలై...)

2013లో ఆధునిక టెక్నాలజీతో కూడిన స్మార్ట్ టీవీలతో పాటు డిస్‌ప్లేలను సామసంగ్ పరిచయం చేసింది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X