హిట్లర్ ఫోన్ ఖరీదు రూ.1.63 కోట్లు
ఈ ఫోన్‌ను 1945లో బెర్లిన్‌లోని హిట్లర్‌కు చెందిన బంకర్‌లో కనుగొన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ ఉపయోగించిన పర్ననల్ ఫోన్ వేలానికి వచ్చింది. ఆదివారం యూఎస్ హౌస్‌లో జరిగిన వేలం పాటలో ఈ చారిత్రాత్మక నేపథ్యం కలిగిన ఫోన్‌ను $243,000 వెచ్చించి సొంతం చేసుకున్నట్లు అలెగ్జాండర్ హిస్టారికల్ ఆక్షన్స్ సంస్ధ తెలిపింది.
ఇక డైమెండ్ డిస్‌ప్లేతో స్మార్ట్‌ఫోన్‌లు

లక్షలాది మందిని హత్య చేయడానికి ఈ ఫోన్ ద్వారానే హిట్లర్ తన కమాండోలకు ఆదేశాలు జారీ చేసే వారట. అందుకే ఈ ఫోన్ ను అత్యంత విధ్వంసర ఆయుధంగా యూఎస్ హౌస్ అభివర్ణిస్తోంది. ఈ ఫోన్ మొదట్లో నలుపు రంగులో ఉండేదట. అనంతరం ఈ ఫోన్ కు ముదురు ఎరుపు రంగును వేసారు. వేలం పాటలో ఈ చారిత్రాత్మక ఫోన్ కు 2 నుంచి 3 లక్షల డాలర్లు రావొచ్చని అలెగ్జాండర్ హిస్టారికల్ ఆక్షన్స్ అంచానా వేసింది. ఈ ఫోన్‌ను 1945లో బెర్లిన్‌లోని హిట్లర్‌కు చెందిన బంకర్‌లో కనుగొన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications








