Home
News

ఇంటర్నెట్‌ లేకుండానే UPI పేమెంట్లు.. అది కూడా ఆ ఫీచర్‌ ఫోన్లలోనే.. !!

ఇప్పుడంటే ఏ పని కావాలన్నా స్మార్ట్‌ఫోన్‌ పైన ఆధారపడుతున్నాం గానీ.. కొన్ని సంవత్సరాల క్రితం చాలావరకు అందరి చేతుల్లో ఫీచర్‌ ఫోన్లు కనిపించేవి. అయితే మళ్లీ అదే పరిస్థితి వస్తుందా.. మరోసారి ఫీచర్‌ ఫోన్లు ట్రెండింగ్‌లోకి వస్తాయా.. ఎందుకంటే అద్బుతమైన ఫీచర్‌తో నోకియా ఫీచర్‌ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి.

ఫీచర్‌ ఫోన్లు వినియోగిస్తున్న వర్గాన్ని వేరుచేసి వారికి కొత్త జీవితాన్ని ఇవ్వాలనేది తన ఆలోచన అని హెచ్‌ఎండీ గ్లోబల్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ రవి కున్వర్‌ వెల్లడించారు. భారత్‌దేశంలో తాజాగా ఫీచర్ ఫోన్లు నోకియా 105 మరియు 106 4G మొబైల్‌కు UPI సదుపాయం తీసుకురావడం వెనుక ఉన్న ఆలోచనను వివరించారు.

Nokia 105 and 106 4G feature phones

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల ద్వారా చాలా జరుగుతున్నాయి. కానీ ఇంకా భారత్‌లో సుమారు 250 మిలియన్‌ ఫీచర్‌ ఫోన్‌లు యాక్టివ్‌గా ఉన్నాయని రవి కున్వర్‌ తెలిపారు. ఈ సంఖ్యను పరిగణనలోకి తీసుకొని ఈ యూపీఐ ప్రాజెక్టు కోసం ప్రభుత్వంతో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

అయితే ఫీచర్‌ ఫోన్లు ప్రస్తుతం ఎక్కువ మంది వినియోగిస్తున్న స్మార్ట్‌ఫోన్‌ మాదిరిగా అధునాతనంగా కనిపించకపోవచ్చని ఆయన తెలిపారు. కానీ ఫీచర్‌ ఫోన్లకు ఇప్పటికీ భారత్‌లో పెద్ద మార్కెట్‌ ఉందన్నారు. నోకియా ఫోన్లను తయారుచేస్తు్న్న బ్రాండ్‌ హెచ్‌ఎండీ గ్లోబల్‌ ప్రస్తుతం మిలియన్ల కొద్దీ ఫీచర్‌ ఫోన్లను విక్రయిస్తూనే ఉంది. ఈ అవకాశాన్ని తాము వినియోగించుకోవాలని అనుకుంటున్నట్లు రవి కున్వన్‌ వెల్లడించారు. ఫీచర్‌ ఫోన్‌ వినియోగదారులను కూడా డిజిటల్‌ చెల్లింపులవైపు తీసుకురావాలని అనుకుంటున్నామని చెప్పారు.

భారత యూనిఫైడ్ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్ (UPI).. రియల్‌ టైం పేమెంట్‌ వ్యవస్థ. దీని ద్వారా వినియోగదారులు ఎవరికైనా క్షణాల్లో నగదును ట్రాన్స్‌ఫర్‌ చేయగలరు. ఇందుకు ఎటువంటి బ్యాంకింగ్ వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదు. ఈ యూపీఐ వ్యవస్థను 2016ను తీసుకొచ్చారు.

ప్రస్తుతం డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల వినియోగానికి మింటి యూపీఐను ఉపయోగిస్తున్నారు. 2023 జనవరి నాటికి భారత్‌లో సుమారు 260 మిలియన్ల ప్రజలు UPIని వినియోగిస్తున్నారు. ఈ యూపీఐ ద్వారా 8 బిలియన్ల లావాదేవీలు జరిగాయి. వాటి విలువ సుమారు 200 బిలియన్లుగా ఉందని అంచనా.

నోకియా 105 మరియు 106 4G.. యూపీఐ వ్యవస్థతో అనుసంధానించబడిన తొలి ఫోన్లు అని కున్వర్‌ తెలిపారు. ఈ ఫీచర్‌ ఫోన్ల ధర రూ.1299 మరియు రూ.2199 గా ఉండనున్నాయి. ఈ రెండు ఫోన్లు ఎన్‌పీసీఐ యూపీఐ 123పేతో (NPCI UPI 123 PAY) అందుబాటులో ఉండనున్నాయి.

వీటితో సురక్షితమైన లావీదేవీలను పూర్తిచేసుకోవచ్చని సంస్థ తెలిపింది. అయితే ఇంటర్నెట్‌ లేకుండా యూపీఐ పేమెంట్లు చేసుకొనేందుకు ఈ ఫీచర్‌ అనుమతి ఇస్తుందని సమాచారం. డిజిటల్‌ పేమెంట్ల కోసం హెచ్‌ఎండీ గ్లోబల్‌ సంస్థ Gupshupతో భాగస్వామ్యం కలిగి ఉంది.

ఫీచర్‌ ఫోన్‌లలో హార్డ్‌వేర్‌ మరియు ఇతర మార్పుల పరంగా మనం చేయగలిగేది చాలా తక్కువ ఉంటుందని కున్వర్‌ అంగీకరించారు. అయితే ఫీచర్‌ ఫోన్‌ వినియోగదారులకు డిజిటల్‌ చెల్లింపులు చేసేలా అవకాశం కల్పించడం చాలా వ్యత్యాసం ఉంటుందని గుర్తించినట్లు చెప్పారు.

ఫీచర్‌ ఫోన్‌లలో డిజిటల్‌ చెల్లింపులు ప్రస్తుతం చాలా దూరంలో ఉన్నాయని తెలిపారు. కానీ తాము ఈ అంశంపై ఫోకస్‌ చేసినప్పుడు.. ఇందుకు సంబంధించిన వారిని ఒకే దగ్గరకు చేర్చామన్నారు. ఇందుకు తమకు మూడు నుంచి నాలుగు నెలల వరకు సమయం పట్టిందని కున్వర్‌ తెలిపారు.

More from GizBot

Best Mobiles in India

English summary
HMD Global vice president on UPI Powered Nokia feature phones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X