నోకియా 9 విడుదల వచ్చే ఏడాదే!

Posted By: BOMMU SIVANJANEYULU

ఫిబ్రవరిలో నిర్వహించిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017లో భాగంగా హెచ్‌ఎండి గ్లోబల్ తన మొదటి విడత (నోకియా 6, నోకియా 5, నోకియా 3) ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

నోకియా 9 విడుదల వచ్చే ఏడాదే!

ఆ తరువాత కొద్ది నెలలకు నోకియా 8, నోకియా 7, నోకియా 2 స్మార్ట్ ఫోన్‌లను కూడా హెచ్‌ఎండి గ్లోబల్ అనౌన్స్ చేయటం జరిగింది. వీటీలో నోకియా 8, నోకియా 2లు ఇప్పటికే మార్కెట్లో లభ్యమవుతుండగా నోకియా 7 విడుదల కావల్సి ఉంది.

నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి నోకియా పవర్‌యూజర్ ఇటీవల రివీల్ చేసిన ఓ రిపోర్ట్ ప్రకారం నోకియా 7 గ్లోబల్ లాంచ్ 2018లో ఉండబోతోంది. ప్రస్తుతానికి ఈ ఫొన్ చైనా మార్కెట్లో మాత్రమే లభ్యమవుతోంది. ఇదే సమయంలో నోకియా 9ను కూడా 2018 ఆరంభంలో హెచ్‌ఎండి గ్లోబల్ అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.

నోకియా 7 స్పెసిఫికేషన్స్..

5.2 అంగుళాల 1080 పిక్సల్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8.0 ఓరియో), క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 6జీబి), 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రో ఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కార్ల్ జిస్ ఆప్టిక్స్ టెక్నాలజీ, 360 డిగ్రీ క్రిస్టల్ క్లియర్ సౌండ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3000mAh బ్యాటరీ.

నోకియా 9 రూమర్ స్పెసిఫికేషన్స్..

5.3 అంగుళాల క్వాడ్-హైడెఫినిషన్ కర్వుడ్ గ్లాస్ ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 835 చిప్‌సెట్‌, 13 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8జీబి ర్యామ్, ఈ ఫోన్ ధర ఇండియన్ మార్కెట్లో రూ.45,000 వరకు ఉండొచ్చు.

యాపిల్ కొత్త వ్యూహం, రూ.24000కే కొత్త ఐప్యాడ్!

Read more about:
English summary
HMD is claimed to announce the Nokia 9 and expand the Nokia 7 availability globally only in 2018.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot