జనవరి 19న నోకియా 9?

|

నోకియా 9 అఫీషియల్ లాంచ్‌కు సంబంధించి ఓ రిపోర్ట్ వెలువడింది. జనవరి 19న చైనాలో నిర్వహించబోయే ఓ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా నోకియా 9 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌ఎండి గ్లోబల్ లాంచ్ చేయబోతోంది. ఇదే కార్యక్రమంలో నోకియా 8 (2018) ఎడిషన్‌ను కూడా హెచ్‌ఎండి గ్లోబల్ ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది. నోకియా 9కు సంబంధించిన ప్రొటెక్టివ్ కేస్‌లు ఇప్పటికే ఆన్‌లైన్‌లో లిస్ట్ అయి ఉన్న విషయం తెలిసిందే.

 
జనవరి 19న నోకియా 9?

ప్రముఖ చైనీస్ వెబ్‌సైట్ మైడ్రైవర్స్ రిపోర్ట్ చేసిన కధనం ప్రకారం నోకియా 9తో పాటు నెక్స్ట్ జనరేషన్ నోకియా 8 స్మార్ట్‌ఫోన్‌లు చైనా యూజర్లకు అనువుగా ప్రత్యేకమైన కస్టమైజిడ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతున్నయి.

ఈ ఫోన్‌లలో గూగుల్ సర్వీసులకు బదులుగా లోకల్ సర్వీసులు ఉంటాయని తెలుస్తోంది. చైనా కస్టమర్‌లను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకమైన కస్టమ్ రోమ్‌ను ఈ రెండు ఫోన్‌లతో ఆఫర్ చేసే అవకాశముందని తెలుస్తోంది.

ఇంటెక్స్ డ్యూయెల్ సెల్ఫీకెమెరా స్మార్ట్‌ఫోన్ రూ. 6999 వేలకేఇంటెక్స్ డ్యూయెల్ సెల్ఫీకెమెరా స్మార్ట్‌ఫోన్ రూ. 6999 వేలకే

నోకియా 9 లాంచ్ అనౌన్స్‌మెంట్ వివరాలతో ఫోన్‌కు సంబంధించిన స్ర్కీన్ షాట్‌ను కూడా మైడ్రైవర్స్ లీక్ చేసింది. లీకైన్ స్ర్కీన్ షాట్ ప్రకారం నోకియా 9 మొత్తం రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

మొదటి వేరియంట్ వచ్చేసరికి 6జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ వర్షన్‌లో లభ్యమవుతుంది. చైనా మార్కెట్ ధర రూ.36,000. రెండవ వేరియంట్ 6జీబి ర్యామ్ + 128జీబి స్టోరేజ్ వర్షన్‌లో లభ్యమవుతుంది. చైనా మార్కెట్ ధర రూ.40,900.

నోకియా 9 (రూమర్ స్పెసిఫికేషన్స్).. 5.5 అంగుళాల క్యూహెచ్‌డి డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 సాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ కెమెరా సెటప్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్.

Best Mobiles in India

Read more about:
English summary
Nokia 9 and Nokia 8 second-generation model are slated to be launched at an event on January 19, 2018 by HMD.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X