ఇక సమాచారం అంతా ఫ్రీ ఐప్యాడ్ అప్లికేషన్‌లోనే..!!

ఈ ఐప్యాడ్ అప్లికేషన్‌ని విడుదల చేసిన సందర్బంలో హాంగ్ కాంగ్‌కి చెందిన ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్(ISD)ప్రతినిధి మాట్లాడుతూ ఈ ఐప్యాడ్ అప్లికేషన్ ద్వారా హాంగ్ కాంగ్ గవర్నమెంట్‌కి చెందిన గవర్నమెంట్ ప్రాజెక్టులు, సమాజిక అభివృద్ది, ఇతర దేశాలతో పొల్చితే హాంగ్ కాంగ్ ఎలా వృద్ది ఎలా ఉందనే విషయాలను తెలయజేయడం జరుగుతుందని తెలిపారు.
గవర్నమెంట్ విడుదల చేసిన ఈ ఫ్రీ అప్లికేషన్ ఇంగ్లీషు, చైనీస్‌ని సపోర్ట్ చేస్తుంది. ఈ అప్లికేషన్ క్రింద గత సంవత్సరంతో పొల్చితే హాంగ్ కాంగ్ సోషల్ అభివృద్ది ఎలా ఉందో ఈ అప్లికేషన్ ద్వారా తెలుసుకొవచ్చని ప్రచురించారు. వీటితో పాటు ఈ అప్లికేషన్ దేశ ఎకానమీ, కామర్స్ ఇండస్ట్రీ, ఉద్యోగాలు, వాతారణం, సామాజిక బాద్యత, చదువు, ఇన్పర్మేషన్ టెక్నాలజీ లాంటి పలు రంగాలకు సంబంధించిన ఆసక్తికర అంశాలను తెలియజేస్తుందన్నారు.


Click it and Unblock the Notifications








