హానర్ నుంచి బడ్జెట్ ధరలో ట్రిపుల్ రేర్ కెమెరా స్మార్ట్‌ఫోన్
చైనా మొబైల్ మేకర్ హువాయి సబ్ బ్రాండ్ హానర్ తన లేటెస్ట్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ హువాయి హానర్ 10ఐ స్మార్ట్ ఫోన్ ని రష్యా మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ Midnight Black, Gradient Blue and Grad
చైనా మొబైల్ మేకర్ హువాయి సబ్ బ్రాండ్ హానర్ తన లేటెస్ట్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ హువాయి హానర్ 10ఐ స్మార్ట్ ఫోన్ ని రష్యా మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ Midnight Black, Gradient Blue and Gradient Red colour రంగుల్లో లభ్యమవుతోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ధర ఎంతనేది మాత్రం కంపెనీ బహిర్గతపరచలేదు.

అతి త్వరలో ఇది రష్యా మార్కెట్లో అమ్మకానికి వెళ్లే అవకాశం ఉంది. ఇండియాకు ఎప్పుడు వస్తుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్లోనే ఉంచింది. దీని ఫీచర్ల విషయానికి వస్తే..

ఫీచర్లు
6.21 ఇంచ్ పుల్ హెచ్ డి డిస్ ప్లే, 19:5:9 యాస్పెక్ట్ రేషియో, 1080x2340 ఫిక్సల్ రిజల్యూషన్, ఆండ్రాయిడ్ 9పై ఆపరేటింగ్ సిస్టం, కిరిన్ 710 ప్రాసెసర్, 4జిబి ర్యామ్,128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్, 512జిబి విస్తరణ సామర్థ్యం, డ్యూయెల్ సిమ్, 24MP main sensor with f/1.8 aperture కెమెరా, 2 ఎంపి సెకండరీ కెమెరా 8 ఎంపి ఆల్ట్రావైడ్ ధర్డ్ కెమెరా,32 ఎంపి సెల్ఫీ కెమెరా,154.8 x 73.64 x 7.95mm కొలతలు, 3400mAh battery, 4G, VoLTE, 3G, Wi-Fi, Bluetooth, GPS and USB Type C

హానర్ 10 లైట్
కాగా ఈ మధ్యనే కంపెనీ తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ హానర్ 10 లైట్ ని లాంచ్ చేసిన సంగతి విదితమే. 3జిబి ర్యామ్ తో విడుదలైన ఈ ఫోన్ ధరను కంపెనీ రూ.11,999గా నిర్ణయించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో ఎక్స్క్లూజివ్ గా అందుబాటులో ఉంది. Sapphire Blue and Midnight Black colourలో లభ్యమవుతోంది.

హానర్ 10 లైట్ ఫీచర్లు
6.21 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఆఫర్
ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.13,999 ధరకు లభ్యమవుతుండగా, 6జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.17,999 ధరకు లభ్యమవుతున్నది. వీటిపై జియో కస్టమర్లకు రూ.2200 క్యాష్‌బ్యాక్ వోచర్ల రూపంలో లభిస్తుంది. అలాగే రూ.2800 విలువైన క్లియర్ ట్రిప్ వోచర్లను కూడా అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications








