Home
News

Honor 200 సిరీస్ ఫోన్లు ఇండియా లాంచ్ వివరాలు! ధర, స్పెసిఫికేషన్లు

హానర్ 200 మరియు హానర్ 200 ప్రో లు అమెజాన్‌లో ప్రత్యేకమైన మైక్రోసైట్ ద్వారా త్వరలో భారతదేశంలో తమ అరంగేట్రం చేయడానికి టీజర్ విడుదలచేయబడింది. అధికారికంగా ఈ 2 పరికరాలకు సంబంధించిన లాంచ్ తేదీని ప్రకటించనప్పటికీ, అమెజాన్ లిస్టింగ్ లో ఇవి భారతదేశానికి త్వరలో రాబోతున్నట్లు పేర్కొన్నారు.

Honor 200 సిరీస్ స్పెసిఫికేషన్ల వివరాలు :
హానర్ 200 సిరీస్ ఇండియా వెర్షన్ స్పెసిఫికేషన్‌లపై అధికారికంగా ఎటువంటి సమాచారం లేనప్పటికీ, ఈ ఫోన్‌ల యొక్క చైనీస్ వెర్షన్‌ను పరిశీలిస్తే భారతదేశానికి వచ్చే పరికరాలపై కొంత స్పష్టత వస్తుంది.

Honor 200  Honor 200 Pro India Launch

Honor 200 ఫోన్లు 2664 x 1200 పిక్సెల్‌ల రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల పూర్తి HD+ కర్వ్డ్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 100% DCI-P3 కలర్ గామట్, 4000 నిట్స్ గరిష్ట ప్రకాశం మరియు 3840Hz PWM డిమ్మింగ్ ఫీచర్లు ఉన్నాయి.

హానర్ 200 ఫోన్లు 4nm ప్రాసెస్ ఆధారంగా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌లో పనిచేస్తుంది మరియు అన్ని గ్రాఫిక్స్ సంబంధిత టాస్క్‌లను నిర్వహించడానికి అడ్రెనో 720 GPUతో జత చేయబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ గరిష్టంగా 16GB RAM మరియు 512GB స్టోరేజీ తో వస్తుంది.

ఇక కెమెరా ఆప్టిక్స్ వివరాల పరంగా చూస్తే, వెనిలా వేరియంట్ OIS తో 50MP సోనీ IMX906 ప్రైమరీ సెన్సార్‌తో వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్, 112° ఫీల్డ్ ఆఫ్ వ్యూ (FoV)తో 12MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 2.5xతో 50MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ మరియు వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 50MP సోనీ IMX906 సెన్సార్ ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,200mAh బ్యాటరీతో పనిచేస్తుంది. Honor 200 Android 14 ఆధారిత Magic OS 8.0 పై రన్ అవుతుంది.

ఇక, Honor 200 Pro స్పెసిఫికేషన్లు గమనిస్తే, ఇది 6.78-అంగుళాల OLED ప్యానెల్‌తో దాని వనిల్లా వేరియంట్‌తో చైనాలో లాంచ్ చేయబడింది. ఇది గరిష్టంగా 16GB RAM మరియు 1TB స్టోరేజీ తో వస్తుంది. తాజా Honor పరికరం క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్‌తో ఆధారితమైనది మరియు అన్ని గ్రాఫిక్స్ సంబంధిత టాస్క్‌లను నిర్వహించడానికి అడ్రెనో 735 GPUతో జత చేయబడింది.

ఇక కెమెరా ఆప్టిక్స్ వివరాలు గమనిస్తే, 50MP Omnivision OV50H సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 50MP టెలిఫోటో లెన్స్ సెటప్‌తో వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. వనిల్లా వేరియంట్ మాదిరిగానే, సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం 50MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా షూటర్ కూడా ఉంది.

హానర్ 200 సిరీస్ అంచనా ధర వివరాలు :
హానర్ 200 వనిల్లా 12GB RAM/256GB స్టోరేజ్ వేరియంట్ కోసం 2699 Yuan (సుమారు ₹31,000) ధరతో చైనాలో ఇదివరకే లాంచ్ చేయబడింది. అయితే 16GB RAM మరియు 512GB స్టోరేజ్ కలిగిన టాప్ వేరియంట్ ధర 3199 యువాన్ (సుమారు రూ.0300)గా ఉంది.

ఇంకా, Honor 200 Pro యొక్క 12GB RAM/256GB స్టోరేజ్ వేరియంట్ కోసం 3,499 యువాన్ల (సుమారు ₹40,000) ధరతో ప్రారంభమైంది, అయితే 16GB RAM/1TB స్టోరేజ్ ఉన్న టాప్ వేరియంట్ 4,499 యువాన్‌లకు (సుమారు ₹51,000) గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Honor 200, Honor 200 Pro India Launch Confirmed. Price And Specifications Details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X