Home
News

‘Honor 7’ సేల్ స్టార్ట్ అయ్యింది.. ఫ్లిప్‌కార్ట్‌లో

ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ Huawei ఇటీవల ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించిన తన హానర్ 7 ఫోన్‌కు సంబంధించిన మొదటి ఆన్‌లైన్ సేల్‌ను ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ Flipkartలో మంగళవారం అర్థరాత్రి ప్రారంభించింది. అక్టోబర్ 15 అర్థరాత్రి వరకు ఈ సేల్ కొనసాగుతుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. రెండు కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. మిస్టరీ గ్రే, ఫాంటసీ సిల్వర్. ధర రూ.22,999.

క్యాష్‌బ్యాక్ అలానే ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ల‌ పై ఫోన్‌ను అందుబాటులో ఉంచినట్లు కంపెనీ ప్రకటించింది. క్యాష్ బ్యాక్‌‍లో బాగంగా ఎంపిక చేసిన బ్యాంకుల నుంచి 10% రాయితీ, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై రూ. 12,000 వరకు తగ్గింపును యూజర్తు పొందవచ్చు. తమ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ హానర్ 7ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేయటం తమకెంతో ఉత్సాహంగా ఉందని Huawei ఇండియా - కన్స్యూమర్ బిజినెస్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ విభాగం) పీ సంజీవ్ తెలిపారు.

పూర్తిస్థాయి మెటాలిక్ ఫినిషింగ్‌తో వస్తున్న ఈ డివైస్ సింగిల్ హ్యాండెడ్ యూసేజ్‌కు అద్భుతంగా పనికొస్తుందని కంపెనీ చెబుతోంది. ఫోన్‌లో ఏర్పాటు చేసిన డెడికేటెడ్ స్మార్ట్ బటన్ అలానే గెస్డ్యుర్ - ఎనేబుల్డ్ ఫింగర్ ప్రింటర్ రీడర్ ఫీచర్లు ఫోన్ వినియోగాన్ని మరింత సౌకర్యవంతం చేస్తాయి.

హానర్ 7 ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన SOS అప్లికేషన్ యూజర్ భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తుంది. అత్యవసర సమయంలో ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఉపయోగించుకునే విధానం: ఎమర్జన్సీ సమయంలో వినియోగదారుడు ఫోన్ పవర్ బటన్‌ను ప్రెస్ చేయటం లేదా ఫోన్‌ను షేక్ చేయటం ద్వారా అప్లికేషన్ ఆన్ అవుతుంది. తద్వారా అలర్ట్ సౌండ్ ఉత్పన్నమవుతుంది. అంతే కాకుండా సదురు వ్యక్తికి ఆప్తులైన నలుగురికి సందేశం రూపంలో హెచ్చరికలు పంపుతుంది.

హానర్ 7 ఫోన్‌లో ఏర్పాటు చేసిన ఫ్రీ ఫ్రేమ్ మెటాలిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ 360 డిగ్రీ ఫింగర్ ప్రింట్ ప్రమాణీకరణ (authentication)తో పనిచేస్తుంది. ఈ ఫింగర్ ప్రింట్ టెక్నాలజీతో డ్యుయల్ హార్డ్ వేర్ సెక్యూరిటీ డిఫెన్స్ సిస్టంను ఇంటిగ్రేట్ చేసారు. ఈ డిఫెన్సివ్ సిస్టం మీ వ్యక్తిగత డేటాకు పూర్తిస్థాయి రక్షణనిస్తుంది. Honor 7 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు official websiteలోకి లాగిన్ అవ్వండి.

‘Honor 7’ సేల్ స్టార్ట్ అయ్యింది.. ఫ్లిప్‌కార్ట్‌లో

‘Honor 7’ సేల్ స్టార్ట్ అయ్యింది.. ఫ్లిప్‌కార్ట్‌లో

5.2 అంగుళాల 1080 పిక్సల్ పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 5.0.2 ఆపరేటింగ్ సిస్టం, Huawei's EMUI 3.0 కస్టమ్ యూజర్ ఇంటర్‌ఫేస్,

‘Honor 7’ సేల్ స్టార్ట్ అయ్యింది.. ఫ్లిప్‌కార్ట్‌లో

‘Honor 7’ సేల్ స్టార్ట్ అయ్యింది.. ఫ్లిప్‌కార్ట్‌లో

64 బిట్ ఆక్టా కోర్ 2.2గిగాహెర్ట్జ్ HiSilicon Kirin 935 సీపీయూ, 3జీబి ర్యామ్

‘Honor 7’ సేల్ స్టార్ట్ అయ్యింది.. ఫ్లిప్‌కార్ట్‌లో

‘Honor 7’ సేల్ స్టార్ట్ అయ్యింది.. ఫ్లిప్‌కార్ట్‌లో

శక్తివంతమైన 360 డిగ్రీ ఫింగర్ ప్రింట్ సెన్సార్,

‘Honor 7’ సేల్ స్టార్ట్ అయ్యింది.. ఫ్లిప్‌కార్ట్‌లో

‘Honor 7’ సేల్ స్టార్ట్ అయ్యింది.. ఫ్లిప్‌కార్ట్‌లో

ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి, 64జీబి), ప్రస్తుతానికి భారత్ లో 16జీబి వర్షన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

‘Honor 7’ సేల్ స్టార్ట్ అయ్యింది.. ఫ్లిప్‌కార్ట్‌లో

‘Honor 7’ సేల్ స్టార్ట్ అయ్యింది.. ఫ్లిప్‌కార్ట్‌లో

20 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ 26ఎమ్ఎమ్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

‘Honor 7’ సేల్ స్టార్ట్ అయ్యింది.. ఫ్లిప్‌కార్ట్‌లో

‘Honor 7’ సేల్ స్టార్ట్ అయ్యింది.. ఫ్లిప్‌కార్ట్‌లో

సింగిల్ సిమ్, 4జీ ఇంకా 3జీ కనెక్టువిటీ, ఐఆర్ రిమోట్ సెన్సార్,

‘Honor 7’ సేల్ స్టార్ట్ అయ్యింది.. ఫ్లిప్‌కార్ట్‌లో

‘Honor 7’ సేల్ స్టార్ట్ అయ్యింది.. ఫ్లిప్‌కార్ట్‌లో

3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ పై 15 నెలలు, ఎల్ సీడీ పై నెల వారంటీని కంపెనీ ఆఫర్ చేస్తోంది.

Best Mobiles in India

English summary
Honor 7 Goes On Sale Exclusively On Flipkart Starting Today. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X