3జీబి ర్యామ్‌తో ‘Huawei Honor 7’

Posted By:

క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా, వినియోగదారుల విశ్వసనీయతే లక్ష్యంగా స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేస్తున్న ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ Huawei తన Honor సిరీస్ నుంచి మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది.

3జీబి ర్యామ్‌తో ‘Huawei Honor 7’

‘హానర్ 7' పేరుతో రాబోతున్న ఈ ఫోన్‌ను అక్టోబర్ 2వ వారంలో విడుదల చేయుబోతున్నారు. పూర్తిస్థాయి మెటాలిక్ ఫినిషింగ్‌తో వస్తున్న ఈ డివైస్ సింగిల్ హ్యాండెడ్ యూసేజ్‌కు అద్భుతంగా పనికొస్తుందని కంపెనీ చెబుతోంది. ఫోన్‌లో ఏర్పాటు చేసిన డెడికేటెడ్ స్మార్ట్ బటన్ అలానే గెస్డ్యుర్ - ఎనేబుల్డ్ ఫింగర్ ప్రింటర్ రీడర్ ఫీచర్లు ఫోన్ వినియోగాన్ని మరింత సౌకర్యవంతం చేస్తాయి.

3జీబి ర్యామ్‌తో ‘Huawei Honor 7’

ఆధునిక ఇంటర్నెట్ అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేయబడిన Huawei Honor 7 స్పెసిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి.. 5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్, 423 పీపీఐ), 64 బిట్ ఆక్టా కోర్ కైరిన్ 935 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, ఆర్మ్ మాలీ - టీ628 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఆండ్రాయిడ్ ఆధారంగా డిజైన్

చేసిన లేటెస్ట్ వర్షన్ EMUI 3.1పై ఫోన్ రన్ అవుతుంది. 20 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్, సోనీ ఐఎమ్ఎక్స్230 సెన్సార్, ఎఫ్ /2.0 aperture, 6-లెన్స్ మాడ్యుల్, సఫైర్ గ్లాస్ ప్రొటెక్షన్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్.

English summary
Honor 7 To Launch In India In The Second Week Of October!.Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting