హువాయి సబ్ బ్రాండ్ అయిన హానర్....భారతదేశంలో హానర్ 7x స్మార్ట్ ఫోన్ను ప్రారంభించడానికి రెడీగా ఉంది. డిసెంబర్ 5న లాంచ్ చేయున్నట్లు గతంలో కొన్ని రిపోర్ట్స్ వెల్లడించాయి. అమెజాన్ ఇండియా ఇప్పుడు హానర్ 7x కోసం క్రియేట్ చేసిన ఒక బ్యానర్ను డిసెంబర్ 5న ఆవిష్కరించనున్నట్లు సమాచారం. ఇ-కామర్స్ సైట్ డిసెంబర్ 7నుంచి స్మార్ట్ ఫోన్ను విక్రయించనున్నట్లు పేర్కొంది.
ఇ-కామర్స్ పోర్టల్ ఒక్కటే కాదు...హానర్ 7x కోసం ప్రత్యేకమైన ల్యాండింగ్ పేజీని క్రియేట్ చేసింది. ఈ డివైస్ అమెజాన్ ఇండియా ద్వారా ఎక్స్ క్లూజివ్ గా అందించనుంది. డిసెంబర్ 7న విక్రయాలు ప్రధానం మధ్యాహ్నం 12గంటల నుంచి మొదలు కానున్నాయి.
ఇ-కామర్స్ సైట్ కూడా స్మార్ట్ ఫోన్ కోసం రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. రిజిస్ట్రర్ చేసుకున్న వ్యక్తులు 1000+ ప్రైజులను గెలుచుకునే బంపర్ ఆఫర్ ఉంటుంది. పేయిడ్ ట్రిప్స్ , స్మార్ట్ ఫోన్లు, పవర్ బ్యాంక్స్, హెడ్ ఫోన్లను గెలుచుకోవచ్చు.
ఏదేమైనప్పటికి...స్మార్ట్ ఫోన్ భారతదేశానికి త్వరలోనే రానుంది. చైనాలో ఇప్పటికే స్మార్ట్ ఫోన్ అమ్మకాలు జరుగుతుండగా...హానర్ 7x , 5.93అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్ డిస్ల్పేను కలిగి ఉంటుంది. 18:9 నిష్పత్తితో 1060 పిక్సెల్స్ రిజల్యూషన్ తో 2160 పిక్సెల్స్ రిజల్యూషన్ను రిలీజ్ చేస్తుంది. స్మార్ట్ ఫోన్ టాప్ 2.5డి గ్లాస్ తో డిజైన్ చేయబడి ఉంటుంది.
కిరిన్ 659 ఆక్టా కోర్ soc పెయిర్డ్ 4జిబి ర్యామ్ తోపాటు, హ్యాండ్సెట్ 32జిబి లేదా 64జిబి ఇంటర్నల్ స్టోరేజిని అందిస్తుంది. 7X బ్యాక్ సైడ్ డ్యుయల్ కెమెరా సెటప్ను కలిగి ఉంటుంది. 16మెగాపిక్సెల్ మరియు 2మెగాపిక్సెల్ సెన్సార్ను కలిగి ఉంటుంది. ఇక ఫ్రంట్ సైడ్ స్మార్ట్ ఫోన్ స్పోర్ట్స్ 8మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది.
ప్లే స్టోర్‌లోకి 'యూట్యూబ్ గో' ఫైనల్ వర్షన్
3340ఎంఏహెచ్ బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 7.0నౌగట్ తో EMIU 5.1 స్కిన్ టాప్ ఉంటుంది. 165.00గ్రాముల బరువు ఉంటుంది.
హానర్ 7X నానో డ్యుయల్ సిమ్స్ ను యాక్సెప్ట్ చేస్తుంది. వైఫై, జిపిఎస్, బ్లూటూత్, యుఎస్బి, ఓటిజి, 3జి, 4జి సపోర్టు చేస్తుంది. అంతేకాదు ఈ ఫోన్లనో సెన్సార్స్, కంపాస్ మాగ్నెట్టోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలేరోమీటర్, పరిసరకాంతి, సెన్సర్ , గైరోస్కోప్ ఉన్నాయి.
స్మార్ట్ ఫోన్ బ్లూ, బ్లాక్ మరియు గోల్డ్ రంగుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.