Home
News

12GB RAM , 200MP కెమెరా తో వచ్చే ఈ ఫోన్ పై అమెజాన్ లో భారీ ఆఫర్!

By Maheswara

ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీదారు, దాదాపు రెండు సంవత్సరాల తరవాత భారత మార్కెట్లో రీ ఎంట్రీ ఇచ్చింది. Honor ఇటీవల తన కొత్త Honor 90 5G స్మార్ట్‌ఫోన్‌ని భారతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. Honor 90 5G ఫోన్ కొన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో మొబైల్ ప్రియుల దృష్టిని ఆకర్షించింది.

అయితే, ఇప్పుడు దీపావళి పండగ సందర్భంగా అమెజాన్ లో జరుగుతున్న సేల్ లో Honor 90 5G ఫోన్ పై భారీ ధర తగ్గింపు ఆఫర్లు అందిస్తోంది. అలాగే, మీరు అందుబాటులో ఉన్న ఎక్స్ఛేంజ్ ఆఫర్, బ్యాంక్ ఆఫర్ మరియు ఇతర ఆఫర్లను పొందినట్లయితే, మీరు ఖచ్చితంగా మరింత తగ్గింపు పొందుతారు.

Honor 90 5G 12GB RAM Variant Now Available With Huge Discount Offer On Amazon Sale. Offer Details And Price Here.

అవును, Honor 90 5G స్మార్ట్‌ఫోన్ ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పై ఇప్పుడు 32% తగ్గింపు ఆఫర్ ఉంది. కస్టమర్లు ఈ ఫోన్ యొక్క 12GB + 512GB వేరియంట్‌ను రూ.33,999కి పొందవచ్చు.

కొత్త Honor 90 5G ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఇది 5,000mAh బ్యాటరీతో అందించబడుతుంది. ప్రైమరీ కెమెరా 8-మెగాపిక్సెల్ సెన్సార్‌తో అమర్చబడి ఉంటుంది.ఈ స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర ఫీచర్ల గురించి మరింత తెలుసుకుందాం.

డిస్ప్లే మరియు స్క్రీన్ రిజల్యూషన్
ఈ హానర్ స్మార్ట్‌ఫోన్ 1,200 x 2,664 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే, ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది మరియు గరిష్టంగా 1,600 నిట్‌ల బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది.

ప్రాసెసర్ మరియు స్టోరేజీ వివరాలు
హానర్ 90 5G మొబైల్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనితో పాటు, ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత మ్యాజిక్ OS 7.1 మద్దతును కలిగి ఉంది. ఇప్పుడు ఇది 8 + 256 GB స్టోరేజ్ వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంది. దీని ధర రూ.31,999 గా ఉంది.

స్టోరేజీ ఎంపికలలో హానర్ 90 5G మొబైల్ 8GB + 256 GB మరియు 12GB + 512GB స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.

ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
హానర్ 90 5G ఈ స్మార్ట్‌ఫోన్‌ల యొక్క ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది, మొదటి కెమెరా 200-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంది ఇంకా 12MP ,2MP కెమెరాలు ఉంటాయి. అలాగే, 50 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా అందించబడింది.

ఇక బ్యాటరీ బ్యాకప్ వివరాలు గమనిస్తే
హానర్ 90 5G స్మార్ట్ ఫోన్ 5,000 mAh బ్యాటరీ బ్యాకప్ సదుపాయాన్ని కూడా పొందుతుంది. ఇందులో 66W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఉంటుంది. ఇది కాకుండా, ఫోన్ కనెక్టివిటీ ఎంపికల పరంగా 5G, 4G, Wi-Fi 6, బ్లూటూత్ 5.2, GPS, NFC మరియు USB టైప్-సి పోర్ట్‌లకు మద్దతు ఇస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Honor 90 5G 12GB RAM Variant Now Available With Huge Discount Offer On Amazon Sale. Offer Details And Price Here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X