రెండేళ్ల తర్వాత, Honor నుంచి రానున్న మొదటి ఫోన్ ! అదీ 200MP కెమెరాతో...వివరాలు
హానర్ ఎట్టకేలకు భారతదేశంలో హానర్ 90 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీని ప్రకటించింది. రెండు సంవత్సరాల విరామం తర్వాత భారతీయ మార్కెట్లోకి కంపెనీ పునరాగమనాన్ని ఈ పరికరం సూచిస్తుంది. Honor 90 5G మొదటిసారిగా మే 2023 లో చైనాలో లాంచ్ చేయబడింది. ఇది తరువాత UAE మరియు యూరప్ లలో కూడా లాంచ్ చేశారు. మరియు ఇప్పుడు ఇది చివరకు భారతదేశానికి చేరుకుంది.
Honor 90 5G ఇండియా లాంచ్ తేదీ వివరాలు
హానర్ 90 5G భారతదేశంలో సెప్టెంబర్ 14న మధ్యాహ్నం 12:30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) లాంచ్ కానున్నట్లు హానర్ సంస్థ ధృవీకరించింది. అమెజాన్ లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ యొక్క మైక్రోసైట్ ఎమరాల్డ్ గ్రీన్ మరియు దానిలోని కొన్ని ముఖ్య స్పెసిఫికేషన్లను అందిస్తుంది. ఈ పరికరం యొక్క స్పెసిఫికేషన్లు మరియు అంచనా ధర వివరాలను ఇక్కడ చూడండి.

హానర్ 90 5G స్పెసిఫికేషన్ల వివరాలు
హానర్ 90 5G స్మార్ట్ ఫోన్ 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ప్లేతో క్వాడ్ కర్వ్డ్ డిజైన్ మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. ఇది 1200 x 2664 పిక్సెల్‌లతో 1.5K రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఈ పరికరం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 యాక్సిలరేటెడ్ ఎడిషన్‌తో ఆధారితమైనది మరియు ఇది MagicOS 7.1-ఆధారిత ఆండ్రాయిడ్ 13 పై పనిచేస్తుంది. చైనీస్ మార్కెట్‌లో, ఈ పరికరం గరిష్టంగా 16 GB LPDDR4x RAM మరియు 512 GB వరకు UFS 3.1 స్టోరేజ్‌తో రాబోతోంది.
ఇంకా, ఈ ఫోన్ యొక్క ముందు భాగంలో, 50-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది మరియు దాని వెనుక ప్యానెల్ లో ట్రిపుల్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇందులో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాలు ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ పరికరం 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
భారతదేశంలో హానర్ 90 5G ధర వివరాలు
హానర్ 90 5G స్మార్ట్ ఫోన్ పై ఉన్న అంచనాలను గమనిస్తే, పుకార్లు ప్రకారం భారతదేశంలో ఈ స్మార్ట్ ఫోన్ ధర సుమారు రూ. 35,000 (~$420) ఉంటుందని అంచనాలున్నాయి. ఇండియాలో ఈ ఫోన్ లాంచ్ అయిన తర్వాత, అమెజాన్ ద్వారా సేల్ కు రాబోతుంది.
చైనాలో, ఈ హానర్ 90 5G స్మార్ట్ ఫోన్ యొక్క ధరలను ఒక్కసారి గమనిస్తే, 12GB + 256GB వేరియంట్ ధర CNY 2,499 (సుమారు రూ. 29,160) నుండి ప్రారంభమవుతుంది, అయితే 16GB + 256GB మరియు 16GB + 512GB వేరియంట్‌ల ధర లు వరుసగా CNY 2,799 (రూ.32 ,680 మరియు ధర CNY 2,999 (సుమారు రూ. 35,017) గా ఉన్నాయి. మరిన్ని పూర్తి వివరాల కోసం సెప్టెంబర్ 14 వరకు వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications