200MP కెమెరా, 256GB స్టోరేజీ Honor స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. సేల్ వివరాలు..!
ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్ కార్ట్‌లో హానర్ 90 5G స్మార్ట్‌ఫోన్ (Honor 90 5G Smartphone) భారీ తగ్గింపు ధరను పొందింది. ఈ హ్యాండ్ సెట్ మెరుగైన స్పెసిఫికేషన్లు, ఫీచర్లను కలిగి ఉంటుంది. ప్రధానంగా 200MP ప్రైమరీ కెమెరా సహా ముందువైపు 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. మరియు 6.7 అంగుళాల పుల్ HD+ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్‌లో ఈ ఫోన్ ఏకంగా 44 శాతం తగ్గింపును (Honor 90 5G Smartphone Discount Price) పొందింది. ఫలితంగా ఈ హ్యాండ్ సెట్ 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.25,499 గా ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్లు సహా నో కాస్ట్ EMI సదుపాయం కూడా అందుబాటులో ఉంది.

హానర్ 90 5G స్పెసిఫికేషన్లు.. :
హానర్ 90 5G స్మార్ట్ ఫోన్ 6.7 అంగుళాల 1.5k పుల్ HD + కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్ సెట్ 1200*2644 పిక్సల్ స్క్రీన్ రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్, 1600 నిట్స్ గరిష్ఠ బ్రైట్ నెస్, 3840Hz డిమ్మింగ్‌ను కలిగి ఉంటుంది.
200MP కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా :
హానర్ 90 5G స్మార్ట్ ఫోన్ వెనుకపైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 200MP ప్రైమరీ కెమెరా, 12MP ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా మరియు 2MP డెప్త్ సెన్సార్‌ను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ హానర్ హ్యాండ్‌సెట్ 50MP కెమెరాను కలిగి ఉంది.
రెండు స్టోరేజీ వేరియంట్లు :
ఈ హానర్ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత Magic OS 7.1 పైన పనిచేస్తుంది. మరియు క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ హ్యాండ్ సెట్ 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ, 12GB ర్యామ్ + 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది.
5000mAh బ్యాటరీ సామర్థ్యం :
ఈ హానర్ హ్యాండ్ సెట్ 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్ 5G, 4G, wi-fi, బ్లూటూత్ 5.2, GPS, NFC, USB-C ఛార్జింగ్ పోర్టుతో కలిగి ఉంది. ఈ హ్యాండ్ సెట్ గ్రీన్, బ్లాక్, సిల్వర్ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








