బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు Honor 9A & 9S అమ్మకాలు రేపటి నుంచే మొదలు

|

హువాయి యొక్క సబ్-బ్రాండ్ హానర్ సంస్థ ఇండియాలో గత నెలలో బడ్జెట్ ధరలో రెండు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. హానర్ 9A మరియు హానర్ 9S పేరుతో విడుదలైన ఈ ఫోన్‌ల యొక్క అమ్మకాలు ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా మొదలుకానున్నాయి. హానర్ 9A యొక్క అమ్మకాలు ఆగస్టు 13 న మరియు హానర్ 9S యొక్క అమ్మకాలు ఆగస్టు 14 న అమెజాన్ ఇండియా మరియు ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా జరగనున్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

హానర్ 9A & 9S సేల్ డేట్ వివరాలు
 

హానర్ 9A & 9S సేల్ డేట్ వివరాలు

హానర్ సంస్థ ఇటీవల ఇండియాలో హానర్ మ్యాజిక్‌బుక్ 15 ల్యాప్‌టాప్‌తో పాటుగా హానర్ 9A, 9S స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. హానర్ 9S మరియు 9A రెండూ కూడా ఆండ్రాయిడ్ 10 ఆధారిత హానర్స్ మ్యాజిక్ UI 3.1 తో రన్ అవుతాయి. ఈ ఫోన్‌లలో హువాయి యొక్క కొత్త AppGallery కూడా ఉన్నాయి. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో పరిమిత కాలంలో మాత్రమే అమ్మకానికి వచ్చే ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఇటీవల అమ్మకానికి వచ్చాయి. హానర్ 9A అమ్మకాలు అమెజాన్ ఇండియా ద్వారా జరుగుతుండగా హానర్ 9S యొక్క అమ్మకాలు ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా జరగనున్నాయి.

Also Read శాంసంగ్ ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు, రూ.10,000 వరకూ కూడా తగ్గింపు...!Also Read శాంసంగ్ ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు, రూ.10,000 వరకూ కూడా తగ్గింపు...!

హానర్ 9A , హానర్ 9S ధరల వివరాలు

హానర్ 9A , హానర్ 9S ధరల వివరాలు

హానర్ 9A మరియు హానర్ 9S స్మార్ట్‌ఫోన్‌లు రెండూ కూడా కేవలం ఒకే ఒక స్టోరేజ్ ఎంపికలతో అందుబాటులో ఉన్నాయి. హానర్ 9A యొక్క 3GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర రూ.9,999 కాగా, హానర్ 9S యొక్క 2GB ర్యామ్ + 32GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర 6,499 రూపాయలు. హానర్ 9A ఫోన్ మిడ్నైట్ బ్లాక్ మరియు ఫాంటమ్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అలాగే హానర్ 9S ఫోన్ బ్లూ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

హానర్ 9A స్పెసిఫికేషన్స్
 

హానర్ 9A స్పెసిఫికేషన్స్

హానర్ 9A స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్ సిమ్ స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 OS మ్యాజిక్ UI3.1 తో రన్ అవుతుంది. ఇది 6.3-అంగుళాల హెచ్‌డి + ఫుల్ వ్యూ డిస్ప్లేను 720x1,600 పిక్సెల్ పరిమాణం మరియు 20: 9 కారక నిష్పత్తితో వస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ MT6762R SoC ను కలిగి ఉండి 3GB RAM తో జతచేయబడి ఉంటుంది. ఫోటోలు మరియు వీడియోల కోసం వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 5 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ సెన్సార్ మూడవ కెమెరాలను కలిగి ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

హానర్ 9A స్మార్ట్‌ఫోన్‌ 5,000mAh బ్యాటరీ

హానర్ 9A స్మార్ట్‌ఫోన్‌ 5,000mAh బ్యాటరీ

హానర్ 9A స్మార్ట్‌ఫోన్‌ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించవచ్చు. కనెక్టివిటీ ఎంపికలలో 4G ఎల్‌టిఇ, వై-ఫై 802.11 b/g/n , బ్లూటూత్ V5.0, GPS/ A-GPS, ఎఫ్‌ఎం రేడియో, మైక్రో-యుఎస్‌బి మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. వెనుకవైపున ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అంతేకాకుండా ఇది రివర్స్ ఛార్జింగ్‌కు మద్దతును ఇచ్చే 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

హానర్ 9S స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్

హానర్ 9S స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్

హానర్ 9S స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్ సిమ్ స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 OS మ్యాజిక్ UI3.1 తో రన్ అవుతుంది. ఇది 5.45-అంగుళాల హెచ్‌డి + ఫుల్ వ్యూ డిస్ప్లే 720x1,440 పిక్సెల్ పరిమాణం మరియు 18: 9 కారక నిష్పత్తితో వస్తుంది. ఇది మీడియాటెక్ MT6762R SoC చిప్ సెట్ ప్రాసెసర్ మరియు 2GB RAM తో జత చేయబడి వస్తుంది. ఫోన్ వెనుక భాగంలో సింగిల్ కెమెరాను మాత్రమే కలిగి ఉంటుంది. ఇది ఎఫ్ / 2.0 లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌తో వస్తుంది. అలాగే ఫోన్ ముందు భాగంలో సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ఎఫ్ / 2.2 లెన్స్‌తో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

హానర్ 9S స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ

హానర్ 9S స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ

హానర్ 9S స్మార్ట్‌ఫోన్‌ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించవచ్చు. కనెక్టివిటీ ఎంపికలలో 4G ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్ మరియు మైక్రో-యుఎస్బి పోర్ట్ ఉన్నాయి. చివరగా ఈ ఫోన్ 3,020mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Honor 9A, 9S 2nd Sale Starts Tomorrow in India via Amazon and Flipkart

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X