Home
News

Rs.6000 లకే Honor కొత్త స్మార్ట్‌ఫోన్‌లు!! వీటి ఫీచర్లు ఇవే....

ఇండియాలో కరోనా వైరస్ ప్రభావం కారణంగా అన్ని కంపెనీలు తమ కొత్త ప్రొడెక్టులను ఆన్‌లైన్ కార్యక్రమం ద్వారా విడుదల చేస్తున్నారు. ప్రముఖ హానర్ సంస్థ కూడా ఈ రోజు హానర్ మ్యాజిక్‌బుక్ 15 ల్యాప్‌టాప్‌తో పాటు హానర్ 9A మరియు హానర్ 9s బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసారు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఎంట్రీ లెవల్ ధరను కలిగి ఉండి మీడియాటెక్ ప్రాసెసర్ మరియు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

హానర్ 9A , హానర్ 9S ధరల వివరాలు

హానర్ 9A , హానర్ 9S ధరల వివరాలు

ఇండియాలో హానర్ 9A మరియు హానర్ 9S రెండూ కూడా కేవలం ఒకే ఒక స్టోరేజ్ ఎంపికలతో విడుదల అయ్యాయి. ఇందులో హానర్ 9A యొక్క 3GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర రూ.9,999 కాగా, హానర్ 9S యొక్క 2GB ర్యామ్ + 32GB స్టోరేజ్ సింగిల్ వేరియంట్‌ యొక్క ధర 6,499 రూపాయలు. హానర్ 9A ఫోన్ మిడ్నైట్ బ్లాక్ మరియు ఫాంటమ్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అలాగే హానర్ 9S ఫోన్ బ్లూ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

 

హానర్ 9A , హానర్ 9S లభ్యత వివరాలు

హానర్ 9A , హానర్ 9S లభ్యత వివరాలు

హానర్ 9A మరియు హానర్ 9S రెండు ఫోన్ల యొక్క మొదటి అమ్మకాలు ఇండియాలో ఆగస్టు 6 నుండి మొదలుకానున్నాయి. అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌ కామర్స్ వెబ్‌సైట్లలో ద్వారా హానర్ 9A ను ఆగస్టు 6 ఉదయం 11 గంటల నుండి మరియు అదే రోజున హానర్ 9S మధ్యాహ్నం 12 గంటల విక్రయించబడుతుంది. అయితే ప్రారంభ సేల్ లో భాగంగా హానర్ 9S రూ.5,999 ధర వద్ద లభిస్తుంది. అలాగే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు అదనంగా 10 శాతం తగ్గింపు లభిస్తుంది. ఇంకా రెండు ఫోన్‌లు ఆరు నెలల వరకు ఎటువంటి ఖర్చులేని EMI ఎంపికలతో లభిస్తాయి.

హానర్ 9A మీడియాటెక్ MT6762R SoC స్పెసిఫికేషన్స్

హానర్ 9A మీడియాటెక్ MT6762R SoC స్పెసిఫికేషన్స్

హానర్ 9A స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్ సిమ్ స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 OS మ్యాజిక్ UI3.1 తో రన్ అవుతుంది. ఇది 6.3-అంగుళాల హెచ్‌డి + ఫుల్ వ్యూ డిస్ప్లేను 720x1,600 పిక్సెల్ పరిమాణం మరియు 20: 9 కారక నిష్పత్తితో వస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ MT6762R SoC ను కలిగి ఉండి 3GB RAM తో జతచేయబడి ఉంటుంది. ఫోటోలు మరియు వీడియోల కోసం వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 5 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ సెన్సార్ మూడవ కెమెరాలను కలిగి ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

హానర్ 9A స్మార్ట్‌ఫోన్‌ 5,000mAh బ్యాటరీ

హానర్ 9A స్మార్ట్‌ఫోన్‌ 5,000mAh బ్యాటరీ

హానర్ 9A స్మార్ట్‌ఫోన్‌ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించవచ్చు. కనెక్టివిటీ ఎంపికలలో 4G ఎల్‌టిఇ, వై-ఫై 802.11 b/g/n , బ్లూటూత్ V5.0, GPS/ A-GPS, ఎఫ్‌ఎం రేడియో, మైక్రో-యుఎస్‌బి మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. వెనుకవైపున ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అంతేకాకుండా ఇది రివర్స్ ఛార్జింగ్‌కు మద్దతును ఇచ్చే 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

హానర్ 9S స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్

హానర్ 9S స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్

హానర్ 9S స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్ సిమ్ స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 OS మ్యాజిక్ UI3.1 తో రన్ అవుతుంది. ఇది 5.45-అంగుళాల హెచ్‌డి + ఫుల్ వ్యూ డిస్ప్లే 720x1,440 పిక్సెల్ పరిమాణం మరియు 18: 9 కారక నిష్పత్తితో వస్తుంది. ఇది మీడియాటెక్ MT6762R SoC చిప్ సెట్ ప్రాసెసర్ మరియు 2GB RAM తో జత చేయబడి వస్తుంది. ఫోన్ వెనుక భాగంలో సింగిల్ కెమెరాను మాత్రమే కలిగి ఉంటుంది. ఇది ఎఫ్ / 2.0 లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌తో వస్తుంది. అలాగే ఫోన్ ముందు భాగంలో సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ఎఫ్ / 2.2 లెన్స్‌తో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

హానర్ 9S స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ

హానర్ 9S స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ

హానర్ 9S స్మార్ట్‌ఫోన్‌ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించవచ్చు. కనెక్టివిటీ ఎంపికలలో 4G ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్ మరియు మైక్రో-యుఎస్బి పోర్ట్ ఉన్నాయి. చివరగా ఈ ఫోన్ 3,020mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Best Mobiles in India

English summary
Honor 9A, Honor 9S Released in India with 5000mAh Battery Capacity
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X