Honor 9S Sale: రూ.7,000 లోపు ధరలో బెస్ట్ ఫోన్ ఇదే!!!
హానర్ యొక్క తాజా ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ హానర్ 9S యొక్క అమ్మకాలు ఇండియాలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి మరోసారి ఫ్లిప్‌కార్ట్ ద్వారా మొదలయ్యాయి. ఈ చైనా కంపెనీ ఇటీవల బడ్జెట్ ధరలో రెండు కొత్త హానర్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఎవరైనా వారి యొక్క అవసరాల కోసం రూ.7 వేల లోపు ధరలో రెండవ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు ఛాయలనుకుంటే మాత్రం ఇది సరిగ్గా సరిపోతుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రూ.7 వేల లోపు ధర వద్ద విడుదల అయిన హానర్ 9S స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉండి అదే ధర విభాగంలో లభిస్తున్న షియోమి రెడ్‌మి 9 ప్రైమ్ మరియు రెడ్‌మి 9A కంటే తక్కువ ధరను కలిగి ఉంది. హానర్ యొక్క ఈ కొత్త ఫోన్ గూగుల్ ప్లేకి బదులుగా హువాయి యొక్క యాప్‌గల్లెరీతో వస్తుంది.

హానర్ 9S ధరల వివరాలు
ఇండియాలో ఒకే ఒక స్టోరేజ్ వేరియంట్‌లో విడుదల అయిన హానర్ 9S ఫోన్ 2GB ర్యామ్ మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ యొక్క ధర రూ.6,499. ఈ ఫోన్ ఇండియాలో బ్లూ మరియు బ్లాక్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది.

హానర్ 9S మీడియాటెక్ చిప్ సెట్ ప్రాసెసర్
హానర్ 9S స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 OS మ్యాజిక్ UI3.1 తో రన్ అవుతుంది. ఇది 5.45-అంగుళాల హెచ్‌డి + ఫుల్ వ్యూ డిస్ప్లే 720x1,440 పిక్సెల్ పరిమాణం మరియు 18: 9 కారక నిష్పత్తితో వస్తుంది. ఇది మీడియాటెక్ MT6762R SoC చిప్ సెట్ ప్రాసెసర్ మరియు 2GB RAM తో జత చేయబడి వస్తుంది. ఫోన్ వెనుక భాగంలో సింగిల్ కెమెరాను మాత్రమే కలిగి ఉంటుంది. ఇది ఎఫ్ / 2.0 లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌తో వస్తుంది. అలాగే ఫోన్ ముందు భాగంలో సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ఎఫ్ / 2.2 లెన్స్‌తో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

హానర్ 9S స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ
హానర్ 9S స్మార్ట్‌ఫోన్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించవచ్చు. కనెక్టివిటీ ఎంపికలలో 4G ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్ మరియు మైక్రో-యుఎస్బి పోర్ట్ ఉన్నాయి. చివరగా ఈ ఫోన్ 3,020mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.


Click it and Unblock the Notifications








