Home
News

8GB ర్యామ్‌, 200MP కెమెరా స్మార్ట్‌ఫోన్‌తో భారత్‌లోకి Honor రీఎంట్రీ..!

భారత్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి Honor సంస్థ రీఎంట్రీ ఇవ్వనుంది. ఈ అంశంపై ఈ నెల ప్రారంభంలోనే కొంత సమాచారం లీక్‌ చేసింది. ఇందులో తన ప్రమేయాన్ని రియల్‌మీ మాజీ సీఈవో మాధవ్‌ సేత్‌ ధ్రువీకరించారు. ఫలితంగా హానర్ టెక్‌ ఇండియా తన ఉద్దేశాన్ని అధికారికంగా ప్రకటించినట్లు అయింది. హానర్‌ సుమారుగా 3 సంవత్సరాల తర్వాత భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది.

2020 సంవత్సరంలో భారత్‌లో తన కార్యకలాపాలను నిలిపివేసింది. అనంతరం హానర్‌ ఉత్పత్తులను పీఎస్‌ఏవీ గ్లోబల్‌ భారత్‌లో అధికారిక పంపిణీదారుగా ఉంది. గత మూడు సంవత్సరాలుగా అనేక ట్యాబ్లెట్‌, ల్యాప్‌టాప్‌లను హానర్‌ బ్రాండ్‌ కింద లాంచ్‌ చేసింది. అయితే ఈ సంస్థ మరిన్ని రోజులు అదే పాత్రలో సేవలు అందించే అవకాశం ఉంది.

Honor confirmed it to re entry in India

Honor 90 మోడల్‌తో భారత్‌ మార్కెట్‌లోకి సంస్థ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ‌అయితే ఎంత ధరకు అందుబాటులోకి తీసుకువస్తారనే సమాచారం వెల్లడించలేదు. హానర్‌ 90 స్మార్ట్‌ఫోన్‌ సెప్టెంబర్‌ నెలలో భారత కస్టమర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఫోన్‌ గురించి మరిన్ని వివరాలు తెలియలేదు.

హానర్‌ 90 స్మార్ట్‌ ఫోన్‌ నాలుగు రంగుల్లో లభించనుంది. పికాక్‌ బ్లూ, డైమండ్‌ సిల్వర్‌, మిడ్‌నైట్‌ బ్లాక్‌, ఎమరాల్డ్‌ గ్రీన్‌ రంగుల్లో అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్‌ 6.7 ‌అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే్‌ను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో రానుందని తెలుస్తోంది.

ఈ ఫోన్‌ 200MP వైడ్‌ లెన్స్‌ను కలిగి ఉంది. దీంతోపాటు మరో 12MP, 2MP కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఫోన్‌ ముందువైపు 50MP కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. చైనా మార్కెట్‌లో ఈ ఫోన్ ధర రూ.28,700 (భారత కరెన్సీ)గా ఉంది.

ఈ ఫోన్‌ 8GB ర్యామ్‌+ 256GB స్టోరేజీ, 12GB ర్యామ్‌+ 256GB స్టోరేజీ, 16GB ర్యామ్‌+ 256GB స్టోరేజీ, 12GB ర్యామ్‌+ 512GB స్టోరేజీ, 16GB ర్యామ్‌+ 512GB స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

హానర్ 90 స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత మ్యాజిక్‌ OS 7.1పై పనిచేయనుందని తెలుస్తోంది. దీంతోపాటు బ్లూటూత్‌ 5.2, NFC, టైప్ C పోర్టు, 66W ర్యాపిడ్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ ఫోన్‌ సెప్టెంబర్‌లో విడుదల కానుందని కొన్ని వార్తలు వస్తున్న సంస్థ మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు.

అయితే హానర్‌ 90 స్మార్ట్‌ ఫోన్‌ స్పెసిఫికేషన్లు, ధర, ఇతర వివరాలపై హానర్‌ సంస్థ అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలో విడుదల చేస్తామని తమ ట్విట్టర్‌ హ్యాండిల్‌ ద్వారా వెల్లడించింది. అయితే ఏ తేదీన లాంచ్‌ కానుందనే సమాచారం విడుదల చేయలేదు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Honor confirmed it to re entry in indian market with honor 90 smartphone
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X