Home
News

200MP కెమెరా కలిగిన Honor స్మార్ట్‌ఫోన్‌పై బెస్ట్‌ డిస్కౌంట్.. ఆఫర్‌ కొద్ది రోజులు మాత్రమే..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ Htech కొన్ని నెలల ముందు Honor 90 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌ ప్రస్తుతం డిస్కాంట్‌ ధరతో పాటు బ్యాంగ్ ఆఫర్లు, ఎక్స్చేంజ్‌ ధరతో అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఈ హానర్ డేస్‌ సేల్‌లో భాగంగా ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సేల్‌ డిసెంబర్‌ 8న ముగుస్తుంది.

భారత్‌లో హానర్‌ 90 స్మార్ట్‌ఫోన్‌ ధర : హానర్‌ 90 స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌, 256GB అంతర్గత స్టోరేజీ ధర రూ.34,999గా ఉంది. టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ 12GB ర్యామ్‌, 512GB అంతర్గత స్టోరేజీ ధర రూ.36,999గా ఉంది. ఈ ఫోన్‌ గ్రీన్‌, డైమండ్ సిల్వర్‌, మిడ్‌నైట్‌ బ్లాక్‌ రంగుల్లో అందుబాటులో ఉంది.

Honor 90 smartphone

రూ.32,050 వరకు తగ్గింపు : అమెజాన్‌లో హానర్‌ డేస్‌ సేల్‌లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్‌, వన్‌కార్డ్‌, కెనరా బ్యాంక్‌ కార్డులపై 3000 రూపాయల వరకు డిస్కాంట్‌ను పొందుతారు. అయితే ఈ కార్డులపై డిస్కౌంట్లు వేర్వేరుగా ఉంటాయి. దీంతోపాటు నో కాస్ట్‌ EMI ఆప్షన్‌ను కూడా ఎంచుకోవచ్చు. ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ ద్వారా రూ.32,050 వరకు తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు.

ఫోన్‌ ఛార్జర్‌ ఉచితం : ఈ హానర్‌ డేస్‌ సేల్‌లో భాగంగా రూ.699 విలువైన 30W ఛార్జర్‌ను ఉచితంగా పొందవచ్చు. హానర్‌ స్మార్ట్‌ఫోన్‌ సహా ఛార్జర్‌ను కార్ట్‌లో యాడ్‌ చేయాల్సి ఉంటుంది. అనంతరం అక్కడ ఎలిజిబుల్‌ ఫర్ ఫ్రీ అని కనిపిస్తుంది. తర్వాత Toreto Htech 30W ఫోన్‌ ఛార్జర్‌ ప్రత్యేకంగా డెలివరీ చేయబడుతుంది.

Honor 90 smartphone

హానర్‌ 90 స్పెసిఫికేషన్లు : ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల 1.5k కర్వడ్‌ అమోలెడ్‌ 120Hz స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. 1600 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. 3840Hz డిమ్మింగ్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 4nm స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్ 1 చిప్‌తో వస్తుంది. మరియు ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత మేజిక్‌OS 7.1 పైన పనిచేస్తుంది.

హానర్‌ 90 బ్యాటరీ వివరాలు : ఈ స్మార్ట్‌ఫోన్‌ 66W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000 mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. హానర్‌ 90 స్మార్ట్‌ఫోన్‌ 200MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. 12MP ఆల్ట్రావైడ్ మరియు 2MP డెప్త్‌ సెన్సార్‌ను అమర్చారు. అదే ముందువైపు 50MP కెమెరాతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ వైఫై, బ్లూటూత్‌, NFC, USB-C ఛార్జింగ్‌తో వస్తుంది.

ప్రముఖ ఈ కామర్స్ అమెజాన్‌లో హానర్‌ డేస్‌ సేల్‌లో భాగంగా హానర్‌ 90పైన ఉన్న ఆఫర్‌ డిసెంబర్‌ 8న వరకు అందుబాటులో ఉంది. డిస్కౌంట్లు సహా బ్యాంక్‌ ఆఫర్ల ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు. ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. ఈ సేల్‌లో భాగంగా రూ.699 విలువైన ఛార్జర్‌ను ఉచితంగా పొందవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Honor days sale great deal on honor 90 smartphone in amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X