టాబ్లెట్ మార్కెట్లోకి Honor

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దూసుకుపోతున్న హువావే హానర్, త్వరలో టాబ్లెట్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. భారత్‌లో హువావే లాంచ్ చేయబోతోన్న మొట్టమొదటి హానర్ టాబ్లెట్ శక్తివంతమైన 4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుందని వినికిడి. సింగిల్ ఛార్జ్ పై 3జీ కాలింగ్ అలానే వీడియో ప్లేబ్యాక్స్ పై సుధీర్గ బ్యాకప్‌ను అందించే విధంగా ఈ బ్యాటరీ ఉంటుందని సమాచారం.

టాబ్లెట్ మార్కెట్లోకి Honor

పోర్టబుల్ కంప్యూటింగ్ పరికరాల్లో ఒకటైన టాబ్లెట్ 7 నుంచి 10 అంగుళాల మోస్తరు స్ర్కీన్‌ వర్షన్‌లతో చేతుల్లో సౌకర్యవంతంగా ఇమిడే విధంగా ఉంటుంది. వీటిని ఎక్కడికైనా క్యారీ చేయవచ్చు. ఈ బహుళ ఉపయోగకర డివైస్‌ల ద్వారా ఏకకాలంలో స్మార్ట్ మొబైలింగ్ అవసరాలను తీర్చుకోవటంతో పాటు కంప్యూటింగ్ లావాదేవీలను నిర్వహించుకోవచ్చు. టాబ్లెట్ డివైస్‌లలో.. న్యూస్ రీడింగ్, వీడియో వాచింగ్, ఆన్‌లైన్ గేమింగ్ వంటి అంశాలు మరింత ఆసక్తిని కలిగిస్తాయి. మల్టిపుల్ యూజర్ అకౌంట్‌లతో వచ్చే టాబ్లెట్‌లను అనేక మంది వేరువేరు అకౌంట్లతో ఉపయోగించుకోవచ్చు.

Read More : HTC కంటే మోటరోలానే బెస్ట్!

ప్రస్తుత ట్రెండ్‌ను మనం పరిశీలించినట్లయితే చాలా మంది యూజర్లు స్మార్ట్‌ఫోన్ కంటే పెద్దదిగా, టాబ్లెట్ కంటే చిన్నదిగా ఉండే స్ర్కీన్‌లను ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫాబ్లెట్ క్యాటగిరీ డివైస్‌లకు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. ఫాబ్లెట్ అంటే (స్మార్ట్‌ఫోన్ + ట్యాబ్లెట్) అని అర్థం. బహుళ ప్రయోజనాలను కలిగి ఉండే ఈ డివైస్‌లను యూజర్ మరింత కంఫర్ట్‌గా ఉపయోగించుకోగలుగుతారు. అత్యాధునిక స్పెసిఫికేషన్‌లతో హువావే హానర్ నుంచి రాబోతోన్న అప్‌కమింగ్ ఫాబ్లెట్ మార్కెట్లో మరో సంచలనం కావాలని కోరుకుందాం...

English summary
Honor Rumored to Debut in the tablet category in India. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot