జనవరి 8 నుంచి Honor V10 అమ్మకాలు

Posted By: BOMMU SIVANJANEYULU

హానర్ కొత్త స్మార్ట్‌ఫోన్ Honor V10 జనవరి 8 నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఆసక్తిగల యూజర్లు అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ ఫోన్‌ను రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ అఫీషియల్ ధర ఇంకా వెల్లడికాలేదు. యూరోపియన్ మార్కెట్లో మాత్రం హానర్ వీ10 ధర €499 (రూ.38,000)గా ఉంది.

జనవరి 8 నుంచి  Honor V10 అమ్మకాలు

భారత్‌తో సహా రష్యా, స్పెయిన్, ఇటలీ, యూకే, జర్మనీ, యూఎస్ ఇంకా ఫ్రాన్స్ దేశాల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. రూ.40000 ధర ట్యాగ్‌లో అందుబాటులో ఉండొచ్చని భావిస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 5టీ, నోకియా 8, షావోమి ఎంఐ మిక్స్ 2 వంటి స్మార్ట్‌ఫోన్‌కు ప్రధాన కాంపిటీటర్‌గా నిలిచే అవకాశముంది.

హానర్ వీ10 స్పెసిఫికేషన్స్..

5.99 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ ఫుల్‌వ్యూ డిస్‌ప్లే ((రిసల్యూషన్ కెపాసిటీ 2160 x 1080 పిక్సల్స్)) విత్ 18:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, హైసిలికాన్ కైరిన్ 970 సాక్, 6జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ + 20 మెగా పిక్సల్ డ్యుయల్ ఫేసింగ్ రేర్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3750mAh బ్యాటరీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఆధారంగా స్పందించే ఫేషియల్ రికగ్నిషన్ అన్‌లాక్ ఫీచర్, 4జీఎల్టీఈ సపోర్ట్.

ఫేస్‌బుక్‌ వాడాలన్నా ఆధార్ తప్పనిసరి!

హానర్ బ్రాండ్ నుంచి ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ హానర్ 7ఎక్స్ అత్యాధునిక ఫీచర్లతో, ఇదే బడ్జెట్‌లోని ఇతర స్మార్ట్‌ఫోన్‌లకు ప్రధాన పోటీదారుగా నిలిచింది. రూ.12999 ధర ట్యాగ్‌తో ఈ ఫోన్ ట్రేడ్ అవుతోంది.

హానర్ 7ఎక్స్ స్పెసిఫికేషన్స్.. 5.93 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ 18:9 డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ హువావే కస్టమ్ ఈఎమ్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్, కైరిన్ 659 ఆక్టా కోర్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3340 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

English summary
Honor V10 that was launched alongside the Honor 7X at an event in London earlier this month is expected to be launched in India on January 8, 2018. While there is enough time for the launch to happen, the registrations for the same are open on Amazon India for the interested buyers.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot