భార‌త్ నుంచి నిష్క్ర‌మిస్తున్న Honor కంపెనీ.. కార‌ణం తెలిస్తే షాకే!

|

చైనాకు చెందిన ప్ర‌ముఖ మొబైల్ ఉత్ప‌త్తుల బ్రాండ్ Honor సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. త్వ‌ర‌లో భార‌త మార్కెట్‌ నుంచి నిష్క్ర‌మించ‌డానికి Honor రంగం సిద్ధం చేసుకుంది. ఈ మేర‌కు స్వ‌యంగా ఆ కంపెనీ సీఈవో జార్జ్ జావో నే ఓ ఇంట‌ర్వ్యూలో నిర్దారించారు. హోమ్ మార్కెట్ చైనాలో Honor కంపెనీ త‌న వాటాను మంచిగా పెంచుకుంటున్నప్పటికీ, భార‌త్‌లో Xiaomi, Oppo, Vivo, Realme మరియు OnePlus వంటి ఇతర చైనీస్ బ్రాండ్‌ల నుండి చాలా పోటీని ఎదుర్కొంటోంది. కాబ‌ట్టి, భారతదేశంలో బ్రాండ్ అభివృద్ధి అంత బాగా లేదు. అందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

 
భార‌త్ నుంచి నిష్క్ర‌మిస్తున్న Honor కంపెనీ.. కార‌ణం తెలిస్తే షాకే!

వాస్త‌వానికి Honor కంపెనీ చాలాకాలం త‌ర్వాత ఇటీవ‌ల‌ స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు మరియు ఆండ్రాయిడ్-పవర్డ్ టాబ్లెట్ వంటి అనేక ఎంట్రీ లెవెల్‌ ఉత్పత్తులతో భారతీయ మార్కెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. హోమ్ మార్కెట్ చైనాలో Honor కంపెనీ త‌న మంచిగా వాటాను పెంచుకుంటున్నప్పటికీ, Xiaomi, Oppo, Vivo, Realme మరియు OnePlus వంటి ఇతర చైనీస్ బ్రాండ్‌ల నుండి చాలా పోటీని ఎదుర్కొంటున్నందున, భారతదేశంలో బ్రాండ్ అభివృద్ధి అంత బాగా లేదు. అందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ట్విట‌ర్‌లో కూడా హాన‌ర్ ఇండియా అధికారిక ఖాతా నుంచి గ‌త ఏడాది హోలీ రోజు (29 మార్చి, 2021)న‌ చివ‌రి పోస్ట్ చేసిన‌ట్లు మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు.

నిష్క్ర‌మ‌ణ అంశంపై Honor సంస్థ CEO జార్జ్ జావో స్పందిస్తూ, త‌మ‌ బ్రాండ్ ఇటీవల దేశంలో విక్రయించిన పరికరాలకు స‌పోర్ట్ త‌ప్ప‌నిస‌రిగా అందిస్తామ‌ని ఆయ‌న ధ్రువీక‌రించారు. కాబట్టి, ఎవ‌రైనా వినియోగ‌దారులు ఇటీవల కొత్త హానర్ ఉత్పత్తిని కొనుగోలు చేసినట్లయితే, దాని గురించి చింతించాల్సిన పని లేదని చెప్పారు. కానీ, ప్ర‌స్తుతం మీరు హానర్ ప్రొడ‌క్ట్‌ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, అలా చేయవద్దని మేము సిఫార్సు చేస్తున్నట్లు చెప్పారు. ఏదైనా కంపెనీ ఒక‌ దేశం నుండి నిష్క్రమించడానికి ప్లాన్ చేసినప్పుడు, అది మిగిలిన స్టాక్‌ను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తుంది.. కానీ, ఏదైనా చెడు జరిగితే, పార్ట్స్ లేదా కంపోనెంట్స్‌ను స‌ర‌ఫ‌రా చేయ‌డం చాలా కష్టమని ఆయ‌న చెప్పుకొచ్చిన‌ట్లు తెలుస్తోంది.

ఈ Honor కంపెనీ గ‌తంలో అందుబాటు ధ‌ర‌లు, ఎంట్రీ-లెవల్, మిడ్-రేంజ్ మరియు హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లకు ప్రసిద్ధి చెందింది. Huawei కంపెనీ నిషేధానికి గురైన‌ తర్వాత, Honor కూడా కొంత మేర ఆ ప‌రిణామాల ప్ర‌భావాన్ని ఎదుర్కొంది. అంతేకాకుండా, ఆ కంపెనీ భారతీయ మార్కెట్లో త‌మ‌ మార్కెట్ వాటాను క్ర‌మంగా కోల్పోవడం ప్రారంభించింది. నోకియా మరియు కొన్ని ఇతర బ్రాండ్‌ల మాదిరిగానే, Honor భారతీయ IP హక్కులను థ‌ర్డ్ పార్టీకి విక్రయించే అవకాశం ఉంటుంది.

Honor కంపెనీ నుంచి ఇటీవ‌ల విడుద‌లైన Honor X40i మోడ‌ల్ గురించి తెలుసుకుందాం:
Honor X40i పేరుతో స‌రికొత్త మోడ‌ల్‌ను హోం మార్కెట్ చైనాలో విడుద‌ల చేసింది. ఈ కంపెనీ నుంచి గ‌తేడాది విడుద‌లైన Honor X30i కి స‌క్సెస‌ర్‌గా ఈ మోడ‌ల్ తీర్చిదిద్దిన‌ట్లు తెలుస్తోంది.

భార‌త్ నుంచి నిష్క్ర‌మిస్తున్న Honor కంపెనీ.. కార‌ణం తెలిస్తే షాకే!

Honor X40i ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:
ఈ మొబైల్ కు 6.7 అంగుళాల full-HD + LCD డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఇది 19.9:9 aspect ratio ప‌ని చేస్తుంది. ఇది octa-core MediaTek Dimensity 700 ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. ఇది హోల్ పంచ్ డిస్‌ప్లే తో వ‌స్తోంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. ఇది ర్యామ్ కెపాసిటీ ఆధారంగా రెండు వేరియంట్ల‌లో ల‌భించ‌నుంది. 8GB ర్యామ్‌+ 128GB, 8GB ర్యామ్‌ + 256GB, 12GB ర్యామ్ + 256GB ఇంట‌ర్నల్ స్టోరేజీ ఆధారంగా రెండు వేరియంట్ల‌లో వ‌స్తోంది.

 

ఇక కెమెరాల విష‌యానికి వ‌స్తే మొబైల్ డ్యుయ‌ల్‌ కెమెరా సెట‌ప్ మ‌రియు ఎల్ఈడీ ఫ్లాష్‌ క‌లిగి ఉంది. ఈ ఫోన్‌కు 50 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్ర‌ధాన కెమెరా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం 8 మెగా పిక్సెల్ క్వాలిటీతో ఫ్రంట్ కెమెరా ఫీచ‌ర్‌ను క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4,500mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 40 వాట్ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది.

Honor X40i ధ‌ర‌:
చైనా మార్కెట్లో ఈ Honor X40i మోడ‌ల్ 8GB of RAM|128GB స్టోరేజీ వేరియంట్ ధ‌ర 1,599 యువాన్ల‌కు అందుబాటులో ఉంది. భార‌త క‌రెన్సీ ప్ర‌కారం సుమారు రూ.19వేల‌కు పైనే ఉండొచ్చ‌ని విశ్లేష‌కుల అంచ‌నా. 8GB of RAM|256GB స్టోరేజీ వేరియంట్ ధ‌ర రూ.21,300, ఇక 12GB of RAM|256GB స్టోరేజీ వేరియంట్ ధ‌ర రూ.23,700 కు అందుబాటులోకి రావొచ్చ‌ని స‌మాచారం. వివిధ క‌ల‌ర్ల‌లో ఇవి చైనా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రోజ్‌, సిల్వ‌ర్, గ్రీన్‌, బ్లాక్ క‌ల‌ర్ల‌లో ఇవి కొనుగోలు దారుల‌కు అందుబాటులో ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Honor Will Soon Exit Indian Market For An Interesting Reason

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X