Home
News

కొంపలు ముంచిన న్యూఇయర్ ట్వీట్, ఉద్యోగుల జీతాల్లో భారీ కోత

చైనాకు అమెరికా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక రెండు దేశాల మధ్య టెక్ వార్ కూడా ఈ మధ్య భారీ స్థాయిలోనే నడుస్తోంది.

చైనాకు అమెరికా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక రెండు దేశాల మధ్య టెక్ వార్ కూడా ఈ మధ్య భారీ స్థాయిలోనే నడుస్తోంది. ముఖ్యంగా మొబైల్ రంగంలో పోటీ చాలా తీవ్రంగా నడుస్తోంది. పోటీలు పడుతూ కొత్త కొత్త వర్షన్లతో అత్యాధునిక ఫీచర్లతో ఫోన్లన మార్కెట్ లోకి వదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏ చిన్న తప్పు జరిగినా కంపెనీ భారీగా రియాక్ట్ అవుతోంది. ఈ వార్ ఎలా ఉంది. ఉద్యోగులు చేసిన తప్పుకు కంపెనీ ఎటువంటి చర్యలు తీసుకుందనే విషయంలోకి వెళితే కంపెనీల మధ్య పోటీ ఎంతలా ఉందనేది తెలుస్తుంది. విషయంలోకి వెళదాం.

హువాయి వర్సెస్ ఆపిల్

హువాయి వర్సెస్ ఆపిల్

చైనాకు చెందిన పి-సీరిస్‌ హువాయి సంస్థకు, ఆపిల్ ఐఫోన్ కు మధ్య గట్టిపోటీయే నడుస్తోంది. అయితే ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా హువాయి సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగులు.. సంస్థ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి వినియోగదారులకు న్యూ ఇయర్ 2019 అని ట్వీట్ చేశారు.

ఐ ఫోన్ ద్వారా చేయడంతో

ఐ ఫోన్ ద్వారా చేయడంతో

ఆ ట్వీటే ఇప్పుడు వాళ్ల కొంప ముంచింది. ఆ ట్వీట్‌ను వాళ్లు ఐ ఫోన్ ద్వారా చేయడంతో ఆ ఫోన్ వివరాలు ట్విట్టర్లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో హువాయి అధికారిక ట్విట్టర్ ఐఫోన్ ఉపయోగించి న్యూ ఇయర్ విషెస్ ట్వీట్ చేసిందంటూ కామెంట్స్ ట్రోల్ అయ్యాయి.

సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో వైరల్

ఆ తప్పిదాన్ని గుర్తించి ఆ ట్వీట్‌ను తొలగించే లోపే చాలామంది స్క్రీన్ షాట్ తీసుకొని.. ఆ ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో హువాయి యాజమాన్యం ఆ ఇద్దరు ఉద్యోగులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇద్దరి జీతాలను

ఇద్దరి జీతాలను

వారిని డిమోషన్ చేయడంతోపాటు ఇద్దరి జీతాలను ఘనంగా తగ్గించేసింది. వారి నెల జీతంలో రూ.50,693 కోత విధించడమే కాకుండా, 12 నెలల పాటు వాటిని చెల్లించకుండా ఫ్రీజ్ చేశారు.డఈ సందర్భంగా హువాయి సంస్థ విడుదల చేసిన మెమోలో ఇద్దరు ఉద్యోగులు చేసిన తప్పిదం వల్ల హువాయి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని పేర్కొంది.

డెస్క్‌టాప్ కంప్యూటర్ వీపీఎన్ సమస్య

డెస్క్‌టాప్ కంప్యూటర్ వీపీఎన్ సమస్య

డెస్క్‌టాప్ కంప్యూటర్ వీపీఎన్ సమస్య వల్ల పనిచేయలేదనే కారణంతో సోషల్ మీడియా హ్యాండిల్ చేసే బాధ్యతలో ఉన్న సిబ్బంది తమ వద్ద ఉన్న ఆపిల్ ఐఫోన్ ఉపయోగించి కొత్త సంవత్సరం విషెస్ ట్వీట్ చేశారు. దీంతో ఆ ట్వీట్ ఐఫోన్ ద్వారా పోస్ట్ చేయబడిదని ట్విట్టర్ మెసేజ్ వచ్చిందని హువాయి అధికారులు తెలిపారు.

విదేశీ సోషల్ మీడియా నెట్‌వర్క్‌లను

విదేశీ సోషల్ మీడియా నెట్‌వర్క్‌లను

కాగా ట్విట్టర్, ఫేస్‌బుక్, అల్ఫాబెట్ వంటి విదేశీ సోషల్ మీడియా నెట్‌వర్క్‌లను చైనా నిషేదించింది. వాటిని ఉపయోగించాలంటే వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (వీపీఎన్) కనెక్షన్ ఉండాలి. దీంతో, సిబ్బంది ఐఫోన్ ద్వారా సులభంగా ట్వీట్ చేయొచ్చనే ఆలోచనతో ఈ చర్యకు పాల్పడ్డారని తెలుస్తోంది.

 

Best Mobiles in India

English summary
How a Huawei employee had to pay and got punished because of an iPhone more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X