ప్రత్యర్థులకు దీటుగా కొత్త ప్లాన్ ను లాంచ్ చేసిన ఎయిర్‌టెల్
టెలికాం రంగంలో రిలయన్స్ జియోతో నువ్వా నేనా అంటూ దూసుకుపోతున్న ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్ తో ముందుకువచ్చింది.
టెలికాం రంగంలో రిలయన్స్ జియోతో నువ్వా నేనా అంటూ దూసుకుపోతున్న ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్ తో ముందుకువచ్చింది. బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్లను ఆఫర్ చేయడంలో ఎల్లప్పుడూ ముందు ఉండే భారతీ ఎయిర్‌టెల్ ఇప్పుడు 398 రూపాయలకు సరికొత్త ప్లాన్ ఆఫర్ చేస్తోంది.దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సర్కిళ్లకు ఈ ఆఫర్ ప్రయోజనాలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ప్లాన్‌పై ఎలాంటి ప్రయోజనాలను ఎయిర్‌టెల్ అందిస్తుందంటే...

రూ.398ప్లాన్
రూ.398తో రీఛార్జ్ చేసుకున్న వారికి దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 1.5 జీబీ డేటాను, 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ 70 రోజులు.

ఎయిర్‌టెల్ రూ.399 ప్లాన్ vs ఎయిర్‌టెల్ రూ.398 ప్లాన్
ఎయిర్‌టెల్ గతంలో రూ.399 ప్లాన్ ను లాం చేసింది.ఈ ప్లాన్ ను రీఛార్జి చేసుకున్న యూజర్ కి వ్యాలిడిటీ 84 రోజులు ఉన్న డేటా మాత్రం రోజుకి 1జీబీ లభిస్తుంది.అదే ఎయిర్‌టెల్ రూ.398 ప్లాన్ లో రోజుకి 1.5 జీబీ డేటా లభిస్తుంది

ఎయిర్‌టెల్ రూ.398 ప్లాన్ vs జియో రూ.398 ప్లాన్
ఎయిర్‌టెల్ రూ.398 ప్లాన్ మధారిగానే జియోలో కూడా రూ.398 ప్లాన్ ఉంది. జియో రూ.398తో రీఛార్జ్ చేసుకున్న వారికి దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 2 జీబీ డేటాను, 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ 70 రోజులు.దీంతో పాటు జియో సూట్ యాప్స్ ను ఫ్రీగా యాక్సిస్ చేసుకోవచ్చు.

ఎయిర్‌టెల్ రీసెంట్ గా రూ.1699 ప్లాన్ ను లాంచ్ చేసింది
365 రోజుల వ్యాలిడిటీతో ఎయిర్‌టెల్ అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రీపెయిడ్ ప్లాన్ రూ.1,699 ధర ట్యాగ్‌తో లభ్యమవుతోంది. 365 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్‌లో భాగంగా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు రోజు 100 ఎస్సెమ్మెస్‌లు, 1జీబీ డేటాను వినియోగించుకోవచ్చు.


Click it and Unblock the Notifications








