Home
News

హత్య కేసులో సాక్ష్యానికి కీలకంగా మారిన అమెజాన్ అలెక్సా

By Gizbot Bureau

ఎక్కడైనా ఏదైనా హత్య జరిగితే దానికి మనుషులో, ఫోటోలో లేకపోతే వీడియోలో సాక్ష్యాలుగా నిలుస్తాయి.. కానీ, ఇక్కడ మాత్రం ఊహించని విధంగా అమెజాన్ అలెక్సా కీలకంగా మారింది. ఇది నిజంగా నమ్మలేని నిజం.. వివరాల్లోకెళితే ఫ్లోరిడాలో ఆడమ్ క్రెస్పో, సిల్వియా గాల్వా క్రెస్పో అనే దంపతులు నివసిస్తున్నారు. భార్యభర్తలిద్దరూ జూలై నెలలో ఒకరోజు రాత్రి ఏదో ఒక విషయమై వాదించుకొని గొడవపడ్డారు. ఆ గొడవలో ఆడమ్ తన భార్యను షాకు లాంటి ఆయుధంతో పొడిచాడు. దాంతో అతని భార్య సిల్వియా తీవ్ర రక్తస్రావం జరిగి మరణించింది. దాంతో ఆడమ్‌పై సెకండ్ డిగ్రీ కేసు నమోదైంది, కానీ ఆడమ్ మాత్రం తన భార్యను హత్య చేసినట్లుగా ఒప్పుకోవడంలేదు, ఎందుకంటే ఆ హత్యను చూసినవాళ్లేవరూ లేరు.ఈ కేసులో నిజానిజాలను నిర్ధారించాలంటే టెక్నాలజీ సాయం తీసుకోక తప్పదని కోర్టు గ్రహించింది. అందుకే సిల్వియా ఇంట్లోని అమెజాన్ ఎకో స్పీకర్ (అలెక్సా) రికార్డింగులు వినాలని నిర్ణయించింది.

అలెక్సా స్పీకర్ రికార్డు

అలెక్సా స్పీకర్ రికార్డు

దీనికి ప్రధాన కారణం సిల్వియా మృతిచెందిన రోజు శబ్దాలను, మాటలను ఆ ఇంట్లోని అలెక్సా స్పీకర్ రికార్డు చేసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్యకు సంబంధించిన ఏదైనా సమాచారం ఆ బ్లూటూత్ డివైజ్‌లో లభిస్తుందేమోనని ఆలోచన వచ్చింది. మంచం కోడు విరగ్గొట్టి పదునుగా ఉన్న దాని మొనతో భార్య గుండెల్లో పొడిచి, రిచర్డే భార్యను చంపేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

కొన్ని మాటలు రికార్డ్ 

కొన్ని మాటలు రికార్డ్ 

పోలీసులకు ఆలోచన రావడానికి కారణం ఏంటంటే.. అమెజాన్ అలెక్సా డివైజ్‌లు ‘వేక్' అనే ఊతపదంతో కూడా యాక్టివేట్ అవుతాయి. అందువల్ల హత్య జరిగిన సమయంలో ఈ డివైజ్ అక్కడే ఉండటంతో, హత్యకు సంబంధించి ఏదో ఒక క్లూ అందులో రికార్డు అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అందుకే అనుకున్నదే తడవుగా పోలీసులు ఆ డివైజ్‌ను పరిశీలించగా అందులో కొన్ని మాటలు రికార్డ్ అయినట్లుగా గుర్తించారు. దాంతో ఆ డివైజ్‌లోని మాటలను విశ్లేషించడానికి ఆ డివైజ్‌ని పరిశీలనకు పంపించారు.

గొడవ పడుతుండగా

గొడవ పడుతుండగా

అయితే ఈ హత్యకు సంబంధించి ఆడమ్ మాత్రం ఈ విధంగా చెబుతున్నాడు. సిల్వియాను తాను చంపలేదని, గొడవ పడుతుండగా ఆమెను మంచం మీద నుంచి కిందకు లాగబోయానని రిచర్డ్ చెప్పాడు. ఆ సమయంలో మంచం కోడును సిల్వియా గట్టిగా పట్టుకోవడంతో అది విరిగి ఓ ముక్క ఆమె చేతిలోకి వచ్చిందన్నాడు. దాంతో మంచం మీద నుంచి ఆమె కింద పడిందని, అప్పుడు పొరబాటున ఆ కర్రముక్క సిల్వియా గుండెల్లో దిగి ఆమె చనిపోయిందని రిచర్డ్ తెలిపాడు.

బయటకి తీయడానికి

బయటకి తీయడానికి

అప్పుడు తాను ఆ బ్లేడ్‌ను బయటకి తీయడానికి ప్రయత్నించానని చెప్పాడు. అయితే ఆ గాయంతో సిల్వియా తీవ్రంగా గాయపడుతుందని తాను అనుకోలేదని ఆడమ్ చెప్పాడు. వెంటనే అదే అపార్ట్‌మెంటులో ఉండే సిల్వియా స్నేహితురాలిని రిచర్డ్ సంప్రదించాడని, తను ఎంతగానో ప్రేమించే భార్యను కాపాడుకోవడానికి తాపత్రయ పడ్డాడని రిచర్డ్ తరఫు న్యాయవాది వాదించారు. కాగా పోలీసులు మాత్రం ఆ గాయం కారణంగానే సిల్వియాకు తీవ్ర రక్తస్రావం జరిగినట్లు గుర్తించారు. అయితే సిల్వియా ఛాతీ నుంచి ఆ ఈటేను ఆడమ్ బయటకు తీశాడా లేక ఆమె స్నేహితురాలు తీసిందా అనేది మాత్రం పోలీసులు గుర్తించలేకపోయారు.

65,000 డాలర్ల పూచికత్తుతో 

65,000 డాలర్ల పూచికత్తుతో 

ఏది ఏమైనా హత్యానేరం కింద అరెస్టయిన ఆడమ్ మాత్రం తాను ఈ హత్య చేయలేదని వాదిస్తున్నాడు. కాగా, కోర్టు ఆడమ్‌ని 65,000 డాలర్ల పూచికత్తుతో విడుదలచేసింది. అయితే ఆడమ్ ఈ హత్య చేశాడా లేదా అనే విషయం తేలాలంటే మాత్రం అలెక్సా డివైజ్‌లో రికార్డయిన మాటలే ఈ హత్యకు కీలకంగా మారనున్నాయి.

Best Mobiles in India

English summary
How Amazon Alexa may become witness in a murder case
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X