అనుకోని అభిమానం..భారతీయుడికి తలనొప్పి!

Posted By:

అనుకోని అభిమానం..భారతీయుడికి తలనొప్పి!

అనుకోని అభిమానం ఆయనను అతలాకుతలం చేసేసింది. ఉవ్వెత్తున తాకిన అభిమానులు తాకిడి ఆ సీనియర్ ఐటీ కన్సల్టెంట్‌కు తలనొప్పిని తెచ్చిబెట్టింది. వివరాల్లోకి వెళితే.. ఇండియాకు చెందిన ఐటీ కన్సల్టెంట్ రవి విశ్వేశ్వరయ్యా శ్రద్ధా ప్రసాద్‌కు తన ట్విట్టర్ అకౌంట్‌లో వింత అనుభవం ఎదురైంది. డచ్ నేషనల్ ఫుట్‌బాల్ జట్టులోని ప్రముఖ సాకర్ ఆటగాడు రాబిన్ వాన్ పెర్సీ (Robin van Persie) గత సోమవారం జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్ సాధించిన విషయం తెలసిందే. అభిమానులు రాబిన్ వాన్ పెర్సీని ముద్దుగా ఆర్‌విపి (RVP)గా పిలుస్తారు. ఇంతకీ ఈ ఫుట్‌బాల్ ఆటగాడికి మన ఐటీ కన్సల్టెంట్‌కు లింకేంటి అనుకుంటున్నారా..?, అక్కడికే వస్తున్నాం...

రాబిన్ వాన్‌పెర్సీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ చిరునామా @Persie_Official ఈ విషయం తన అభిమానుల్లో చాలా మందికి తెలియదు. రాబిన్ వాన్ పెర్సీ హ్యాట్రిక్ గోల్స్ సాధించి చారిత్రాత్మక విజయనాకి కారణమైన నేపధ్యంలో ఉత్కంఠకు లోనైన అభిమానులు తమ అభిమాన ఆటగాడిని ఆకాశానికి ఎత్తుతూ @rvp అనే ట్విట్టర్ అకౌంట్‌కు వేల సంఖ్యలో ట్వీట్‌లను పోస్ట్ చేయటం ప్రారంభించారు. వాస్తవానికి ‌@rvp పేరుతో ట్విట్టర్ అకౌంట్‌ను ఇండియాకు చెందిన సీనియర్ ఐటీ కన్సల్టెంట్ అయిన రవి విశ్వేశ్వరయ్యా శ్రద్ధా ప్రసాద్ నిర్వహిస్తున్నారు. మన ప్రసాద్ గారి @rvp ట్విట్టర్ అకౌంట్‌ను రాబిన్ వాన్ పెర్సీ అధికారిక అకౌంట్‌గా భ్రమపడిన అభిమానులు ట్వీట్‌లు పంపటం ప్రారంభించారు. ఒక్క రోజులో రవి విశ్వేశ్వరయ్యా శ్రద్ధా ప్రసాద్ @rvp ట్విట్టర్ అకౌంట్‌కు 10,000లకు పైగా ట్వీట్‌లు వచ్చినట్లు బీబీసీ వెల్లడించింది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting