'ఎక్కడున్నానో.. తన చుట్టు ఎంత జరుగుతుందో తెలియదు..' కానీ ఆపిల్ వాచ్ ఎలా కాపాడిందో తెలుసా?
గతంతో పోలిస్తే టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. ముఖ్యంగా సేవల రంగంలో ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఈ టెక్నాలజీని అనేక ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ తయారీ సంస్థకు తమ ఉత్పత్తు్ల్లో ఉపయోగించుకుంటున్నాయి. అయితే టెక్ దిగ్గజం ఆపిల్ (Apple).. ఇందులో తొలి వరుసలో ఉంది. తన ఉత్పత్తుల్లో టెక్నాలజీకి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. కొన్నిసార్లు ఈ టెక్నాలజీ ప్రాణాలను సైతం కాపాడుతోంది. ఈ తరహా సంఘటనలను ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
ఆపిల్ స్మార్ట్‌వాచ్‌లు (Apple Smart Watch Features) అనేక ఫీచర్‌లను కలిగి ఉంటున్నాయి. ముఖ్యంగా హెల్త్ ట్రాకర్లు, ఫాల్ డిటెక్షన్, క్రాష్ డిటెక్షన్, ఎమర్జెన్సీ SOS వంటి ఫీచర్‌లు యూజర్లకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఆపద సమయంలో సాయం అందేలా చేస్తున్నాయి. ఆరోగ్య సమస్యలు, ప్రమాదాలు వంటి సమయాల్లో ప్రాణాలను కాపాడుకొనేందుకు సాయం చేస్తున్నాయి.

తాజాగా ఇటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. వెస్ట్రన్ న్యూస్ రిపోర్ట్ కథనం ప్రకారం.. మసాచుసెట్స్‌లోని ఈస్ట్‌హాంప్టన్‌కు చెందిన బ్రెంట్ హిల్ గత సంవత్సరం డిసెంబర్ 16 వ తేదీన కారులో తన ఇంటికి వెళ్తున్నారు. అయితే సడన్‌గా అనారోగ్యానికి గురయ్యారు. క్రమంగా స్పృహ కోల్పోయారు.
అయితే అంతలో కారు వేగం పెరిగింది. అలా అతని ఇంటికి సమీపంలోని ఓ స్విమ్మింగ్ పూల్‌లోకి దూసుకెళ్లింది. స్పృహ కోల్పోయిన సమయంలో యాక్సిలరేటర్ పెడల్‌పై కాలు నిలిచిపోయిన కారణంగా వేగం పెరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. పూల్‌లో పడిపోయాక బ్రెంట్ హిల్ క్రమంగా స్పృహలోకి వచ్చారు.
అయితే బ్రెంట్ హిల్ ధరించిన ఆపిల్ వాచ్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ యాక్టివేట్ అయింది. వెంటనే ఎమర్జీన్సీ బృందాలకు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు ఆపిల్ వాచ్ సాయంలో బ్రెంట్ హిల్‌తో మాట్లాడారు. పరిస్థితిపై ఆరా తీశారు. ఘటనా స్థలానికి వచ్చి బాధితుడిని రక్షించారు.
చిన్న చిన్న గాయాలతో బయటపడిన బ్రెంట్ హిల్ ఘటనకు సంబంధించిన పరిస్థితులను వివరించారు. తాను ఎక్కడున్నానో.. తన చుట్టు ఏం జరుగుతుందో.. తనకు ఏం జరిగిందో గ్రహించే పరిస్థితుల్లో లేనని నాటి ఘటనలను గుర్తుచేసుకున్నారు. భారీ శబ్ధం వచ్చినట్లు అనిపించిందని కానీ పూర్తిగా ఏం జరిగిందో తెలియలేదని చెప్పారు.
ఆపిల్ వాచ్ ఫీచర్‌లు తన ప్రాణాలను కాపాడాయని తెలిపారు. క్రాష్ డిటెక్షన్ ఫీచర్‌కు ధన్యవాదాలు తెలిపారు. స్మార్ట్ ఉత్పత్తులు ఇలాంటి ఘటనల సమయంలో ఎంత సాయం చేస్తాయో ఈ సందర్భంగా బ్రెంట్ హిల్ తెలిపారు. గతంలోనూ అనేక ఘటనల్లో ఆపిల్ వాచ్ స్మార్ట్ ఫీచర్‌లు సరైన సమయానికి ఎమర్జెన్సీ బృందాలకు సమాచారం అందించి ప్రాణాలను కాపాడాయి.
గత సంవత్సరం జులై నెలలో సముద్రంలో చిక్కుకున్న ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి ఆపిల్ సాయంలో బయపడ్డారు. ఆస్ట్రేలియాలోని బైరాన్ బే తీరంలో రిక్ షీర్‌మాన్ బాడీ సర్ఫింగ్ చేస్తున్నారు. తొలుత సంతోషంగా గడిపిన షీర్‌మాన్.. తీరానికి వస్తున్న పెద్ద అలలతో ఎక్కువ సార్లు మునిగి తేలుతున్నారు. దీంతో ఒడ్డుకు చేరుకొనేందుకు షీర్‌మాన్‌కు దారి కనిపించడం లేదు.
సుమారు 20 నిమిషాలపాటు వేచి చూసిన బాధితుడు.. పరిస్థితి అదుపు తప్పుతుందని గ్రహించారు. ఆపిల్ వాచ్ అల్ట్రా సాయంతో ఎమర్జెన్సీ బృందాలకు సమాచారం అందించారు. వారికి తమ పరిస్థితిని వివరించి, సాయం కోరారు. ఎమర్జెన్సీ బృందాలు వచ్చేంత వరకు అంటే సుమారు గంట వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అలల మధ్య భయానక స్థితిని అనుభవించినట్లు చెప్పారు. చివరికి వారి సాయంతో ఒడ్డుకు చేరారు.


Click it and Unblock the Notifications







