మోసపూరిత ఈ-మెయిల్ స్కాముల నుండి రక్షించుకొవడం ఎలా..?

Posted By: Super

మోసపూరిత ఈ-మెయిల్ స్కాముల నుండి రక్షించుకొవడం ఎలా..?

ప్రతీ ఒక్కరి మెయిల్ ఐడికీ మోసపూరితమైన, స్పామ్ మెయిల్ మెసేజ్ లు భారీ సంఖ్యలో వచ్చి చేరుతుంటాయి. కొత్తగా కంప్యూటర్ ని నేర్చుకుంటూ టెక్నాలజీపై పెద్దగా అవగాహన లేని వారు ఇలాంటి మెయిల్స్ ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. మీరు ఇ-మెయిల్స్ ని వాడేటప్పుడు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మెయిల్ మోసాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.

1. అటాచ్ మెంట్లని గుడ్డిగా డౌన్ లోడ్ చేసుకోకండి:

ఒక్కోసారి మనకు తెలిసిన ID నుండే వచ్చినట్లు క్లియర్ గా కన్పిస్తూ.. మన ఫ్రెండే మనకు ఆ మెయిల్ పంపాడనుకుని అక్కడ ఉండే zip, rar అనే మాదిరి అటాచ్ మెంట్లని క్లిక్ చేసి డౌన్ లోడ్ చేస్తాం. అందులో వైరస్/ట్రోజాన్/రూట్ కిట్ ల వంటి ప్రమాదరకమైన అంశాలు దాగి ఉంటాయి. వాస్తవానికి మన ఫ్రెండ్ స్వయంగా పంపే మెసేజ్ కాదది. అతను ఏదో చెత్త వెబ్ సైట్లని బ్రౌజ్ చేస్తూ ఎక్కడబడితే అక్కడ అతని మెయిల్ ఐడిని గుడ్డిగా ఇచ్చేస్తూ వెళ్లినప్పుడు… స్పామర్లు అతని మెయిల్ ఐడిని తమ డేటాబేస్ లో సేవ్ చేసుకుని అతని తరఫు నుండి మెసేజ్ వచ్చినట్లు మనల్ని భ్రమింపజేసేలా .php మెయిల్ స్క్రిప్ట్ లతో ఇలాంటి స్కాములకు పాల్పడుంటారు. కాబట్టి ఇలాంటి అటాచ్ మెంట్లని ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్ లోడ్ చేసుకోకండి.

2. “లాటరీ గెలుచుకున్నారూ” అంటూ వచ్చే మెసేజ్ లు నమ్మకండి:

మీ మెయిల్ ఐడి భారీ మొత్తంలో లాటరీ గెలుచుకుంది అంటూ మీకు mails వస్తున్నాయా? అలాంటి మెసేజ్ లకు ఆకర్షితులు అవకండి. నైజీరియన్ స్కాముల క్రింద పరిగణించబడే ఇలాంటి మెయిల్స్ కి స్పందించి డబ్బులు నష్టపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. అలా మీరూ మాయలో పడి నష్టపోకుండా జాగ్రత్త వహించండి. ఈ క్రింది చిత్రంలోని విధంగా వచ్చే మెయిల్స్ ని అసలు నమ్మకండి. ఇప్పటికే మీరు ఇలాంటి స్కాముల వల్ల డబ్బు నష్టపోయి ఉన్నట్లయితే.. 1800 209 6789 అనే ఇండియన్ సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ ని సంప్రదించవచ్చు. అలాగే http://www.consumerfraudreporting.org/ అనే వెబ్ సైట్ కి ఇలాంటి స్కామ్ మెయిల్స్ ని రిపోర్ట్ చేయండి. దీనివల్ల మున్ముందు వీటి తాకిడి తగ్గుతుంది.

3. లింకులను క్లిక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త:

మనకు తెలిసిన వారి నుండీ, తెలియని వారి నుండీ ఏదైనా లింక్ వచ్చినప్పుడు దాన్ని పరిశీలనగా చూడండి. “ఫలానా వెబ్ సైట్ లింక్ పంపిస్తున్నాం” అని మిత్రులు ఫోన్ ద్వారా గానీ, ఇతర మార్గాల ద్వారా గానీ ముందే మనకు తెలియజేసి ఉంటే ఫర్వాలేదు. కనీసం మనల్ని అడ్రస్ చేస్తూ “ఈ లింకులో ఫలానా సమాచారం లభిస్తుంది. ఈ కారణం చేత మీతో దీన్ని పంచుకుంటున్నాను..” అంటూ వివరంగా మిమ్మలను పర్సనల్ గా ఉద్దేశించి మీ మెయిల్ ఐడితో అడ్రస్ చేయడం కాకుండా మీ అసలు పేరుతో పలకరిస్తూ మెయిల్స్ వస్తేనే నమ్మకంగా లింకులు ఓపెన్ చేయండి.

అలా కాకుండా ఏ లింక్ ని బడితే దాన్ని ఓపెన్ చేస్తే ఇబ్బందిపడవలసి వస్తుంది. ఇటీవలి కాలంలో script kiddies పేరుతో రెడీమేడ్ హ్యాకింగ్ టూల్స్ తో కీలాగర్ ఇంజిన్ లు తయారు చేసి వాటిని ఫొటోలు వంటి వాటికి బైండ్ చేసి hotfile, rapidshare వంటి ఫైల్ షేరింగ్ సైట్లలో హోస్ట్ చేసి ఆ లింకులను మనకు పంపిస్తున్న వారు చాలామంది ఉన్నారు. మనం ఆ లింకుల నుండి ఫైళ్లని డౌన్ లోడ్ చేసుకుని రన్ చేశామంటే.. మన దగ్గర శక్తివంతమైన ఇంటర్నెట్ సెక్యూరిటీ సూట్ అంటూ ఏదీ లేకపోతే.. ఆ కీలాగర్ ఇంజిన్ మన పిసిలోకి చేరిపోయి ఇకపై ఎప్పటికప్పుడు మన యూజర్ నేమ్ లు, పాస్ వర్డ్ లు, మనం పిసిపై టైప్ చేసే సకల సమాచారం హ్యాకర్ కి చేరవేస్తుంటుంది.

అలాగే కొంతమంది php, html ఫైళ్లలో ప్రమాదకర scriptsని పొందుపరిచి, లింక్ ని క్లిక్ చేయడం ద్వారా వెబ్ పేజీని మనం ఓపెన్ చేయగానే మనకు తెలియకుండానే మన పిసిలోకి రూట్ కిట్ లు ప్రవేశించే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot