సామ్‌సంగ్‌, నోకియాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయ్..?

|

యాపిల్ నుంచి అమెజాన్ వరకు మైక్రోసాఫ్ట్ నుంచి ట్విట్టర్ వరకు టెక్నాలజీ ప్రపంచంలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపునే సొంతం చేసుకున్న కంపెనీలే.

సామ్‌సంగ్‌కు ఆ పేరు ఎలా వచ్చింది...?

సామ్‌సంగ్‌కు ఆ పేరు ఏలా వచ్చింది...?, నోకియా పేరును ఆ నది నుంచి తీసుకున్నానరా..? యాపిల్ పేరును ఎవరు సూచించారు..? ట్విట్టర్ అనే పదం ఎక్కడ దొరికింది..?, స్కైప్ అసలు పేరేంటి..?, ఈబే డాట్ కామ్‌ను తొలినాళల్లో ఏలా పిలిచేవారు..? ఇలా అనేక రకాల సందేహాలు పలువురిలో మెదులుతుంటాయి. ప్రముఖ బ్రాండ్‌లు, వాటి పేర్ల వెనుక రహస్యాలను ఇప్పుడు తెలుసుకునేు ప్రయత్నం చేద్దాం....

Read More : 3జీబి ర్యామ్‌తో Redmi 3s Prime, రూ.6,999కే

బ్లాక్‌బెర్రీ

బ్లాక్‌బెర్రీ

2001లో రిసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) తమ కొత్త ఈమెయిల్ మెసేజింగ్ డివైస్‌కు పేరును సూచించవల్సినదిగా ఓ కన్సల్టింగ్ కంపెనీని కోరింది. సదరు బ్రాండింగ్ ఏజెన్సీ సూచించిన పేరే బ్లాక్‌బెర్రీ. దీంతో, 2013లో రిమ్ తన కార్పొరేట్ బ్రాండ్ పేరును బ్లాక్‌బెర్రీగా మార్చేసుకుంది.

యాపిల్

యాపిల్

ఐఫోన్‌ల తయారీ కంపెనీ యాపిల్ మనందరికి సుపరిచితమే. యాపిల్ అనే పేరును కంపెనీ సహ వ్యవస్థాపకులైనే స్టీవ్ జాబ్స్ సూచించినట్లు యాపిల్ కంపెనీ మరో సహ వ్యవస్థాపకులు ఒకరైన స్టీవ్ వోజ్నైక్ ఓ సందర్భంలో వెల్లడించారు. స్టీవ్ జాబ్స్‌కు చిన్నతనం నుంచి యాపిల్ పండ్ల అంటే చాలా ఇష్టం. చివరకు ఆయన తన సంస్థకు కూడా ‘యాపిల్' అనే నామకరణం చేసేశాడు.

నోకియా

నోకియా

తొలినాళ్లలో నోకియాకు సంబంధించిన ఓ కంపెనీ నోకియన్‌విర్టా అనే నది ఒడ్డున ఉండేదట. ఆ నది ఆధారంగానే ‘నోకియా' అనే పేరు తమ పరిశీలనలోకి వచ్చిందట.

సామ్‌సంగ్

సామ్‌సంగ్

కొరియన్ భాషలో సామ్ అంటే ‘త్రీ', సంగ్ అంటే ‘స్టార్స్' అని అర్ధం. ఎండుచేపల ఎగుమతితో ప్రారంభమైన సామ్‌సంగ్ వ్యాపార చరిత్ర ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నేడు టెక్నాలజీ విభాగంలో ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. తమ వ్యాపారాన్ని వివిధ రంగాలకు విస్తరింప చేసిన సామ్‌సంగ్ అనేక దేశాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని వేలాది ఉద్యోగులకు జీవనోపాధి కల్పిస్తోంది.

మైక్రోసాప్ట్

మైక్రోసాప్ట్

ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ పేరును మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన పాల్ అలెన్ సూచించారు. మైక్రోప్రాసెసర్, సాఫ్ట్‌వేర్ అనే రెండు పదాల సంశ్లేషణ ఆధారంగా మైక్రోసాఫ్ట్ రూపాంతరం చెందింది. వాస్తవానికి మైక్రోసాఫ్ట్ పేరు మొదట్లో మైక్రో-సాఫ్ట్‌గా ఉండేది. కాల క్రమంలో పదాల మధ్య హైఫన్ తొలగించారు.

ప్రపంచ ప్రఖ్యాత సెర్చ్ ఇంజిన్‌లలో ఒకటైన గూగుల్ కోట్ల కొలది వెబ్ పేజీలను తమ వినియోగదారులకు అందబాటులో ఉంచి.అంశం ఏదైనా సరే, గూగుల్ నుంచి చిటికెలో సమాధానాన్ని రాబట్టవచ్చు. గూగుల్ అనే పేరు గూగోల్ అనే పదం నుంచి వచ్చింది. ఒకటి పక్కన వంద సున్నాల గల సంఖ్యే ఈ ‘గూగోల్'. గూగుల్ సామర్థ్యాన్ని చాటి చెప్పేలా ఈ పేరును ఏర్పాటు చేసి ఉంటారన్నది నిపుణులు విశ్లేషణ.

 

ఫేస్‌బుక్‌

ఫేస్‌బుక్‌

ఈ సామాజిక సంబంధల వారధికి గొప్ప చరిత్రే ఉంది. తొలత ఈ సామాజిక సైట్ ‘ఫేస్‌మాష్ డాట్‌కామ్'గా ప్రారంభమైంది. దీని రూపకర్త మార్క్ జూకర్స్ బర్గ్, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని తన మిత్రులతో కలిసి ఫేస్‌మాష్ కార్యకలాపాలను ప్రారంభించాడు. సదరు విశ్వవిద్యాలయంలోని అమ్మాయిలు, అబ్బాయిల ఫోటోలను వారికి తెలియకుండా వారి వారి ప్రొఫైల్స్ నుంచి సేకరించి తన లోకల్ నెట్‌వర్క్‌లో పొందుపరిచాడు. ఈ చర్య మార్క్‌ను నేరారోపణలు ఎదుర్కొనేలా చేసింది. ఈ వివాదం ముగిసిన అనంతరం 2004, ఫిబ్రవరి 4వ తేదిన ఫేస్‌మాష్ డాట్‌కామ్ ‘ద ఫేస్‌బుక్ డాట్ కామ్'గా రూపాంతరం చెందింది.

అమెజాన్‌

అమెజాన్‌

అతిపెద్ద నదుల్లో ఒకటైన అమెజాన్‌ను ఆధారంగా చేసుకుని తమ రిటైల్ సంస్థకు ఆమోజాన్‌గా పేరును ఖారరు చేసుకున్నారు. పేరుకు తగ్గట్టుగానే ఆమోజాన్ ఆన్‌‌లైన్ రిటైలింగ్ వ్యాపారం ప్రపంచ దేశాలకు విస్తరించింది.

వికీపిడియా

వికీపిడియా

హవాయి భాషలో వికీ అనే పదానికి ‘క్విక్' అని అర్ధం.స్వేచ్చా విజ్ఞాన సర్వస్వంగా పేరొందిన వికీపీడియాను 2001వ సంవత్సరం జనవరి 15వ తేదీన జిమ్మీ వేల్స్. లానీ సాంగర్ అనే ఇద్దురు సాంకేతిక నిపుణులు ప్రారంభించటం జరిగింది. కొద్దికాలంలోనే అనేక భాషల్లోకి వికీపీడియా విస్తరించింది. తెలుగు వికీపీడియాను 2003లో ప్రారంభించారు. అయితే, ఆరంభ సమయంలో రెండు సంవత్సరాల పాటు పలు సమస్యలను ఎదుర్కొన్న వికీపీడియా కొంతమంది బ్లాగర్ల కృషితో 2005వ సంవత్సరంలో ప్రత్యేకమైన హోదాను సొంతం చేసుకుంది. డిసెంబర్ 7, 2013 వరకు సేకరించిన గణాంకాల మేరకు తెలుగు వికీలో 53,932 వ్యాసాలు ఉన్నాయి.

 

 

ఈబే

ఈబే

ఈబే డాట్ కామ్ పూర్తి పేరు ‘ఎకో బే టెక్నాలజీ గ్రూప్'. పలికేందుకు ఇబ్బందికరంగా ఉండటంతో ఈబేగా మార్చేసారు.

Best Mobiles in India

English summary
How big tech companies got their names. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X