ఆన్‌లైన్‌లో Exam Resultsను చెక్ చేసుకోవటం ఎలా

Posted By: BOMMU SIVANJANEYULU

టెక్నాలజీ అన్ని విభాగాలతో పాటు విద్యా వ్యవస్థను కూడా శాసిస్తోంది. విద్యార్థులు అప్లికేషన్‌ను ఫిల్ చేయటం దగ్గర నుంచి పరీక్షా ఫలితాలను తెలుసుకునేంత వరకు ఇంటర్నెట్ కీలక పాత్ర పోషిస్తోంది. గతంలో పరీక్షా ఫలితాలను తెలుసుకోవాలంటే విద్యార్థులు న్యూస్ పేపర్ వచ్చేంత వరకు ఎదురుచూడాల్సి వచ్చేది. ఈ వ్యవధిలో బోలెడంత టెన్షన్‌ను వాళ్లు అనుభవించే వాళ్లు. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ఆ పరిస్థితి కాస్తా మారిపోయింది.

ఆన్‌లైన్‌లో Exam Resultsను చెక్ చేసుకోవటం ఎలా

విద్యా సంస్థలు తమ విద్యార్థులకు సంబంధించిన పరీక్షా ఫలితాలను నేరుగా తమతమ అఫీషియల్ వెబ్‌సైట్‌లలో పోస్ట్ చేయటం జరుగుతోంది. దీంతో నిమిషాల వ్యవధిలో విద్యార్థులు తమ పరీక్షా ఫలితాలను తెలసుకోగలుగుతున్నారు.

ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ దగ్గర నుంచి స్కూల్ లెవల్, కాలేజ్ లెవల్, యూనివర్శిటీ లెవల్, రిక్రూట్‌మెంట్ లెవల్, కాంపిటీటివ్ ఎగ్జామ్ లెవల్ ఎగ్జామినేషన్ అథారటీస్ వరకు అఫీషియల్ వెబ్‌సైట్‌లను మెయింటేన్ చేస్తూ ఎగ్జామ్ రిజల్ట్స్‌తో సహా అన్ని రకాల సమచారాన్ని వాటిలో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తున్నాయి.

ఆన్‌లైన్‌లో ఎగ్జామ్ రిజల్ట్స్‌ను తెలుసుకునే సమయంలో విద్యార్థులు తమ వద్ద ఉంచుకోవల్సిన సమాచారం..

ఎగ్జామ్ రిజల్ట్స్‌ వెలువడే అఫిషియల్ వెబ్‌సైట్ అడ్రస్,

విద్యార్థి రోల్ నెంబర్ లేదా హాల్ టికెట్ నెంబర్,

విద్యార్థి పేరు,

విద్యార్థి పుట్టిన తేదీ,

ఈ-మెయిల్ తదితర వివరాలు..

ఇంటర్నెట్‌లో ఎగ్జామ్ రిజల్ట్స్‌ చెక్ చేసుకునేందుకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్..

ముందుగా మీ కంప్యూటర్ నుంచి ఎగ్జామ్ రిజల్ట్స్‌ వెలువడే అఫిషియల్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వండి. వెబ్‌సైట్ పేజీలో మీకు కావల్సిన రిజల్ట్స్ లింక్ పై క్లిక్ చేయండి. లింక్ ఓపెన్ అయిన తరువాత, పేజీలో

అడిగిన దాని బట్టి మీ సబ్జెక్ట్, కోర్స్, సంవత్సరం, సెమిస్టర్, రోల్ నెంబర్ వంటి వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి. రిజల్ట్‌కు సంబంధించిన వివరాలు మీ కళ్ల ముందు ప్రత్యక్షమవుతాయి. ఆ పేజీని సేవ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి.

తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్ రిజల్ట్స్‌ను యాక్యురేట్‌గా అందిస్తోన్న పలు వెబ్‌సైట్‌ల వివరాలు..

రిజల్ట్స్.గవ్.ఇన్ (results.gov.in),

ఇండియన్‌‌రిజల్ట్స్.కామ్ (indiaresults.com),

ఎగ్జామ్‌రిజల్ట్స్.నెట్ (examresults.net),

భారత్‌స్టూడెంట్.కామ్ (bharatstudent.com),

మనబడి.కో.ఇన్ (manabadi.co.in),

స్కూల్స్9.కామ్ (schools9.com).

ఫ్లాష్ మెసేజ్‌లు విసిగిస్తున్నాయా, అయితే ఇలా తీసి పడేయండి

Read more about:
English summary
How to Check Examination Results Online. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot