బ్లాగుని సొంత డొమైన్‌లోకి మార్చుకోవాలంటే ఎలా?

Posted By: Super

బ్లాగుని సొంత డొమైన్‌లోకి మార్చుకోవాలంటే ఎలా?

బ్లాగు ఉన్నవారికి blogspot.com వద్ద సబ్ డొమైన్ లభిస్తుంది గూగిల్ ద్వారా. అయితే స్వంత డొమైన్‌కి ఉందే లుక్‌ని, సౌలభ్యాన్ని ఇష్టపడే వారి కోసం బ్లాగర్ బ్లాగుకి మన సోంత డొమైన్ ని ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. ఉదా : www.oneindia.co.in. దీనికోసం డొమైన్ నేమ్ గూగిల్ వద్దే క్రెడిట్ కార్డుతో పది డాలర్ల (10$) కు కొనుక్కోవచ్చు. ఇందుకోసం అయ్యే ఖర్చు కేవలం రూ 500 మాత్రమే.

1.blogger.com ద్వారా లాగిన్ అయ్యి Dashboard కి వెల్లండి.
2. Click on “Publishing” at “Settings” tab
3. Advance Settings Select చేసుకుని మీ డొమైన్ ని టైప్ చెయ్యండి.
4. save చెయ్యండి.

ఇప్పుడు మీ కొత్త డొమైన్ ని బ్రౌజర్లో చూడండి. సాదారణంగా డొమైన్ లో మార్పులు చేర్పులు పూర్తి అవ్వడానికి 24గంటల వరకూ పట్టవచ్చు. 24గంటలు దాటినా మీ సైట్ కొత్త చిరునామా వద్ద లోడ్ అవ్వకపోతే మీ సెట్టింగ్స్ సరి చూడండి . లేదా మీ డొమైన్ రిజిస్త్రేషన్ కంపెనీ వారిని సంప్రదించండి. ఇక నుంచి మీబ్లాగు కొత్త డొమైన్ వద్ద కనిపిస్తున్నా పాత బ్లాగ్‌స్పాట్ లింక్స్ అన్ని ఆటొమాటిగ్గా మీ కొత్త చిరునామాకి రీడైరక్ట్ చెయ్యబడతాయి. అంటె పాతలింక్ నొక్కినా సరే అది కొత్త లింక్ కి డైరక్ట్ అవుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot