ఆన్‌లైన్ లో యానిమేటెడ్ వీడియోలు తయారుచెయ్యడం ఎలా...?

Posted By: Super

ఆన్‌లైన్ లో యానిమేటెడ్ వీడియోలు తయారుచెయ్యడం ఎలా...?

Xtranormal Movie Maker అనే ఉచిత టూల్ ని ఉపయోగించి ఆన్‌లైన్ లో యానిమేషన్లను తయారుచేసుకోవచ్చు. దీని కోసం మీరు గూగుల్ ఎకౌంట్ తప్పనిసరిగా ఉపయోగించాలి. http://www.youtube.com/create_detail/Xtranormal అనే సైట్ కి వెళ్శి గూగుల్ ఎకౌంట్‌తో సైన్ఇన్ అయిన తర్వాత అక్కడే ఉన్న Create Video పై క్లిక్ చెయ్యాలి. Choose a collection to start making movies! దగ్గర నచ్చిన కలెక్షన్ దగ్గర ఒక యాక్టరా లేదా ఇద్దరు కావాలా అనే దానికి సంబంధించిన బటన్ పై క్లిక్ చెయ్యాలి. ఇక ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ సెట్, యాక్టర్లు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లను వాటికి సంబంధించిన టాబ్ లలో ఎంచుకోవాలి.

ఆ తర్వాత స్టోరీ టాబ్ లో ఆయా యాక్టర్లు చెప్పవలసిన డైలాగ్స్‌ని టైప్ చెయ్యాలి. ఎంతవరకు డైలాగ్స్ అవసరమో అంతవరకు టెక్స్ట్ టైప్ చెయ్యటానికి అక్కడే ఉన్న + పై క్లిక్ చేస్తూ వెళ్ళాలి. తయారు చేసుకున్న వీడియో ప్రివ్యూ చూడటానికి Preview దగ్గర ఉన్న FlipBook పై క్లిక్ చెయ్యాలి. అలానే మన తయారుచేసుకున్న వీడియో యూట్యూబ్ లో పబ్లిష్ చేయ్యటానికి YouTube పై క్లిక్ చెయ్యాలి. తెలుసుకున్నారు కదా యానిమేటెడ్ వీడియో తయారుచెయ్యడం..ఇక మీ అభిమానుల హీరోల డైలాగ్స్‌తో యానిమేటేడ్ వీడియోలు తయారుచేసి రెచ్చిపోండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot