Home
News

Damini App : భారీ వర్షాలు, తుపాన్‌ హెచ్చరికల నేపథ్యంలో ఈ యాప్‌ను వెంటనే ఇన్‌స్టాల్‌ చేసుకోండి!

భారత్‌లో పిడుగుపాట్ల కారణంగా ప్రతి సంవత్సరం వందల మంది మృతి చెందుతున్నారు. అనేక మూగజీవాలు కూడా మృత్యువాతపడుతున్నాయి. పొలాల్లో పనిచేస్తున్న రైతులు, కూలీలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. దీంతో ప్రభుత్వాల స్థాయిలో అనేక హెచ్చరిక వ్యవస్థలు భారీ వర్షాలతోపాటు పిడుగుపాట్ల గురించి ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తున్నాయి.

పిడుగుపాటుపై ప్రజలను నిత్యం అప్రమత్తం చేసేందుకు కేంద్ర ఎర్త్‌ సైన్సెస్‌ మంత్రిత్వ శాఖ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్ మెటీరియాలజీ.. దామిని లైట్నింగ్‌ అలర్ట్‌ యాప్‌ను (Damini lightning app) ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ యాప్ ఆండ్రాయిడ్, iOS యూజర్లకు అందుబాటులో ఉంది.

Damini lightning app telugu news

ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టి నుంచి మొంథా తుపాన్‌ తీవ్ర ప్రభావం చూపుతుందనే వాతావరణ శాఖ హెచ్చరికల జారీ చేసింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం అయింది. NDRF, SDRF బృందాలను రంగంలోకి దించింది. అధికారులు కూడా ఎప్పటికప్పుడు అనేక సూచనలు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా సుమారు 20 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. రెండు రోజుల నుంచి 5 రోజుల వరకు సెలవులిచ్చింది.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా స్వచ్ఛందంగా అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పిడుగుపాటు హెచ్చరికలతోపాటు భారీ వర్షాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం దామిని యాప్‌ ను ఉపయోగించుకోవచ్చు.

దామిని యాప్‌ ఎలా పనిచేస్తుంది? :
> దామిని యాప్‌ స్మార్ట్‌ఫోన్‌ GPS ఆధారంగా యూజర్ల సమీప ప్రాంతంలో పిడుగుపాట్లకు సంబంధించిన సమాచారం అందిస్తుంది.
> 20 కి.మి నుంచి 40 కి.మీ వరకు పిడుగులు పడే అవకాశాన్ని ఎప్పటికప్పుడు నోటిఫికేషన్‌ల రూపంలో సమాచారం అందిస్తుంది.
> సుమారు 25 నిమిషాలు ముందుగానే మీ ప్రాంతంలో పిడుగుపాటుకు సంబంధించిన సమాచారం చేరవేస్తుంది.
> దామిని యాప్‌లో పిడుగుపాటు హెచ్చరికల సమాచారంతోపాటు భారీ వర్షాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉంటాయి.

ఈ లైట్నింగ్ అలెర్ట్ యాప్‌ మూడు రంగుల్లో హెచ్చరికలను జారీ చేస్తుంది.
ఎరుపు రంగు : 7 నిమిషాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని దీని అర్థం. వెంటనే సమీపంలోని సురక్షిత ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుంది.
పసుపు రంగు : 14 నిమిషాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని దీని అర్థం.
నీలం రంగు : 21 నిమిషాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని దీని అర్థం.

23 భారతీయ భాషల్లో :
ఈ దామిని యాప్‌ తెలుగు సహా 23 భారతీయ భాషల్లో ఉపయోగించుకొనేందుకు అవకాశం ఉంది. లొకేషన్ ఆధారంగా నోటిఫికేషన్‌ల రూపంలో యూజర్లను అప్రమత్తం చేస్తుంది. పేరు, ఫోన్‌ నంబర్‌ సహా అడ్రస్ వంటి వివరాలు అందించాల్సి ఉంటుంది.

తుపానులు, భారీ వర్షాలు, పిడుగుపాట్ల సమయాల్లో స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్ల వంటి ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను ఆఫ్‌ చేయడం ఉత్తమం. దీంతోపాటు పిడుగుపాట్ల వంటి సమయాల్లో నదులు, చెరువులు, స్విమ్మింగ్‌ పూల్స్‌ వద్ద అధిక విద్యుత్ ప్రసారం ఉండేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల ఆయా ప్రాంతాలకు వెళ్లకూడదు.

Images : Ministry of Earth Sciences

More from GizBot

Best Mobiles in India

English summary
How Damini lightning app usefull in the wake of montha cyclone warnings in andhra pradesh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X