మీ కంప్యూటర్ టెంపరరీ ఫైళ్లను తొలగించుటం ఏలా..?

మీ పీసీలోని అప్లికేషన్స్ వేగంగా రన్ అవ్వాలంటే టెంపరరీ ఫైల్స్ (Tempaparary files)ని ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకోవాలి. ఈ ఫైళ్లను డిలీట్ చేయలంటే.. స్టార్ట్ (start) బటన్‌నుక్లిక్‌చేసి సెర్చ్ కాలమ్‌లో రన్ (Run)అనే ఫైల్‌ను ఎంపిక చేసుకని అందులో %temp% టైప్ చేసి ఎంటర్ (Enter)బటన్ నొక్కగానే టెంప్ (temp) అనే ఫోల్డర్ ప్రత్యక్షమవుతుంది. ఆ ఫోల్డర్‌లోని ఫైళ్లను ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకుంటుంటే మీ పీసీ వేగం పెరుగుతుంది.
ఈ వర్షా కాలంలో మీ ఫోన్ జరభద్రం!
వానల కాలం వచ్చేసింది. ఈ వర్ష రుతువులో మీ మొబైల్ ఫోన్ నీటిలో తడిచే అవకాశాలు చాలా ఉన్నాయి. అనుకోని పరిస్థితుల్లో మీ మొబైల్ చమ్మతాకిడికి లోనైనట్లయితే తీసుకోవల్సిన జాగ్రత్తలను క్రింది స్లైడ్ షోలో సూచించటం జరిగింది.
నీటి తాకిడికి లోనైన మీ డివైజ్ పనితీరు ఎలా ఉందో తొలత చెక్ చేసుకోండి. ఈ సందర్భంలో బటన్‌లను ఎక్కువగా ప్రెస్ చేయవద్దు. కీప్యాడ్ పై అధిక ఒత్తిడి తీసుకురావటం వల్ల చమ్మలోనికి ప్రవేశించే ఆస్కారం ఉంది.తరువాతి చర్యగా ఫోన్ నుంచి బ్యాటరీని వేరు చేయండి. ఇలా చేయటం వల్ల షార్ట్ సర్య్యూట్ బెడద తప్పుతుంది.తదుపరి చర్యగా కీప్యాడ్ ప్యానెల్‌ను వేరు చేయండి. - ఫోన్‌లోని సిమ్ కార్డ్స్ అలాగే మెమరీ కార్డ్‌లను వేరుచేయండి.పొడి టవల్ తీసుకుని చమ్మతాకిడికి లోనైన ప్రదేశాన్ని డ్రై చేయండి.తడిబారిన ప్రదేశం వెచ్చబడిన అనంతరం ఫోన్‌ను 24 గంటల పాటు బిగుతైన ఎయిర్ కంటైనర్‌లో ఉంచండి. ఫోన్ పూర్తిగా ఆరినట్లు అనిపిస్తే బ్యాటరీని జతచేసి స్విచ్ ఆన్ చేయండి. మీ ఫోన్ ఖచ్చితంగా పనిచేస్తుంది.


Click it and Unblock the Notifications








