పసికందు కిడ్నాప్... ఫేస్‌బుక్ సాయంతో క్షేమంగా తల్లి ఒడికి!

Posted By:

ఓ పసికందు కిడ్నాప్ ఉదంతం ఫేస్‌బుక్ సాయంతో సుఖాంతంగా ముగిసింది. తన బిడ్డ అపహరణతో ఒక్కసారిగా తల్లడిల్లిన ఆ తల్లి చివరిగా ఆ బిడ్డ తన ఒడికి చేరటంతో ఫేస్‌బుక్‌కు దన్యవాదాలు తెలుపుకుంది. అంతర్జాతీయ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించి వివరాలను పరిశీలించినట్లయితే... ట్రాయిస్ రివిరేస్, క్యుబెక్‌లోకి ఓ ఆసుపత్రిలో మెలిస్సా మెక్‌మోహన్ ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది. సోమవారం సాయంత్రం ఆ 16 గంటల ఆడ శిశువు విక్టోరియాను నర్సు రూపంలో వచ్చిన ఓ అగంతుకురాలు అపహరించినట్లు గుర్తించారు. వెంటనే ఆమె ఫోటోతో కూడిన సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అనతికాలంలోనే ఈ వార్తకు ట్విట్టర్ ఇంకా ఫేస్ బుక్ లలో 1600 షేర్లు లభించాయి.

 పసికందు కిడ్నాప్... ఫేస్‌బుక్ సాయంతో క్షేమంగా తల్లి ఒడికి!

ఫేస్‌బుక్ ద్వారా ఈ సమాచారాన్ని తెలుసుకున్న ఓ టీనేజర్ల బృందం ఏదో ఒకటి చేయాలన్న తపనతో మారువేషంలో ఉన్న ఆ నుర్సును జాడ తెలుసుకునేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ ప్రయత్నంలో ఆ టీనేజర్ల బృందంలో ఒకరైన చార్లీన్ ప్లాంటీ ఆ నర్సు రూపంలో ఉన్న అనుమానాస్పద వ్యక్తిని తన పొరిగింటి వ్యక్తిగా గుర్తించాడు. వెంటనే ఆ టీనేజర్లు బృందం అమె అపార్ట్‌మెంట్‌కు చేరకుని పరిస్థితిని గమనించారు. పసికందు ఆమె అదుపులో ఉండటాన్ని గమనించిన వారు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. హుటాహుటిన అపార్ట్‌మెంట్‌కు చేరకున్న పోలీసులు మహిళను అదుపులోకి తీుసుకుని ఆ పసికందును తల్లి వద్దకు చేర్చారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot