ప్లస్ సర్కిల్ నుండి మనల్ని తోలగిస్తే తెలుసుకోవడం ఎలా?

Posted By: Super

ప్లస్ సర్కిల్ నుండి మనల్ని తోలగిస్తే తెలుసుకోవడం ఎలా?

ప్రపంచంలో నెంబర్ వన్‌‌గా కొనసాగుతున్న ఫేస్‌బుక్‌కి పోటీగా గూగుల్ కంపెనీ గూగల్ ప్లస్ అనే సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్‌కి సంబంధించిన బీటా వర్సన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. విడుదల చేసిన మూడువారాలకే 20 మిలియన్ యూజర్స్ గూగుల్ ప్లస్‌లో జాయిన్ అవడంతో రికార్డుని కూడా సృష్టించిన సంగతి తెలిసిందే. ఇలాంటి గూగుల్ ప్లస్ చిట్కాలు ఏమిటో తెలుసుకుందాం. గూగుల్‌ ప్లస్‌లో ఫొటోలను ఎడిట్‌ చేసుకోవచ్చు. వీడియో ఛాట్‌ను హెచ్‌డీలోకి పెట్టుకోవచ్చు. ఇలాంటివి మరెన్నో చూద్దాం.

గూగుల్ ప్లస్‌లో అప్‌లోడ్‌ చేసిన ఫొటోలను ప్లస్‌ గ్యాలరీలోనే ఎడిట్‌ చేయవచ్చు. ఆల్బమ్‌లోని ఏదైనా ఫొటోని పుల్‌స్క్రీన్‌లో ఓపెన్‌ చేయాలి. కింది కనిపించే Actions మెనూలోని 'ఎడిట్‌ ఫొటో'పై క్లిక్‌ చేసి ఆరు ఎఫెక్ట్‌లతో ఆకట్టుకునేలా చేయవచ్చు. అక్కర్లేకుంటే Undo చేసే వీలుంది. రొటేట్‌ చేయవచ్చు కూడా. నెట్‌వర్క్‌లోని అప్‌డేట్స్‌ (నోటిఫికేషన్స్‌) ఎసెమ్మెస్‌ రూపంలో మొబైల్‌కి చేరేలా చేయవచ్చు. అందుకు హోం పేజీ పై భాగంలో కుడివైపు కనిపించే సెట్టింగ్స్‌ గుర్తుపై క్లిక్‌ చేయాలి. మెనూలోని 'గూగుల్‌ ప్లస్‌ సెట్టింగ్స్‌'లోకి వెళ్లి Set delivery preferences-> Add Phone Numberలో మొబైల్‌ నెంబర్‌ని ఎంటర్‌ చేయాలి. వెరిఫికేషన్‌ నెంబర్‌తో సభ్యులయ్యాక గూగుల్‌ ప్లస్‌ నోటిఫికెషన్స్‌ మెసేజ్‌ రూపంలో మొబైల్‌కి వచ్చేస్తాయి.

ప్లస్‌తో వీడియో ఛాట్‌ చేస్తున్నారా? మీరు వాడుతున్న వెబ్‌ కెమెరా ఆధారంగా ఛాటింగ్‌ని హెచ్‌డీ క్వాలిటీలోకి మార్చుకోవచ్చు. అందుకు ఛాట్‌బాక్స్‌లో కనిపించే బాక్స్‌పై క్లిక్‌ చేసి HD Video chat చెక్‌బాక్స్‌ని ఎనేబుల్‌ చేయాలి. మీ సర్కిల్స్‌లో సభ్యులు ఇతరులకు కనిపించకూడదు అనుకుంటే విజిబిలిటీని మార్చుకునే వీలుంది. అందుకు ప్రొఫైల్‌ పేజీలోకి వెళ్లి Edit Profileను క్లిక్‌ చేయాలి. ఎడమవైపు మీ సర్కిల్‌ సభ్యుల ఫొటోలపైన కనిపించే డిస్క్‌ గుర్తుపై క్లిక్‌ చేయాలి. అక్కడ కనిపించే Who can see this?లోని Anyone on the web కాకుండా Your Circles బటన్‌ను చెక్‌ చేసి సేవ్‌ చేయాలి.

మీరుండే లొకేషన్‌ను స్నేహితులతో పంచుకోవాలంటే హోం పేజీ పై భాగంలో కుడివైపు కనిపించే Shareపై క్లిక్‌ చేయాలి. వచ్చిన బాక్స్‌లోని Add your locationపై క్లిక్‌ చేయండి. దీంతో గూగుల్‌ ఆలోమాటిక్‌గా మీ లొకేషన్‌ను చూపిస్తుంది. సర్కిల్స్‌ని సెలెక్ట్‌ చేసి 'షేర్‌' చేయండి. గూగుల్‌ క్రోమ్‌లో ప్లస్‌ను వాడితే 'ఎక్స్‌టెన్షన్స్‌' ద్వారా మరిన్ని అదనపు సౌకర్యాల్ని ప్లస్‌తో పొందుపరుచుకోవచ్చు. ఉదాహరణకు Helperfor Google+ ఎక్స్‌టెన్షన్‌తో ప్లస్‌లోని పోస్టింగ్స్‌ని ట్విట్టర్‌లో కూడా షేర్‌ చేసుకోవచ్చు. గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌తో పోస్టింగ్స్‌ని ఇతర భాషల్లోకి మార్చుకోవచ్చు. Surplus ఎక్స్‌టెన్షన్‌తో గూగుల్‌ ప్లస్‌ను బ్రౌజర్‌ అడ్రస్‌బార్‌ పక్కనే ఐకాన్‌లా నిక్షిప్తం చేసుకుని అప్‌డేట్స్‌ని సులభంగా తెలుసుకోవచ్చు.

ఇన్ని ప్లస్‌లు ఉన్నటువంటి గూగుల్ ప్లస్‌లో కొన్నిమైసస్‌లు కూడా ఉన్నాయి. ఆ మైనస్ ఏమిటంటే మీ ఆహ్వానాన్ని మన్నించి సర్కిల్‌లో చేరిన స్నేహితుల గురించి మెయిల్‌, నోటిఫికెషన్‌ ద్వారా తెలిసిపోతుంది. కానీ, ఎవరైనా వారి సర్కిల్‌ నుంచి మిమ్మల్ని తొలగిస్తే అది మీకు తెలియదు. మరి, తెలుసుకోవడం ఎలా? ఏముందీ! గూగుల్‌ మైనస్‌ ఎక్స్‌టెన్షన్‌ను నిక్షిప్తం చేస్తే సరి! అడ్రస్‌బార్‌ పక్కనే ప్రత్యేక గుర్తు కనిపిస్తుంది. మిమ్మల్ని ఎవరైనా తొలగిస్తే ఆ సమాచారాన్ని చూపించడంతో పాటు బ్రౌజర్‌ హిస్టరీని కూడా నమోదు చేస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot