ఫేస్‌బుక్ ఛాటింగ్ బార్‌ని ఫిక్స్ చేయాలంటే ఎలా..?

Posted By: Super

ఫేస్‌బుక్ ఛాటింగ్ బార్‌ని ఫిక్స్ చేయాలంటే ఎలా..?

గూగుల్ ప్లస్ పోటీని తట్టుకునేందుకు ప్రపంచంలో నెంబర్ వన్ అయినటువంటి సోషల్ మీడియా నెట్ వర్క్ వెబ్ సైట్ ఫేస్‌బుక్ కొత్త దారులను అన్వేషిస్తుంది. అందులో భాగంగానే ఫేస్‌బుక్‌లో స్కైపీ సహాయంతో వీడియో ఛాట్‌ని ప్రవేశపెట్టడం జరిగింది. సాధారణంగా సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్‌లలో ముఖ్యపాత్ర పోషించేది ప్రెండ్స్ మద్యన ఉన్న ఛాటింగ్. సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్‌ని యూజర్స్ వాడేది ప్రెండ్స్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ తెలుసుకోవడంతో పాటు, వారితో ఛాటింగ్ చేయడానికేనని మన అందరికి తెలిసిన విషయమే.

ఫేస్‌బుక్లో గనుక మీరు గమనించినట్లైతే మీ కుడివైపున ఓ పెద్ద ఛాటింగ్ బార్ కనిపిస్తుంది. ఈ ఛాటింగ్ బార్‌లో ఎవరెవరైతే మీ స్నేహితులు ఉన్నారో వారంతా కనిపించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఛాటింగ్ బార్‌లో ఆన్ లైన్, ఆఫ్ లైన్‌లో ఉన్నవారంతా కనిపిస్తారు. అసలు ఈ ఛాటింగ్ బార్‌లో ఎవరెవరు ఆన్ లైన్‌లో ఉన్నారు, ఎవరెవరు ఆఫ్ లైన్‌లో ఉన్నారు కనిపెట్టడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇందు కోసం ఒకే ఓక లైన్ కోడ్‌ని కనిపెట్టడం జరిగింది. ఎవరైతే విండోస్ సిస్టమ్స్‌ని వాడుతున్నారో వారికోసం బ్రౌజర్ ఎక్స్ టెన్షన్‌‍ని, ఎవరైతే లైనక్స్ యూజర్స్ ఉన్నారో వారికోసం బుక్ మార్కెలెట్‌ని విడుదల చేయడం జరిగింది.

దీనిని ఉపయోగించి ఫేస్‌బుక్‌లో ఎవరెవరు ఆన్ లైన్‌లో ఉన్నారో చాలా ఈజీగా పసిగట్టవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం http://www.talater.com/fix_facebook_chat/ లోకి వెళ్శి మీ ఆపరేటింగ్ సిస్టమ్‌ని బట్టి ఎక్స్ టెన్షన్‌ని డౌన్ లోడ్ చేసుకోండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot