ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7: పాల్ వాకర్ పాత్ర ఏలా సృష్టించారు..?

Posted By:

ప్రముఖ హాలీవుడ్ నటుడు పౌల్ వాకర్ నటించిన ఆఖరి చిత్రం ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7'. సినిమా ఏప్రిల్ 2న విడుదల కావడంతో సినీ అభిమానులంతా థియేటర్లకు క్యూ కట్టారు. ఫలితంగా ఈ చిత్రం గతంలో ఏ హీలీవుడ్ సినిమా సాధించని విధంగా తొలి రోజు హయ్యెస్ట్ కలెక్షన్ సాధించింది. సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో వసూళ్లు మరింత పెరుగుతాయని ఆశిస్తున్నారు. తొలి రోజు ఈ చిత్రం ఇండియా వ్యాప్తంగా రూ. 12 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ సిరీస్ చిత్రాలతో అత్యంత పాపులారిటీని దక్కించుకున్న హాలీవుడ్ నటుడు పాల్‌ వాకర్‌ ఫ్యూరియస్ 7 ప్రొడక్షన్ దశలో ఉండగానే ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

ఇంకా చదవండి: ఆండ్రాయిడ్ లాలీపాప్‌లోని 10 కూలెస్ట్ ఫీచర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పాల్ వాకర్ అకాల మరణం నేపథ్యంలో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 చిత్ర దర్శకుడు జేమ్స్ వాన్ అనేక వ్యయప్రయోసలను ఎదుర్కొవల్సి వచ్చింది.

చిత్రాన్ని పూర్తి చేసే క్రమంలో కధను స్వల్ప మార్పులతో రీరైట్ చేసారు. సినిమాలో మిగిలి ఉన్న పాల్ వాకర్ పాత్రను WETA సంస్థ సృష్టించిన డిజిటల్ రీక్రియేటెడ్ పాల్ వాకర్ పాత్ర ద్వారా పూర్తి చేయనున్నట్లు ద హాలీవుడ్ రిపోర్టర్ వెల్లడించింది. అయితే, ఈ వార్తలను వేటా సంస్థ ఖండించింది.

ఈ తరహా పాత్రలను సృష్టించటం WETA సంస్థకు కొత్తేమి కాదు. గతంలో లార్డ్ ఆఫ్ ద రింగ్స్ కోసం గోలమ్ పాత్రను, డాన్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ కోసం సీజర్ పాత్రను డిజైన్ చేసింది. అయితే, సినిమాలో మిగిలి ఉన్న అధికశాతం పాల్ వాకర్ సీన్లను వాకర్ సోదరులైన కాలిబ్, కోడీలతో చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ఈ చిత్రం గతేడాదే విడుదల కావాల్సి ఉంది. ఈ చిత్రంలో నటించిన హాలీవుడ్ స్టార్ పాల్ వాకర్ కారు యాక్సిడెంటులో మరణించడంతో సినిమా విడుదల ఆలస్యం అయింది.

ప్రపంచ వ్యాప్తంగా వేలాది థియేటర్లలో వివిధ భాషల్లో ఈ చిత్రం విడుదలైంది. వసూళ్ల పరంగా ఈ చిత్రం 1 బిలియన్ డాలర్ల మార్కను అందుకుంటుందని భావిస్తున్నారు. ఇప్పటికీ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమాలోని అద్భుతమైన పోరాట సన్నివేశాలు ప్రేక్షకులకు థ్రిల్

చేస్తున్నాయి. యాక్షన్ సినిమాలు ఇష్టపడే అభిమానులకు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How ‘Furious 7’ Created a Digital Paul Walker For His Unfinished Scenes. Read more in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot