మీ ఫేస్‌బుక్ ఫోస్ట్‌కు ఎక్కువ లైక్స్ రావాలంటే..?

Posted By:

మీ ఫేస్‌బుక్ పేజీలకు ఎక్కువ ‘లైక్స్' లభించటం లేదా..? చింతించకండి! మీ ఫేస్‌బుక్ పేజీలు ఎక్కువ లైక్స్ ను సంపాదించే పలు బెస్ట్ చిట్కాలను మీ ముందుంచుతున్నాం.

ఫోటోలు ఎక్కువ లైక్స్ సంపాదించే విధంగా సరికొత్త ఫార్ములాను భారత సంతతి విద్యార్థి రూపకల్పన చేసారు. మీ ఫేస్‌బుక్ ఫోటోలను ఎక్కువ మంది లైక్ చేయాలంటే..? యూఎస్‌లోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యాలయంలో కంప్యూటర్ విద్యనభ్యసిస్తున్న అదిత్య కోశలా అనే విద్యార్థి ఒక సూత్రాన్ని సృష్టించారు. ఈ ఫార్ములా మీ పోటోలోని కంటెంట్‌ను విశ్లేషించి ఆన్‌లైన్‌లో ఆ ఫోటోకు దక్కే ప్రజాదరణను అంచనా వేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్‌బుక్ అకౌంట్‌లోని బిల్డ్ ఆడియన్స్ టూల్‌ను ఉపయోగించి మీ ఈమెయిల్ కాంటాక్ట్‌లకు ఒకే సమయంలో 5000 ఇన్విటేషన్‌లను పంపించవచ్చు. బిల్డ్ ఆడియన్స్ బటన్ మీ  ఫేస్‌బుక్ అడ్మిన్ పేజ్ పై భాగంలో ఉంటుంది. ఈ బటన్ పై క్లిక్ చేసి ఈమెయిల్
కాంటాక్ట్‌లను మీ ఫేస్‌బుక్ పీజీని లైక్ చేసేందుకు ఇన్వైట్ చేయవచ్చు.

మీ పేస్‌బుక్ అకౌంట్‌లోని "suggest to friends" ఫీచర్‌ను ఉపయోగించుకోవటం ద్వారా ఫేస్‌బుక్ లైక్స్‌ను పెంచుకోవచ్చు.

బహుమతులను ప్రకటించటం ద్వారా ఫేస్‌బుక్ లైక్స్‌ను పెంచుకోవచ్చు.

మీ ఫేస్‌బుక్ పేజీని ప్రొఫైల్ క్రింద కనపించే About Section ఎంప్లాయిమెంట్ స్థానంలో లింక్ చేయటం ద్వారా ఫేస్‌బుక్ లైక్స్‌ను పెంచుకోవచ్చు.

మీరు మల్టిపుల్ ఫేస్‌బుక్ పేజీలను కలిగి ఉన్నట్లయితే పేజీలను ఇంటర్ లింక్ చేయటం ద్వారా ఫేస్‌బుక్ లైక్స్‌ను పెంచుకోవచ్చు.

మీ ప్రయోషన్ వేగవంతంగా విస్తరించాలంటే ఫేస్‌బుక్ లైక్స్‌ను కొనుక్కోండి.

మీ ఫేస్‌బుక్ పేజీని ట్విట్టర్‌కు కనెక్ట్ చేయటం ద్వారా లైక్స్‌ను పెంచుకోవచ్చు.

తరచూ ఆసక్తికర వీడియోలను మీ ఫేస్‌బుక్ పేజీలో అప్‌లోడ్ చేస్తుండండి.

మీ ఫేస్‌బుక్ పేజీ గురించి అన్ని చోట్లా ప్రస్తావించండి. అదే మీకు కొండంత ప్రమోషన్.

‘ఫ్యాన్ ఆఫ్ ద మంత్' పేరుతో ఫేస్‌బుక్ కాంటెస్ట్‌ను రన్ చేసి ఎక్కువ లైక్‌లను సొంతం చేసుకోండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ ఫార్ములా రూపకల్పనలో భాగంగా ఆదిత్యా కోశలా అతని బృందం 2.3మిలియన్ల ఫ్లిక్కర్ ఫోటోలను స్కాన్ చేసి వాటిలో ఎక్కువ ప్రజాదరణను సొంతం చేసుకున్న ఫోటోలను ఎంపిక చేసారు. అత్యధికంగా ఆకర్షించబడిన ఫోటోలకు సంబంధించి కూర్పు, కలర్, విషయం తదితర అంశాలను ఈ బృందం నిశితంగా పరిశీలించింది. అధ్యయనంలో భాగంగా బ్రాసరీస్, రివాల్వర్లు, మినీ‌స్కర్ట్‌లు, బికనీలు ఇంకా కప్‌లకు సంబంధించిన ఫోటోలకు ఎక్కువ ఆదరణ లభించినట్లు వీరు తెలిపారు. ఫోటోలో ఉన్న విషయాన్ని బట్టి ఆ ఫోటో పాపులారిటీని అంచానా వేయవచ్చని ఆదిత్య కోశలా హఫ్ఫింగ్‌టన్ ఫోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

English summary
How To Get More Facebook Likes. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot