మీ ఫేస్‌బుక్ ఫోటోలను ఎక్కువ మంది లైక్ చేయాలంటే..?

Posted By:

ఫేస్‌బుక్ ఇంకా ట్విట్టర్ అకౌంట్‌లలో నిత్యం మీరు పోస్ట్ చేస్తున్న ఫోటోలకు ఎక్కువ ‘లైక్స్' లభించటం లేదా..? చింతించకండి! మీ ఫోటోలు ఎక్కువ లైక్స్ సంపాదించే విధంగా సరికొత్త ఫార్ములాను భారత సంతతి విద్యార్థి రూపకల్పన చేసారు.

మీ ఫేస్‌బుక్ ఫోటోలను ఎక్కువ మంది లైక్ చేయాలంటే..?

యూఎస్‌లోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యాలయంలో కంప్యూటర్ విద్యనభ్యసిస్తున్న అదిత్య కోశలా అనే విద్యార్థి ఒక సూత్రాన్ని సృష్టించారు. ఈ ఫార్ములా మీ పోటోలోని కంటెంట్‌ను విశ్లేషించి  ఆన్‌లైన్‌లో ఆ ఫోటోకు దక్కే ప్రజాదరణను అంచనా వేస్తుంది.

ఈ ఫార్ములా రూపకల్పనలో భాగంగా ఆదిత్యా కోశలా అతని బృందం 2.3మిలియన్ల ఫ్లిక్కర్ ఫోటోలను స్కాన్ చేసి వాటిలో ఎక్కువ ప్రజాదరణను సొంతం చేసుకున్న ఫోటోలను ఎంపిక చేసారు. అత్యధికంగా ఆకర్షించబడిన ఫోటోలకు సంబంధించి కూర్పు, కలర్, విషయం తదితర అంశాలను ఈ బృందం నిశితంగా పరిశీలించింది.

అధ్యయనంలో భాగంగా బ్రాసరీస్, రివాల్వర్లు, మినీ‌స్కర్ట్‌లు, బికనీలు ఇంకా కప్‌లకు సంబంధించిన ఫోటోలకు ఎక్కువ ఆదరణ లభించినట్లు వీరు తెలిపారు. ఫోటోలో ఉన్న విషయాన్ని బట్టి ఆ ఫోటో పాపులారిటీని అంచానా వేయవచ్చని ఆదిత్య కోశలా హఫ్ఫింగ్‌టన్ ఫోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting