Home
News

Airtel వినియోగదారులు Disney+ Hotstar VIPను ఉచితంగా పొందే అవకాశం...

డిస్నీ + హాట్‌స్టార్ VIP సబ్స్క్రిప్షన్ ఇండియాలో మొదలయి రెండు వారలు అవుతోంది. ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఇంటి వద్ద ఉండడం వలన అందరు దీనిని సబ్స్క్రయిబ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ డిస్నీ + హాట్‌స్టార్ VIP ను ఉచితంగా సంవత్సరం పాటు పొందే అవకాశాన్ని టెలికాం ఆపరేటర్ భారతి ఎయిర్‌టెల్ అందిస్తోంది. ఎయిర్‌టెల్ ఇప్పుడు కొత్తగా ఒక డేటా ప్యాక్‌ను విడుదల చేసింది. ఇది డిస్నీ + హాట్‌స్టార్ విఐపి సభ్యత్వంను ఒక సంవత్సరం చెల్లుబాటు కాలానికి ఉచితంగా అందిస్తుంది. డిస్నీ + హాట్‌స్టార్ విఐపి చందా ధర సంవత్సరానికి రూ.399 ధర వద్ద అందిస్తోంది.

ఎయిర్టెల్ యొక్క కొత్త రూ.401 డేటా రీఛార్జ్ ప్లాన్

ఎయిర్టెల్ యొక్క కొత్త రూ.401 డేటా రీఛార్జ్ ప్లాన్

ఎయిర్టెల్ యొక్క కొత్త రూ.401 డేటా రీఛార్జ్ ప్లాన్ రోజువారి 3 జిబి డేటా ప్రయోజనంను అందిస్తుంది. ఈ ప్లాన్ వాయిస్ కాలింగ్ లేదా ఎస్ఎంఎస్ ప్రయోజనాలను అందించదు. రోజువారీ ప్రయోజనం రీఛార్జ్ చేసిన తేదీ నుండి కేవలం 28 రోజులకు పరిమితం. భారతి ఎయిర్‌టెల్ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ చందాను రూ.349 యొక్క అపరిమిత కాంబో ప్రీపెయిడ్ ప్లాన్‌తో అందిస్తోంది. అయితే ఇప్పుడు ఇది హాట్‌స్టార్తోను కూడా ఉచితంగా అందిస్తోంది. భారతి ఎయిర్‌టెల్ యొక్క కొత్త రూ.401 ప్యాక్ ఇప్పటికే అన్ని సర్కిల్‌లలో రీఛార్జ్ చేయడానికి అందుబాటులో ఉంది మరియు ప్రతి ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్ ఎటువంటి సమస్యలు లేకుండా దీనిని పొందవచ్చు. ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

ఎయిర్టెల్ రూ .398 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ రూ .398 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాలు

భారతి ఎయిర్‌టెల్ తన చందాదారులకు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రారంభించడం చూసి కొంతకాలం అయ్యింది. భారతి ఎయిర్‌టెల్ రూ .398 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది, ఇది వినియోగదారుకు రోజుకు 3 జిబి డేటా, భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను 28 రోజులకు అందిస్తుంది.

ఎయిర్టెల్ రూ .401 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ రూ .401 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాలు

భారతి ఎయిర్‌టెల్ కొత్తగా ప్రారంభించిన రూ.401 ప్రీపెయిడ్ ప్లాన్ వాయిస్ కాలింగ్ మరియు ఎస్ఎంఎస్ ప్రయోజనాలను తొలగించి దానికి బదులుగా ఇది మొత్తం 28 రోజుల చెల్లుబాటు కాలానికి 3GB రోజువారీ డేటాను అందిస్తుంది. అలాగే భారతి ఎయిర్‌టెల్ రూ.399 విలువైన డిస్నీ + హాట్‌స్టార్ విఐపి చందా ప్రయోజనాన్ని అదనపు ఖర్చు లేకుండా ఉచితంగా అందిస్తోంది. ఇందులో ఉత్తమమైన భాగం ఏమిటంటే డిస్నీ + హాట్‌స్టార్ విఐపి చందాను 365 రోజులు లేదా ఒక సంవత్సరం చెల్లుబాటు కాలానికి అందించడమే. మరొక రకంగా చూసుకుంటే మొత్తంగా ఎయిర్‌టెల్ వినియోగదారులు  డిస్నీ + హాట్‌స్టార్ విఐపి చందాను పొందే ధర వద్ద 84GB డేటాను ఉచితంగా పొందినట్లే. లాక్ డౌన్ లో ఇంటి వద్ద పనిచేస్తున్న వారికి ఇది సరిగ్గా ఉపయోగపడుతున్నది.

ముఖ్య గమనిక

ముఖ్య గమనిక

భారతి ఎయిర్‌టెల్ యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ కోసం నిబంధనలు మరియు షరతులను విధించింది. ఎయిర్టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులు సంవత్సరానికి కేవలం ఒకసారి మాత్రమే ఈ కొత్త ప్లాన్ తో రీఛార్జ్ చేయగలరు. కస్టమర్ సమస్యలను నివారించడానికి కస్టమర్ 360 రోజులకు ఒకసారి మాత్రమే ఈ ఉత్పత్తితో రీఛార్జ్ చేయగలరు అని టెల్కో తెలిపింది.

రూ.401 రీఛార్జ్ పైన కస్టమర్లు మరే ఇతర ప్రీపెయిడ్ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చని ఎయిర్‌టెల్ ధృవీకరించింది. ఇది డేటా ప్యాక్ కాబట్టి ఎయిర్టెల్ ప్రీపెయిడ్ యూజర్లు వాయిస్ కాల్స్ మరియు ఎస్ఎంఎస్ ప్రయోజనాలను ఆస్వాదించడానికి ఏదైనా అపరిమిత కాంబో ప్లాన్ తో కూడా రీఛార్జ్ చేయవచ్చు. డేటా ప్రయోజనం 28 రోజుల తర్వాత ముగుస్తుంది కానీ డిస్నీ + హాట్‌స్టార్ విఐపి సభ్యత్వం ఒక సంవత్సరానికి చెల్లుతుంది. డిస్నీ + హాట్‌స్టార్ విఐపి సభ్యత్వం ఒక్కొక్కటిగా తీసుకుంటే సంవత్సరానికి 399 రూపాయలు.

ఎయిర్టెల్ ద్వారా డిస్నీ + హాట్స్టార్ సభ్యత్వాన్ని ఎలా యాక్టీవ్ చేయాలి?

ఎయిర్టెల్ ద్వారా డిస్నీ + హాట్స్టార్ సభ్యత్వాన్ని ఎలా యాక్టీవ్ చేయాలి?

భారతి ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లు డిస్నీ + హాట్‌స్టార్ విఐపి సభ్యత్వాన్ని పొందడానికి ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా లేదా రీఛార్జ్ పూర్తయిన తర్వాత కస్టమర్ యొక్క మొబైల్ నంబర్‌కు పంపిన లింక్ ద్వారా యాక్టివేట్  చేయవచ్చు. ఎయిర్టెల్ థాంక్స్ ఒక ప్రత్యేకమైన విభాగాన్ని కలిగి ఉంది. ఇక్కడ వినియోగదారులు వారి శ్రేణి ఆధారంగా ఒక నిర్దిష్ట ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ప్లాన్‌తో కొనుగోలు చేసిన డిస్నీ + హాట్‌స్టార్ విఐపి చందా ఆటోమ్యాటిక్ గా పనిచేస్తుందని ఎయిర్‌టెల్ పేర్కొంది. డిస్నీ + హాట్‌స్టార్ విఐపి సభ్యత్వాన్ని పొందడానికి రీఛార్జ్ చేయబడిన అదే సంఖ్యతో వినియోగదారు లాగిన్ అవ్వాలి.


డిస్నీ + హాట్‌స్టార్ చందా యొక్క స్టేటస్ ను హాట్‌స్టార్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో లేదా హాట్‌స్టార్ యొక్క మొబైల్ యాప్ వద్ద తనిఖీ చేయవచ్చు. కొత్తగా ప్రారంభించిన రీఛార్జిని ఎయిర్టెల్ రిటైలర్లు & ఆన్‌లైన్ ఏదైనా యాప్ / చెల్లింపు మోడ్‌లో అన్ని మోడ్ల ద్వారా పొందవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
How Get The Disney+ Hotstar VIP Subscription at Free Of Cost
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X